మైసూరు ఆక్రమణ/ఆంగ్లోమైసూరు యుద్దాలు:
మైసూర్ రాజ్యం క్రీ.శ. 1399లో యడురాయ విజయ చే స్థాపించబడింది.
అధునిక మైసూరు రాజ్యమును సాపకుడు- చిలక కృష్ణరాజ్ ఒడయార్/ 4వ చామరాజ
ఇతని ఇద్దరు మంత్రులు -నంద్యరాజ్, దేవరాజ్
హైదర్ అలీ ఒక సాధారణ సిపాయిగా మైసూరు సైన్యంలో చేరాడు. తన యుద్ధ నైపుణ్యం కారణంగా అంచెలంచెలుగా ఎదిగి దుండిగల్ ప్రాంతంనందు ఫౌజ్‌దారు (సైనికాధికారి) గా నియమించబడ్డాడు.
1755లో ఫ్రెంచి సహాయంతో దుండిగల్ వద్ద ఆధునిక ఆయుధ కర్మాగారాన్ని ఏర్పాటు చేశాడు.
1761లో నంద్యరాజ్, దేవరాజ్‌లను తొలగించి హైదర్‌అలీ మైసూరును ఆక్రమించాడు.
మైసూరుకు పాలకుడైన తర్వాత హైదర్ అలీ తన రాజ్యమును అన్ని వైపులా విస్తరింవజేయడం ప్రారంభించాడు.
మొదటి ఆంగ్లో మైసూరు యుద్ధం (1767-69):
బ్రిటీష్ గవర్నర్ - వేరెల్ట్స్
హైదర్‌అలీ తన రాజ్యమును అన్ని వైపులా విస్తరింపజేయుట కారణంగా బ్రిటీష్, హైదరాబాద్, మరాఠాలు ఈర్ష్య చెందాయి.
ఈ ఈర్ష్య మొదటి ఆంగ్లో మైసూరు యుద్దానికి దారితీసింది.
మొదట్లో హైదర్ అలీ ఓడించబడ్డాడు.
తర్వాత హైదర్‌అలీ తన సైన్యమును పునర్‌వ్యవస్థీకరించి బ్రిటీష్ వారిపై విజయాలు సాధించాడు. చెంగమ, తిరువన్న మలై యుద్ధాలలో బ్రిటీష్‌ను ఓడించాడు. బ్రిటీష్ స్థావరం అయిన మద్రాస్‌పై దాడి చేశాడు.
మద్రాస్ ఒప్పందంతో 1769లో మొదటి ఆంగ్లో మైసూరు యుద్ధం అంతమైంది.
రెండవ ఆంగ్లో మైసూరు యుద్ధం (1780-81):
బ్రిటీష్ గవర్నర్ జనరల్ -వారెన్ హేస్టింగ్స్
1770 దశకంలో అమెరికాలో బ్రిటీష్‌కు వ్యతిరేకంగా జార్జి వాషింగ్టన్ నేతృత్వంలో అమెరికా స్వాతంత్ర్య పోరాటం ప్రారంభ మైంది.
ఫ్రెంచివారు జార్జి వాషింగ్టన్‌కు మద్దతు పలికారు. దీని కారణంగా బ్రిటీషు, ఫ్రెంచి వారి మధ్య యుద్ధం ప్రారంభమైంది.
భారతదేశంలో ఫ్రెంచి స్థావరం అయిన మాహేపై దాడి చేయుటకు బ్రిటీష్ నిర్ణయించింది.
మాహే మైసూరు రాజ్యం లోపల ఉంది. మైసూరు రాజ్యంలోకి బ్రిటీషు సైన్యం ప్రవేశించకూడదని హైదర్‌అలీ బ్రిటీషు వారికి హెచ్చరికలు జారీ చేశాడు.
కానీ ఈ హెచ్చరికలను బేఖాతరు చేసి బ్రిటీష్ మైసూరు రాజ్యంలోకి ప్రవేశించి మాహేపై దాడి చేసింది. దీంతో రెండవ ఆంగ్లో మైసూరు యుద్ధం ఆరంభమైంది.
మొదట్లో హైదర్ అలీ విజయాలు సాధించాడు.
1781లో పోర్టోనోవో యుద్ధంలో బ్రిటీష్ జనరల్ ఐర్‌కూట్ హైదర్‌అలీని ఓడించాడు. అప్పుడే పొల్లిలూరు యుద్ధం కూడా జరిగింది.
తర్వాత ఒక విషపూరితమైన ముల్లు గుచ్చుకోవడంతో హైదర్ అలీ 1782 డిసెంబర్ 7నమరణించాడు.
హైదర్ మరణానంతరం అతని కుమారుడు టిప్పుసుల్తాన్ 2వ ఆంగ్లో మైసూరు యుద్దాన్ని కొనసాగించాడు.
1784 నాటికి ఎవ్వరునూ గెలిచే స్థితిలో లేకపోవుటచే మంగుళూరు ఒప్పందంతో 2వ ఆంగ్లో మైసూరు యుద్ధం అంతమైంది.