శివాజీ పరిపాలన:
శివాజీ రాజ్యానికి స్వరాజ్యమని పేరు
కేంద్ర ప్రభుత్వంలో రాజు, అష్ట ప్రధాన్‌లు ఉండేవారు
1. పీష్వా లేదా ముఖ్య ప్రధాన్ -ప్రధాని
2. అమాత్య లేదా మజుందార్ -ఆర్థికమంత్రి
3. సుమంత/దాబీర్ -విదేశాంగమంత్రి
4. మంత్రి/వాకియానావిస్ -నిఘా, స్వదేశీ వ్యవహారాలు (హోంమంత్రి)
5. సచివ్/సుర్నవిష్ -లేఖల సూపరిండెంట్ / ఉత్తర ప్రత్యుత్తరాలు
6. సేనాపతి/సారినోబత్ -సైన్యాధిపతి
7. సదర్/పండిత్‌రావు -మతాధిపతి
8. న్యాయాదీష్ -న్యాయమూర్తి
రాజ్యం 4 రాష్రాలు/సుబాలుగా విభజన చేయబడింది. సుభాకు అధిపతి సుబేదార్/మమ్లత్‌దార్
సుభా పరగణగా, పరగణ తరఫ్‌గా, తరఫ్ మౌజాగా విభజించబడ్డాయి.
జీతాలకు బదులుగా భూమి పన్ను వసూలు హక్కు కల్పించడాన్ని సరంజామి విధానం అంటారు.
వీరి కాలంలో గ్రామాధికారులను పటేల్, ముఖ్య, కులకర్ణి అని పిలిచేవారు.
ఇతను గ్రామాల్లో బారాబలుతాదార్ (12 అయ్యగార్లు) విధానం ప్రవేశపెట్టారు.
భూమిశిస్తు 2/5 వంతు నిర్ణయించబడింది
శివాజీ 200 యుద్ధ నౌకలు, 80 ఫిరంగులు ఉండేవి. నౌకాదళం 'కొలాబా'లో ఉండేది.
మధ్య యుగంలో నౌకాదళ నిర్మాణపు అవసరాన్ని గుర్తించిన మొదటి భారతీయ పాలకుడు శివాజీ అని ఎ. ఎల్.శ్రీవాస్తవ పేర్కొన్నాడు.
1680-89 (శంభాజీ పాలన):
ఔరంగజేబు కుమారుడు అక్బర్ తిరుగుబాటు చేసినపుడు ఇతీను అక్బర్ కు ఆశ్రయం కల్పించాడు.
సంగమేశ్వర్ యుధ్ధంలో ఇతను మొగల్ సేనాని ముకారిబ్‌ఖాన్‌చే చంపబడ్డాడు.
ఇతని కుమారుడు షాహు ఔరంగజేబు ఆస్థానంలో బంధించబడ్డాడు.
ఔరంగజేబు కుమార్తె జెబురున్నీసా షాహుకు విద్యను బోధించింది.
1689-1700 (రాజారామ్ పాలన):
ఇతను షాహూ చెప్పులను సింహాసనంపై పెట్టి పాలించేవాడు.
ఇతను “ప్రతినిధి అనే పదవిని సృష్టించాడు.
మొదటి ప్రతినిధి -ప్రవ్లాద్ నిరాజ్
ఇతను రాజధానిని సతారాకు మార్చాడు
ఇతని భార్య తారాబాయి
1700-1708 (3వ శివాజీ పాలన/తారాబాయి యుగం):
ఈ మధ్యకాలంలో తారాబాయి 3వ శివాజీ యొక్క సంరక్షకురాలుగా ఉంటూ మరాఠా రాజ్యంను పాలించింది.
1708లో షాహూ, ఏసూబాయి(తల్లి) చేతిలో ఖేద్ వద్ద పరాజయం పాలై తారాబాయి కొల్దాపూర్‌లో స్థిరపడింది. (వార్నా ఒప్పందం ప్రకారం తారాబాయి కొల్హాపూర్‌లో స్వతంత్ర పాలన చేసింది)
1708-49 (షాహూ పాలన):
షాహూకు విద్య కల్పించినది - జెబురున్నీసా (ఔరంగజేబ్ కుమార్తె)
1707లో ఔరంగజేబు మరణానంతరం అతని కుమారుడు ఆజమ్‌షా/1వ బహదుర్‌షా షాహును విడుదల చేశాడు.
షాహు పట్టాభిషేకం సతారా వద్ద జరిగింది.
ఇతని కాలంలో బాలాజీ విశ్వనాథ్ పీష్వాగా నియమించబడ్డాడు.
ఇతని కాలం నుండి మరాఠా రాజుల ప్రాధాన్యం తగ్గి పీష్వాల ఆధిపత్యం ప్రారంభమైంది.
రాంరాజా(1749-80 దశకం) :
ఇతను సంఘోలా ఒప్పందం ప్రకారం రాజు అయ్యాడు. కానీ పెద్దగా గుర్తింపులేదు.
పీష్వాలు మొత్తం పాలనను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
పీష్వాలు:
1) బాలాజీ విశ్వనాథ్ (1712-20):
బిరుదు - సేనకర్తే (చంద్రసేన్ జాదవ్ ఈ బిరుదు ఇచ్చాడు)
పీష్వా పదవిలో వారసత్వమును ప్రవేశపెట్టాడు.
పీష్వా పదవిని అతి ముఖ్యమైన, శక్తివంతమైనదిగా రూపొందించాడు.
అసమానమైన సేవకుడు, మహారాష్ట్ర సామ్రాజ్య స్థాపకుడు.
ఫరూక్ సియర్‌ను సింహాసనష్టుడిని చేసి మహారాష్ట్రుల ప్రభావం దక్కన్ అంతా వ్యాప్తి చెందించడం ఈయన పాలనలో ముఖ్య విషయం.
2) 1వ బాజీరావు(1720-40):
ఇతను అతిగొప్ప పీష్వా
హిందూ పద్ పద్ షాహీ సిద్ధాంతంను పేర్కొన్నాడు.
ఇతని కాలంలో హైదరాబాద్ నవాబు నిజాం-ఉల్-ముల్క్ అసఫ్‌జాహీ రాజ్యాన్ని స్థాపించాడు.
ఇతను నిజాం-ఉల్-ముల్క్‌ను ఫల్ఖేడ్ యుద్ధంలో ఓడించి ముంగి షివ్‌గామ్ అనే ఒప్పందం ప్రకారం చౌత్, సర్దేశ్‌ముఖి పన్నులను వసూలు చేసుకొనుటకు హక్కులు పొందాడు.
శివాజీ తరువాత గెరిల్లా వ్యూహాలకు అతిగొప్ప నాయకుడు. ఇతడు పీష్వాలందరిలోకి గొప్పవాడు.
ఇతన్ని రణవీరుడైన పీష్వా, మూర్తీభవించిన హిందూశక్తిగా పేర్కొన్నారు.
మహారాష్ట్రుల అధికారాన్ని ఉత్తర భారత్‌లో స్థాపించాడు. హిందు పద్ పాదుషాహీ లేదా అఖిల భారత సామ్రాజ్య స్థాపన ఇతని మహోన్నత ఆశయం.
3) బాలాజీ బాజీరావు(1740-61):
ఇతనిని నానాసాహెబ్ అని కూడా పిలిచేవారు
1751లో ఒరిస్సాను బెంగాల్ పాలకుడు అలీ వర్దిఖాన్ నుండి పొందాడు.
ఇతని కాలంలో 1761లో ఆఫ్ఘన్ దండయాత్రికుడు అహ్మద్‌షా అబ్దాలీ మరాఠా జనరల్స్ అయిన సదాశివరావు, విశ్వారావు భావేలను ఓడించాడు.
ఈ వార్త విన్న బాలాజీ విశ్వనాథ్ అనారోగ్యానికి గురై మరణించాడు.
1వ మాధవరావు(1761-73):
ఇతను అలహాబాద్‌లో బందీగా ఉన్న మలి మొగల్ చక్రవర్తి 2వ షాలంను ఢిల్లీకి తిరిగి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించాడు.