సూర్ వంశం(1510-55):
1) షేర్షా(1540-45):
సూర్ వంశాన్ని స్థాపించినవాడు - షేర్షా
ఇతని అసలు పేరు ఫరీద్
ఇతను ఆస్టనిస్థాన్‌కు చెందినవాడు. ఇతని తండ్రి ఒక రెవెన్యూ అధికారి
ఇతను జౌన్‌పూర్‌లో సంస్కృతం, పర్షియా భాషలను నేర్చుకున్నాడు.
బీహార్ పాలకుడు బహర్‌ఖాన్ లోహనీ వద్ద ఒక టీచర్‌గా పనిచేశాడు.
తర్వాత రెవెన్యూ శాఖలో డిప్యూటీ వకీల్‌దార్‌గా పని చేశాడు.
బహర్‌ఖాన్ లోహనీ ఫరీద్‌కు 'షేర్‌ఖాన్' అనే బిరుదు ఇచ్చాడు.
1530 - చునార్ పాలకుడు మరణంతో అతని వితంతువు లాడ్‌మాలికను వివాహం చేసుకొని చూనార్ పాలకుడయ్యాడు.
1533 - తన బద్ద శత్రువు నుస్రత్‌షాను సూరజ్‌ఘర్ యుద్ధంలో ఓడించాడు. ఇతను నుస్రత్‌షాపై జిహాద్ ప్రకటించాడు.
1537 - చునార్ యుద్ధంలో హుమాయున్‌చే ఓడించబద్దాడు.
1539 - చౌసా యుద్ధంలో హుమయూన్‌ను ఓడించాడు.
1540 - బిల్‌గ్రామ్/కనౌజ్ యుద్ధంలో హుమయూన్‌ను ఓడించి షేర్షా బిరుదు పొంది ఢిల్లీ పాలకుడయ్యాడు.
1545 - కలింజర్ కోటను అక్రమిస్తున్నప్పుడు గన్‌పౌడర్ పేలుడులో ప్రమాదవశాత్తు మరణించాడు. (అప్పటి కలింజర్ రాజు కిరాత్‌సింగ్)
షేర్షా తన 5 సం॥ల పరిపాలనా కాలంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. క్షేత్ర స్థాయిలో ఉన్న ఉద్యోగులపై ప్రధానంగా తన దృష్టిని సారించాడు.
గ్రామాలలో శాంతి పరిరక్షణ కొరకై ముకద్దమ్ అనే పోలీసు అధికారి ఉండేవాడు.
గ్రామాలలో జరిగే నేరాలకు ముకద్దమ్‌లను బాధ్యులను చేసేవాడు.
బదిలీల విధానంను ప్రవేశపెట్టాడు. ఉన్నత అధికారులను ప్రతీ 2 సం॥లకు ఒకసారి బదిలీ చేసేవాడు.
ఇతను భూమిని 3 రకాలుగా విభజించాడు.
1) ఉత్తమం
2) మధ్యమం
3) అధమం
రెవెన్యూ వసూళ్లలో 3 పద్ధతులను అవలంభించాడు.
1) గల్లాబక్షి - పంట ఆధారంగా శిస్తు వసూలు జరిగేది
2) నస్క్/కంకుట్ - భూమి సారవంతం ఆధారంగా శిస్తు వసూలు జరిగేది
3) జప్తి - ఒప్పందం ఆధారంగా శిస్తు వసూలు జరిగేది
భూమిని కొలుచుటకు సికిందర్-ఇ-గజ్‌ను ఉపయోగించాడు. ఈ కొలత కొరకు జరీబ్ అనే కర్రను ఉపయోగించాడు.
రైతులకు పట్టాలు ఇచ్చి వారి వద్ద నుండి కుబిలియాత్ పత్రం తీసుకొనేవాడు.
నిర్మాణాలు:
పురానా ఖిలా (ఓల్డ్ ఫోర్ట్) ఢిల్లీ
ససారామ్ (షేర్షా సమాధి) బీహార్
గ్రాండ్ ట్రంక్ రోడ్ - బెంగాల్‌లో సోనార్గాం నుండి పాక్‌లో అటోక్ వరకు వేయించాడు.
రహదారులు - ఆగ్రా-మండ, ఆగ్రా-జోద్‌పూర్, ఆగ్రా-చితోర్
షేర్షా వెండి రూపాయి నాణెములను, రాగి దమ్ నాణెములను ప్రవేశపెట్టాడు.
ఇతని కాలంలో బంగారు నాణెము లను అష్రఫీ అనేవారు.
ఇతని కాలంలో ఆస్థాన చరిత్రకారుడు అబ్బాస్ షేర్వాణీ తాజూక్-ఇ-షేర్షాహీ అనే పుస్తకం రాశాడు.
ఇతని ఆస్థాన కవి మాలిక్ మొహ్మద్ జైసీ పద్మావతి పుస్తకం రచించాడు.
ఇతని రెవెన్యూ మంత్రి రాజా తోడర్‌మల్
షేర్షా తర్వాత సూర్ పాలకులు ఇస్తాం షా, సికిందర్ సూర్
ఇస్లాం షా “జలాల్‌ఖాన్” అనే బిరుదు పొందాడు.