హుమయూన్(1530-40, 1555-56):
హుమయూన్ అనగా అదృష్టవంతుడు
1530 - డిసెంబర్ 29న హుమయూన్ మొఘల్ చక్రవర్తిగా పట్టాభిషేకం చేశాడు.
1532 - దౌరాయుద్ధంలో మహమ్మద్ లోడిని ఓడించాడు.
1535 - మాండాసోర్ యుద్ధంలో గుజరాత్ పాలకుడు బహదూర్ షాను ఓడించాడు.
1537 - చునార్ యుద్ధంలో షేర్షాను ఓడించి బెంగాల్‌లో గౌడ ప్రాంతం వరకు దండయాత్ర కొనసాగించాడు. - గౌడ్‌లో కొన్ని నెలలపాటు విలాసవంతమైన జీవితం గడుపుతూ దానికి జన్నతాబాద్(స్వర్ణాల నగరం) అని పేరు పెట్టాడు.
ఈ మధ్య కాలంలో ఆగ్రాలో హుమయూన్ సోదరుడు హిందాల్ తానే మొగల్ చక్రవర్తినని ప్రకటించుకున్నాడు.
1539 - చౌసా యుధ్ధంలో షేర్షా హుమయూన్‌ను ఓడించాడు. హుమయూన్ తన ప్రాణాలను రక్షించుకొనుటకు కర్మనాసా నదిలో దూకాడు. అతని జనరల్ నిజాం షా హుమయూన్ ప్రాణాలు కాపాడాడు.
1540 - బిలగ్రామ్ /కనాజ్ యుద్భంలో షేర్షా హుమయూన్‌ను పూర్తిగా ఓడించాడు. దీంతో హుమయూన్ తన రాజ్యం కోల్పోయి. మధ్య భారతదేశ అడవులకు చేరాడు.
1541 - మధ్య భారతదేశ అడవులలో హమీద(భాను)బేగంను వివాహం చేసుకున్నాడు.
1542 - రాజస్థాన్-సింధ్‌లోని అమర్‌కోట్ (ప్రస్తుతం పాకిస్తాన్ సింధ్‌లోని ఉమర్‌కోట్) పాలకుడు రాజా వీర్‌సల్/రాణాప్రసాద్ ఆస్థానంలో హుమయూన్, హమీదాబాను బేగంకు అక్బర్ జన్మించాడు. (అక్చర్‌ను మహామంగ పెంచింది)
1545-హుమయాూన్, భానుబేగం పర్షియా చేరుకున్నారు. అప్పటి పర్షియా పాలకుడు షాథామాప్స్ (సఫావిద్ వంశం) సహాయాన్ని హుమయూన్ అర్థించాడు. షాదా మాస్స్ 'కాందహారొను గెలిచిన తర్వాత దానిని తనకు అప్పగించాలనే షరతుతో ఆశ్రయం ఇచ్చాడు.
1553 - పర్షియా సహాయంతో హుమయూన్ కాబూల్ పాలకుడు కమ్రాన్‌ను ఓడించి అతన్ని గుడ్డివాణ్ణి చేశాడు. ఇక్కడే హుమయూన్ తను పోగొట్టుకున్న అక్చర్‌ను మరలా కలిశాడు. అక్బర్‌ను పంజాబ్‌కు పాలకుడిని చేసి బైరంఖాన్‌ను అతనికి సంరక్షకుడిగా నియమించాడు.
1555 - మచ్చివార, సర్‌హింద్ యుద్దాలలో సికిందర్ సూర్‌ను ఓడించి మరలా ఢిల్లీపై మొఘలుల పాలనను స్థాపించాడు.
1556 - దీన్‌పన్హాలో తన వ్యక్తిగత గ్రంథాలయం షేర్‌మండల్‌లో మెట్ల పైనుండి జారిపడి ప్రమాదవశాత్తు మరణించాడు.
హుమయూన్ ఢిల్లీలో దిన్‌పన్హాను నిర్మించాడు.
హుమయూన్ తులాభారంను ప్రవేశపెట్టాడు
హుమయూన్ దస్తాన్-ఇ-అమీర్‌వాంజా అనే పెయింటింగ్ వేయించాడు.
హుమయూన్‌కు పరమ శత్రువు హుమయూనే. అతనికి గల నల్లమందు తినే వ్యసనం కొంతవరకు అతని పతనానికి కారణంగా చెప్పవచ్చు.
ఇతని మరణానంతరం హేమూ ఢిల్లీని ఆక్రమించి కొన్ని రోజులపాటు పాలించాడు.
హేమూ ఢిల్లీకి చివరి హిందూ పాలకుడు
బెంగాల్ పాలకుడు ఆలీ అదిల్‌షా హేమూకు విక్రమజిత్ అనే బిరుదును ఇచ్చాడు.
హుమయూన్ సమాధిని అతని భార్య హాజీ బేగం/ హమిదాభాను బేగం ఢిల్లీలో నిర్మించింది.
మొట్టమొదటిసారిగా ఈ సమాధి నిర్మాణంలో పాలరాయి ఉపయోగించారు. దీని ఆధారంగానే తాజ్‌మహల్ నిర్మించబడింది.