Indian Independence Movement-5

TSStudies
స్వదేశీ ఉద్యమం :
1905 అక్టోబర్‌ 16న బెంగాల్‌ విభజన అమలులోకి వచ్చినపుడు బెంగాల్‌ ప్రజలు ఇక నుండి విదేశీ వస్తువుల ఉపయోగాన్ని బహిష్కరించి స్వదేశీ వస్తువులను మాత్రమే ఉపయోగించాలని ప్రతిజ్ఞ చేశారు.
దీనితో భారతదేశంలో స్వదేశీ ఉద్యమం ప్రారంభమయింది.
స్వదేశీ ఉద్యమం ఒక ఆర్థికపరమైన ఉద్యమం.
స్వదేశీ వస్తువులను ఉపయోగించడం దీని ప్రధాన లక్ష్యం.
భారతదేశంలోని ఈ క్రింది ప్రాంతాలలో స్వదేశీ ఉద్యమం ప్రధానంగా జరిగింది.
1. బెంగాల్‌ - అరబిందో ఘోష్‌ బి.సి. పాల్‌, అక్షయ్‌ కుమార్‌ దత్‌(ఇతను బారిసాల్ లో “స్వదేశీ బందన్‌ సమితి” అనే సంస్థను స్థాపించాడు).
2. మద్రాస్‌ - చిదంబరం పిళ్ళై(ఇతను స్వదేశీ స్టీమ్‌ నావిగేషన్‌ అనే సంస్థను స్థాపించాడు)
3. బాంబే - తిలక్‌
4. ఢిల్లీ - . హైదర్‌రాజా
5. పంజాబ్‌, లాహోర్‌, కాశ్మీర్  - అజిత్‌ సింగ్‌, లాలా లజపతిరాయ్‌

వందేమాతర ఉద్యమం అంతం
1911లో బ్రిటిష్‌ చక్రవర్తి జార్డ్‌ - 3 మరియు అతని భార్య మేరీ ఇండియాలో పర్యటించారు.
ఈ సందర్భంగా గవర్నర్‌ జనరల్‌ రెండవ హార్డింజ్‌ ఢిల్లీ దర్చార్‌ను నిర్వహించాడు.
ఈ ఢిల్లీ దర్చార్‌లో 5వ జార్జ్ స్వయంగా క్రింది ప్రకటనను చేశాడు.
1) రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్పు
2) బెంగాల్‌ విభజన రద్దు
బెంగాల్‌ విభజనను రద్దు చేన్తున్నట్లు జార్జ్-5 అదికారికంగా ప్రకటించడంతో వందేమాతర ఉద్యమం పూర్తిగా అంతమయింది.

వందేమాతర ఉద్యమం-రబీంద్రనాథ్‌ ఠాగూర్‌:
Contribution of Rabindranath Tagore in the freedom movement of India in telugu,Rabindranath Tagore Indian social reformer,Rabindranath Tagore  Indian National Congress,How The Mahatma Was Influenced by Rabindranath Tagore in telugu,What is the contribution of Rabindranath Tagore towards India's freedom struggle in telugu,What was the role of Rabindranath Tagore in the Indian Independence Struggle in telugu,The legacy of Rabindranath Tagore,Rabindranath Tagore was the pioneer of Indian National movement,Freedom fighter Rabindranath Tagore1905లో బెంగాల్‌ విభజన జరిగినపుడు రబీంద్రనాథ్‌ ఠాగూర్‌ అమర్‌ సోనార్‌ బంగ్లా అనే గీతాన్ని రచించాడు. ప్రస్తుతం ఇది బంగ్లాదేశ్‌ యొక్క జాతీయగీతం
1911లో బెంగాల్‌ విభజన రద్దయినవుడు రబీంద్రనాథ్‌ ఠాగూర్‌ జనగణమన గీతాన్ని బెంగాలీ సంస్కృతంలో రచించాడు. ఇది ప్రస్తుతం భారతదేశం యొక్క జాతీయ గీతం.
1919 ఫిబ్రవరిలో రబీంద్రనాథ్‌ ఠాగూర్‌ మదనపల్లిలో జనగణమనను ఆంగ్లంలోకి అనువాదించాడు.
జనగణమనకు స్వరకల్పన చేసినది -మార్గరెట్‌ కజిన్స్‌