శివాజీ, పీష్వాలు:
శివాజీ(1627-1680) Maratha Empire:
1627లో షాజీ భోంస్లే, జిజియాబాయిలకు శివాజీ పూణేలోని శివనేర్ కోటలో జన్మించాడు
షాజీ భోంస్లే యొక్క తండ్రి మాలోజీ అహ్మద్ నగర్ పాలకుల వద్ద సైనిక అధికారిగా పని చేశాడు. అప్పుడే మాలోజీకి పూనే జాగీర్ ఇవ్వబడింది.
మాలోజీ ఒక సూఫీ సన్యాసి అయిన హజరత్ షా షరీఫ్‌ను ఆరాధించేవాడు. అతని దీవెనల కారణంగానే మాలోజీకి ఇద్దరు కుమారులు జన్మించారు. మాలోజీ ఆ ఇద్దరు కుమారులకు షాజీ మరియు షరీఫ్ జీ అని పేర్లు పెట్టాడు.
మాలోజీ కుమారుడైన షాజీ భోంస్లే మొదటిగా అహ్మద్‌నగర్ పాలకుల వద్ద పని చేసి తరువాత బీజాపూర్ సైన్యంలో చేరాడు.
షాజీ భోంస్లే బీజాపూర్ అదిల్‌షా పాలనా కాలంలో బెంగళూరు వైశ్రాయ్గా నియమించబడ్డాడు.
షాజీ భోంస్లేతో పాటు జిజియాబాయి బెంగళూరుకు వచ్చుటకు నిరాకరించింది. పూణేను విడిచిపెట్టనని పట్టుబట్టింది. దీంతో షాజీ భోంస్లే జిజియాబాయి మరియు శివాజీని పూణేలోనే ఉంచి తాను బెంగళూరుకు వెళ్లిపోయాడు.
శివాజీ సంరక్షకుడు - దాదాజీ కొండదేవ్
శివాజీ మత గురువు - సమర్థ రామదాస్
సమర్థ రామదాసు యొక్క “దశబోధ' గ్రంథం శివాజీని ఉత్తేజపరిచింది.
మహారాష్ట్ర భక్తుడు తుకారాంతో శివాజీకి సన్నిహిత సంబంధం ఉంది.
శివాజీకి ఐదుగురు భార్యలు
1 సాయీ బాయి (నింబాల్కర్)
2 సోయరా బాయి
3 పుతలా బాయి
4 సఫర్ బాయి
5 కాశీ బాయి
1627 - శివాజీ జననం
1646 - శివాజీ మొదటి ఆక్రమణ “తోరణదుర్గం” (మహారాష్ట్ర) తర్వాత కందన, పురందర్ ప్రాంతాలను ఆక్రమించాడు.
1656 - శివాజీ మొదటి గొప్ప ఆక్రమణ-జావలీ (దీనిని పూణె పాలకుడు చంద్రరావు మోరే నుండి ఆక్రమించాడు)
1659 - శివాజీని బంధించుటకు బీజాపూర్ సుల్తాన్ అఫ్జల్‌ఖాన్‌ను పంపాడు. కానీ ఇతను ప్రతాప్‌ఘడ్ కోట వద్ద శివాజీచే చంపబడ్డాడు.
1660-63 - శివాజీని పట్టుకొనుటకు ఔరంగజేబు వహిస్థాఖాన్‌ను వంపాడు. కానీ ఇతను విఫలమయ్యాడు. బెరంగజేబు శివాజీని మౌంటెన్ ర్యాట్ అని పేర్కొన్నాడు.
1665 - శివాజీని పట్టుకొనుటకు ఔరంగజేబు జైసింగ్‌ను పంపాడు. ఇతను శివాజీని అనేక చిన్నచిన్న యుద్ధాలలో ఓడించి అతనిచే పురందర్ ఒప్పందంపై సంతకం చేయించాడు. దీనిలో అంశాలు:
1) జెరంగజేబు సైన్యంలో చేరుటకు శివాజీ అంగీకరించాడు.
2) శివాజీ 35 కోటలలో 23 కోటలు ఔరంగజేబుకు ఇచ్చుటకు అంగీకరించాడు.
3) కరెన్సీ(హన్స్) లేదా నష్టపరిహారం చెల్లించుటకు శివాజీ అంగీకరించాడు.
1666 - ఔరంగజేబును కలుసుకొనుటకు శివాజీ ఆగ్రా వెళ్లాడు. కానీ తనకు తక్కువ మన్సబ్‌దారీ ర్యాంక్ ఇచ్చుటను అవమానకరంగా భావించి శివాజీ ఔరంగజేబును దూషించాడు. దీంతో శివాజీ ఆగ్రా కోటలో బంధించబడ్డాడు.
రోషనారా సహాయంతో శివాజీ ఒక బిచ్చగాడు వేషం వేసుకొని కోట నుండి తప్పించుకున్నాడు.
తరువాత తాను పోగొట్టుకున్న కోటలను తిరిగి ఆక్రమించుట ప్రారంభించాడు.
1672 - సూరత్‌ను కొల్లగొట్టాడు
1674 - మహారాష్ట్రలోని రాయగఢ్‌లో శివాజీ పట్టాభిషేకం చేయించుకున్నాడు. (శివాజీ రాజధాని-రాయ్‌గఢ్) గాగాభట్ శివాజీకి పట్టాభిషేకం చేశాడు.
ఈ సందర్భంగా శివాజీ “ఛత్రపతి” బిరుదు పొందాడు.
ఈ పట్టాభిషేకానికి హాజరైన ఆంగ్లేయుడు -ఆక్సెన్‌దెన్
శివాజీని హైందవ ధర్మోద్ధారక(హిందుత్వ రక్షకుడు) అని కూడా అంటారు.
1676 - శివాజీ మరియు హసన్ తానీషా మధ్య గోల్కొండ ఒప్పందం జరిగింది.
1680లో శివాజీ మరణం
1674-80 మధ్య కాలంలో శివాజీ పరిపాలనపై దృష్టి సారించాడు
అష్టప్రధానులు అనే మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశాడు
అష్ట ప్రధానులలో ముఖ్యమైనవాడు - పీష్వా
చౌత్(1/4), సర్ధేశ్‌ముఖి(1/10) అనే పన్నులను వసూలు చేశాడు.
చౌత్ పన్నును ఇతను గ్రామాలపై దాడి చేయకుండా ఉండటానికి వసూలు చేసేవాడు.
సర్దేశ్‌ముఖి పన్నును ఇతరులు ఆ గ్రామాలపై దాడి చేయకుండా రక్షణ కల్పించుటకు వసూలు చేశాడు.
ఎం.జి.రనడే శివాజీ యొక్క చౌత్, సర్దేశ్‌ముఖి పన్నులను బ్రిటిష్ యొక్క సైనిక సహకార విధానంతో పోల్చాడు.