మొఘల్‌ సామ్రాజ్యం Mughal Dynasty-6

TSStudies

జహంగీర్‌ (1605-27) Mughal Empire Jahangir:

founder of Mughal Dynasty,Mughal Dynasty founder,introduction to Mughal Dynasty in telugu,Mughal Dynasty introduction in telugu,history of Mughal Dynasty in telugu,Mughal Dynasty history in telugu,history of babar Mughal Dynasty in telugu,history of delhi sultanate in telugu,delhi sultanate in telugu,tspsc group2 indian history in telugu,indian history Mughal Dynasty in telugu,Mughal Dynasty notes in telugu,Mughal Dynasty study material in telugu,delhi sultanate notes in telugu,delhi sultanate study material in telugu,list of kings of Mughal Dynasty,Mughal Dynasty kings,Mughal Dynasty empire,list of kings of delhi sultanate in telugu,Mughal empire kings,Mughal Dynasty upsc,Mughal Dynasty tspsc,kings of Mughal Dynasty,mughal dynasty jahangir,mughal dynasty jahangir  history in telugu,history of mughal dynasty jahangir,mughal dynasty jahangir wife name,mughal empire jahangir history in telugu,mughal empire jahangir invasion,mughal empire jahangir battles list,
తల్లి పేరు హీరాకున్వారి లేదా మరియమ్‌-ఉజ్‌ -జమాని/ జోదా (అమీర్‌పాలకుడు రాజా బారామల్‌ కుమార్తె, భగవాన్‌ దాస్‌ సోదరి).
1605 - నూరుద్దీన్‌ మహమ్మద్‌, సలీం జహంగీర్‌ (విశ్వాన్ని జయించాడు) అనే బిరుదు పొంది మొఘల్‌ చక్రవర్తి అయ్యాడు. అదే సం1॥లో 12 ఇస్లామిక్‌ చట్టాలను ప్రకటించాడు.
1606 - జహంగిర్‌పై తిరుగుబాటు చేసిన అతని పెద్ద కుమారుడు ఖుస్రూ మీర్జాకు అర్జున్‌దేవ్‌ సహకరించాడు. దీనితో సిక్కుల 5వ గురువు అర్జున్‌దేవ్‌ ఉరి తీయబడ్డాడు.
1608 - ఈస్ట్‌ ఇండియా కంపెనీ రాయబారి హాకిన్స్‌ జహంగీర్‌ ఆస్థానంను సందర్శించాడు.
1611 - నూర్జహాన్‌ను వివాహమాడాడు
1614 - మేవాడ్‌ అమరసింహను ఓడించాడు
1615 - బ్రిటీష్‌ రాయబారి సర్‌ థామస్‌రో ఇతని ఆస్థానంను సందర్శించాడు.
1626 - జహంగీర్‌ జనరల్‌ మహబత్‌ఖాన్‌ తిరుగుబాటు చేసి జహంగీర్‌ను బంధించాడు. ఈ సమయంలో నూర్జహాన్‌ కీలక పాత్ర పోషించి జహంగీర్‌ను విడిపించి మహబత్‌ఖాన్‌ను అణిచివేసింది.
1627 - జహంగీర్‌ మరణించాడు
జహంగీర్‌ కాలంలో చిత్రలేఖనం అత్యధికంగా అభివృద్ధి చెందింది.
ఇతని కాలంలో 'మసిసుర్‌” మినియేచర్‌ పెయింటింగ్‌లో ప్రసిద్ధి చెందినవాడు.
ఉస్తాద్‌ మన్సూర్‌ జంతు చిత్రలేఖనంలో ప్రసిద్ధి చెందినవాడు.
బిషన్‌దాస్‌ -పోలికల పెయింటింగ్‌కు ప్రసిద్ధి (మాస్టర్‌ ఆఫ్‌ టైట్స్‌)
జహంగీర్‌ చివరి రోజుల్లో ఉబ్బసపు వ్యాధితో బాధపడ్డాడు
జహంగీర్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి. అతనికి భాషలలో, చరిత్రలో, భూగోళశాస్త్రంలో, చిత్రలేఖనంలో, సంగీతంలో, వాస్తు, తోటపనిలో ఆసక్తి కలవు.
జహంగీర్‌ సౌందర్యాధికుడు. అతనికి పాటలంటే ఇష్టం. అతడు శ్రీనగర్‌ వద్దగల షాలిమార్‌, నిషాత్‌ తోటలను ఏర్పరిచాడు.
భారతదేశంలో అక్బర్‌ కాలంలో పొగాకు ప్రవేశపెడితే, జహంగీర్‌ కాలంలో పొగాకు నిషేధించబడింది.
జహంగీర్‌ తన స్వీయ చరిత్ర జహంగీర్‌ నామాను రచించాడు. ఈ రచన ప్రకృతిపై అతనికి గల గాఢమైన అభిమానాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.
జహంగీర్‌ అబుల్‌ ఫజల్‌ను హత్య గావించాడు. ఇతను సింహాసనం అధిష్టించేనాటికి ఇతనికి 36 ఏళ్లు.
జహంగీర్‌ 12 శాసనాలు ప్రవేశపెట్టాడు. వాటిలో ముఖ్యమైనవి
1) ముక్కు చెవులు ఖండించడం ద్వారా అంగ వైకల్యం చేయడమనే క్రూరమైన శిక్షల రద్దు
2) మత్తు పానీయాలు, మత్తు మందు నిషేధం
3) కొన్ని ప్రకటిత దినాల్లో జంతువధ నిషేధం
4) రహదారుల్లో ఉచిత వైద్యశాలలు, మసీదులు, ధర్మశాలల నిర్మాణం.
5) ప్రజలకు న్యాయాన్ని చేకూర్చుటకై బంగారు గొలుసు గంటను అమర్చాడు.
నేను ఒక గిన్నెడు ద్రాక్షా పానానికి, ఒక పాత్ర మాంసానికి  నా రాజ్యాన్ని నా ప్రియమైన రాణికి అమ్ముకొన్నా అని జహంగీర్‌ తన స్మృతులలో విచారం వ్యక్తం చేశాడు.
జహంగీర్‌ అక్బర్‌ సమాధిని సికిందరా వద్ద నిర్మించాడు.

నూర్దహాన్‌:
నూర్జహాన్‌ మొదటి పేరు మెహరున్నీసా. జహంగీర్‌తో వివాహం అయిన తర్వాత మొదట నూర్‌ మహల్‌ (అంతఃపుర జ్యోతి) అని, ఆ తర్వాత నూర్జహాన్‌ (ప్రపంచజ్యోతి) అని పిలవడం జరిగింది.
మొదటి భర్త షేర్‌ ఆఫ్ఘాన్‌.
మొహరున్నీసా, షేర్‌ ఆష్టాన్‌కు జన్మించిన కుమార్తె లాడ్లీబేగం
ఈమె తండ్రి ఘియాజ్‌బేగ్‌. ఇతని బిరుదు ఇతిముదధౌలా. ఈమె సోదరుడు ఆసఫ్‌ఖాన్‌
తన తండ్రి జ్ఞాపకార్థం ఇతిముడ్దైలా అనే సమాధిని ఆగ్రాకి దగ్గర్లో నిర్మించింది. (పూర్తిగా పాలరాతితో నిర్మితమైన మొట్టమొదటి కట్టడం)
ఈ కట్టడంలో మొట్టమొదటిసారిగా పియత్రాదుర (పిట్రాడ్యూరా) విధానం ఉపయోగించబడింది. (గోడలపై ఖురాన్‌ శ్లోకాలను, ఇతర చిత్రాలను చెక్కడాన్నిి విలువైన రాళ్లను నగీషులుగా అమర్చడాన్ని పియత్రాదుర అంటారు)
ఈమె గులాబీల నుండి మొదటిసారిగా సుగంధం (సెంటు)ను తయారు చేసింది.
ఈమె కుమార్తె లాడ్లీ బేగంను షరయార్‌ కిచ్చి వివాహం చేసింది.
ఈమె నూర్లహాన్‌ జుంటాను ఏర్పాటు చేసింది. దీనిలో సభ్యులు నూర్జహాన్‌, అసఫ్‌ఖాన్‌, షాజహాన్‌, షరయార్‌ మొదలగువారు.