మొఘల్‌ సామ్రాజ్యం Mughal Dynasty-5

TSStudies
అక్బర్‌ మన్సబ్‌దారీ విధానం:
ఇది మొఘలుల మిలిటరీ వ్యవస్థ. దీనిని 1570లో అక్బర్‌ ప్రవేశపెట్టాడు. మూడు తరహా మన్సబ్‌దార్లు ఉండేవారు
1) మన్సబ్‌దార్‌ : 500 కంటే తక్కువ సైనికులకు అధిపతి
2) అమీర్‌ : 500-2500 మంది సైనికులకు అధిపతి
3) అమీర్‌-ఇ-ఆజమ్‌ : 2500 కంటే ఎక్కువ మంది సైనికులకు అధిపతి
అశ్వక దళంలో 3 రకాల అధిపతులు ఉండేవారు.
1) సే ఆస్పా - 3 గుర్రాలు ఉంటాయి
2)దో ఆస్పా - 2 గుర్రాలు ఉంటాయి
3) నీమ్‌ సవార్‌ - 1 గుర్రం ఉంటుంది
అక్బర్‌ కాలంలో అత్యధిక మన్సబ్‌దార్‌ ర్యాంక్‌ -7000. 
7000 ర్యాంక్‌ పొందిన ఇద్దరు మన్సబ్‌దార్లు - మాన్‌సింగ్‌, మీర్జా అజీజ్‌ కోకా

దీన్‌-ఇ-ఇలాహి:
ఈ మతం ప్రకారం ప్రతి ఉదయం చక్రవర్తి సూర్యున్ని పూజించేవాడు.
తన రాజోద్యోగులలో మాన్‌నింగ్' ఈ మతాన్ని అనుసరించడానికి నిరాకరించాడు.
అక్బర్‌ తన గురువు అబ్దుల్  లతీఫ్‌ బోధించిన సులేకుల్‌ ఆధారంగా దీన్‌-ఇ-ఇలాహిని ప్రకటించాడు.
ఈ మతాన్ని ప్రకటించక ముందు అక్బర్‌ ఇబాదత్‌ ఖానాలో మత చర్చలు నిర్వహించాడు.
ఈ మత చర్చల్లో పాల్గొన్నవారు
1) హిందూ మతం - పురుషోత్తమ్‌, దేవి
2) క్రిస్టియానిటీ - అక్వావిరా, మాన్సరేట్‌
3) జైన మతం - హేరవిజయ సూరి (జగద్గురు, యుగప్రదాన్‌)
4) జొరాస్ట్రియన్‌ -నవసారి మహారాజు రాణా
అక్బర్‌ దీన్‌-ఇ-ఇలాపా ప్రకటించిన తర్వాత ఇన్సాన్‌-ఇ-కమీన్‌ అనీ బిరుదు పొందాడు.
అక్బర్‌ మత విషయాల్లో చక్రవర్తిని సర్వాధికారిని చేస్తూ అమోఘత్వ ప్రకటన జారీ చేశాడు.

నిర్మాణాలు:
1) ఆగ్రాకోట:
దీని ఆర్కిటెక్ట్‌ -ఖాసిం
ఇది భారత్‌లో అతి పటిష్టమైన కోట
దీనిని రాజపుత్రులు కోటల ఆధారంగా నిర్మించాడు. దీని లోపల ముఖ్య కట్టడాలు
1) అక్చరీ మహల్‌
2) జహంగరీ మహల్‌
3) ముసామమ్‌ బురుజు .
4) అమరసింహ ద్వారం.

2) ఫతేపూర్‌ సిక్రీ:
దీని ఆర్కిటెక్ట్‌ -బహవుద్దీన్‌
ఫతేపూర్‌ సిక్రీలో జామా మసీదు అద్భుతమైన కట్టడం. ఆగ్రాకు దగ్గరలో ఉంది
దీనిలో ముఖ్య కట్టడాలు
1) బులంద్‌ దర్వాజ ను
2) ఇబాదత్‌ ఖానా (ఇక్కడే సలీంచిస్థీ సమాధి ఉంది)
3) పంచ్‌ మహల్‌ (బౌద్ధ మత ప్రభావం దీనిపై ఉంది)
4) జోదాబాయి ప్యాలెస్‌
5) బీర్బల్‌ భవంతి
6) టర్కీ సుల్తానా ప్యాలెస్‌

సాంఘిక సంస్కరణలు:
హిందువుల తిరునాళ్లు, ఉత్సవాలలో అక్బర్‌ స్వయంగా పాల్గొన్నాడు.
బాల్య వివాహాలు, చిన్న పిల్లలను చంపటం(బలి) నిషేధించబడ్డాయి.
హిందూ వితంతు పునర్వివాహం చట్టబద్ధం చేయబడింది.
సతీ సహగమన నిషేధాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాడు
కొన్ని నిర్జీత దినాలలో జంతువధ నిషేధించబడింది.
అక్బర్‌ స్వయంగా అక్షరజ్ఞానం కలవాడు కాకపోయినా ఫతేపూర్‌ సిక్రీలో ఆడపిల్లలకు పాఠశాలలను స్థాపించాడు.
షేక్‌ సలీం చిస్థీ ఆశీర్వాదంతో అక్బర్‌, మరియమ్‌కు జన్మించిన బిడ్డకు సలీమ్‌ అని పేరు పెట్టినప్పటికినీ అక్బర్‌ ప్రేమగా ఆ బిడ్డను “షేక్‌బాబా' అని పిలుచుకునేవాడు.