భారతదేశ ఆక్రమణ-3

TSStudies

బెంగాల్‌ అక్రమణ (1764) (British Occupation of Bengal):

British Conquest of India,how british British Conquest of India,British Conquest of India,Bengal invasion by british,establishment of british rule in bengal,bengal presidency in telugu,Presidencies and provinces of British India,History of Bengal Presidency Notes in telugu,Shaibal Gupta Economic history of Bengal presidency in telugu,What does bengal presidency mean,secret marks on the coins of the bengal presidency,Economic History Of Bengal Presidency
బెంగాల్‌ రాజ్యమును స్థాపించినది ముర్షీద్‌ కూలీఖాన్‌. ఇతని తర్వాత నవాబులు ఘజావుద్దీన్‌, సర్పరాజ్‌ఖాన్‌, ఆలీవర్దిఖాన్‌.
1756లో ఆలీవర్ధిఖాన్‌ మరణించడంతో అతని మనుమడు సిరాజ్‌ ఉద్దౌలా బెంగాల్‌ నవాబు అయ్యాడు.
ఇదే సమయంలో దక్షిణ భారతదేశంలో బ్రిటీష్‌ మరియు మ్రైంచివారి మధ్య 3వ ఆంగ్లో కర్ణాటక‌ యుద్ధం ఆరంభమైనది.
బెంగాల్‌లో బ్రిటీష్‌ మరియు ఫ్రెంచి తమ స్థావరాల చుట్టూ రక్షణ గోడలను నిర్మించుకోవడం ప్రారంభించారు.
3 సిరాజ్‌ ఈ రక్షణ గోడల నిర్మాణమును ఆపివేయవలసినదిగా ఆజ్ఞలను జారీ చేశాడు.
చంద్రనాగోర్‌లో ఉన్న ఫ్రెంచి దీనిని అంగీకరించగా బ్రిటీష్‌వారు తిరస్కరించారు. కోపోద్రిక్తుడైన సిరాజ్‌ ఖాసిం బజార్‌పై దాడి చేసి బ్రిటీషు స్థావరాలను ధ్వంసం చేసి సుమారు 150 మందిని ఒక చీకటి గదిలో బంధించాడు.
ఈ దాడి సమయంలో కొంతమంది ఆంగ్రేయులు (వారెన్‌ హేస్టింగ్‌, కలకత్తా గవర్నర్‌తో సహా) ఫాల్టా దీవులకు పారిపోయారు.
ఈ విషయం మద్రాసులో ఉన్న రాబర్ట్‌క్లైవ్‌కు తెలిసింది. దీనితో రాబర్ట్‌క్లైవ్‌, అడ్మిరల్‌ వాట్సన్‌ ముందుగా ఫాల్బా దీవికి చేరుకొని అక్కడి ఆంగ్రేయులను రక్షించి తర్వాత చీకటి గది యొక్క తలుపులను తెరిచారు.
150 మందిలో కేవలం 21 మంది మాత్రమే బ్రతికిఉ న్నారు. దీనినే చీకటి గది ఉందంతం(Black Hole Tragedy) అంటారు.
21 మందిలో ఒకడైన హోల్‌వెల్‌ చీకటి గది ఉదంతమును రాబర్ట్‌ క్లైవ్‌కు వివరించాడు.
రాబర్ట్‌ క్లైవ్‌ కలకత్తా, హుగ్రీలను ఆక్రమించడంతో సిరాజ్‌ ఆలీనగర్‌ అనే ఒప్పందమును కుదుర్చుకొని బ్రిటీష్‌ వారికి
పూర్వపు హోదాను కల్పించాడు. కానీ రాబర్ట్‌క్షైవ్‌ కుట్రల ద్వారా బెంగాల్‌ను ఆక్రమించుటకు నిర్ణయించాడు.

కుట్రదారులు :
మీర్‌జాఫర్‌ - సిరాజ్‌ యొక్క సైన్యాధ్యక్షుడు (మీర్‌బక్షి)
మిరాన్‌ - మీర్‌జాఫర్‌ కుమారుడు
అమీన్‌చంద్‌ - వ్యాపారి, మధ్యవర్తి
మాణిక్‌చంద్‌ - కలకత్తా ఇన్‌చార్జి
జగత్‌ సేఠ్‌  - బెంగాల్‌లో అత్యంత ధనికుడు
రాయ్‌దుర్లభ్‌, ఖాదిమ్‌ఖాన్‌- సిరాజ్‌ యొక్క సైనికాధికారులు
1757 జూన్‌ 2న ప్లాసీ యుద్ధంలో రాబర్ట్‌క్లైవ్‌ సిరాజ్‌ ఉద్దౌలాను ఓడించాడు. ‌
మీర్‌ మదన్‌, మోహన్‌లాల్‌ అనే సిరాజ్‌ సైనికులు సిరాజ్‌ తరపున వీరోచితంగా పోరాడి మరణించారు.
మిరాన్‌ పారిపోతున్న సిరాజ్‌ను పట్టుకొని ఉరితీసాడు.
భారతదేశంలో బ్రిటీష్‌ సామ్రాజ్య స్థాపనకు పునాదిలాంటి యుద్ధం - ప్లాసీ యుద్ధం
1757లో మీర్‌ జాఫర్‌ బెంగాల్‌ నవాబు అయ్యాడు. 3 కోట్ల రూపాయలను, 24 పరగణాల జమిందారీ హక్కులను బ్రిటీష్‌కు ఇచ్చాడు.
1760 నాటికి బెంగాల్‌ ఖజానా ఖాళీ అవుటచే మీర్‌ జాఫర్‌ బహుమానాలు ఇచ్చుటకు నిరాకరించాడు. దీంతో మీర్‌జాఫర్‌ను తొలగించి అతని అల్లుడైన మీర్‌ ఖాసీంను బెంగాల్‌ నవాబును చేశారు.
దీనికిగాను మీర్‌ఖాసిం 3 ప్రాంతాలను బ్రిటీష్‌కు ఇచ్చాడు. అవి
1. మిద్నాపూర్‌.
2. చిట్టగాంగ్‌
3. బుర్దామాన్‌
మీర్‌ ఖాసిం సమర్దుడైన పాలకుడు. బ్రిటీష్‌ జోక్యం వరిపాలనలో ఉండకూడదని తన రాజధానిని ముర్షీదాబాద్‌ నుండి మొంఘీర్‌కు మార్చాడు.
బెంగాల్‌ వర్తకులు ఎవ్వరునూ సుంకములు చెల్లించ వలసిన అవసరం లేదని ప్రకటించుట కారణంగా మీర్‌ఖాసీం మరియు బ్రిటీష్‌ వారిమధ్య వివాదాలు ప్రారంభమయ్యాయి.
చిన్న చిన్న యుద్దాలలో మీర్‌ ఖాసీం ఓటమిపాలై అవధ్‌కు పారిపోయాడు.
1763లో మీర్‌ జాఫర్‌ మరలా బెంగాల్‌ నవాబుగా నియమించబడ్డాడు.
మీర్‌ఖాసీం అవధ్‌ పాలకుడు అయిన ఘజా ఉద్దౌలాతో, మొగల్‌ చక్రవర్తి అయిన 2వ షాఆలంతో బ్రిటీషుకు వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పాటు చేశాడు.
1764లో బ్రిటీష్‌ జనరల్‌ మన్రో ఈ కూటమిని బాక్సర్‌ యుద్ధంలో ఓడించాడు. దీంతో బెంగాల్‌ (పశ్చిమ బెంగాల్, ‌బీహార్‌, బంగ్లాదేశ్‌, ఒరిస్సా) పూర్తిగా ఆధీనంలోకి వచ్చింది.
1765లో అలహాబాద్‌ ఒప్పందం తర్వాత రాబర్ట్‌క్లైవ్ ‌ బెంగాల్‌లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టాడు.