గిరిజన, పౌర, రైతు తిరుగుబాట్లు -1

TSStudies
గిరిజన, పౌర, రైతు తిరుగుబాట్లు 
గిరిజన తిరుగుబాట్లకు కారణాలు:
డికూలు (మైదాన ప్రాంతం నుంచి అటవీ ప్రాంతంలోకి ప్రవేశించి గిరిజన భూములను ఆక్రమించేవారు)
ముట్టదారి, కుంతకట్టి విధానాలు రద్దు అవుట (ఉమ్మడి కుటుంబ విధానం రద్దు అవుట) 
పుల్లరి, ముల్లవి పన్నులు గిరిజనులపై విధించుట
 క్రిస్టియన్‌ మిషనరీ కార్యకలాపాలు
Ts Studies,tsstudies,ts study circle,indian history notes in telugu,indian history study material in telugu,tspsc indian history notes in telugu,tspsc indian history study material in telugu,Indian history in telugu upsc,indian history mcq

రైతు ఉద్యమాలు
రైతు ఉద్యమాలు రావదానికి గల కారణాలు :
1. తిన్‌కథియా :
దీని ప్రకారం రైతు తన వద్ద ఉన్న భూమిలో 3/20 వంతు భూమిలో నీలిమందును పండించాలి. ఈ నీలిమందును బ్రిటీషు వారు నిర్ణయించిన ధరకు ముఫాజల్‌(మార్కెట్‌)లో మాత్రమే విక్రయించాలి.
2. శాశ్వత శిస్తు పరిష్కార చట్టం (లేదా) జమిందారీ చట్టం(1793) :
దీని ప్రకారం రైతు భూమి యొక్క యాజమాన్యపు హక్కులను కోల్పోయాడు. కేవలం కౌలుదారుడుగా మిగిలాడు. శిస్తు వసూలు చేసేవారికి యాజమాన్య హక్కులు ఇవ్వబడ్డాయి. అతనినే జమిందారు అంటారు.
జమిందారు తను సేకరించిన శిస్తులో 1/11 వంతు తన వద్ద ఉంచుకొని మిగతా 10/11 వంతు శిస్తును బ్రిటీషు వారికి పంపించేవాడు. 
3. విధానాలు :
నజరానా - పునరుద్దరణ రుసుము
బెదాఖ్లి - శిస్తు చెల్లించకపోతే బలవంతంగా భూమి నుంచి తొలగించడం
వెట్టి. - ఉచితంగా పనులు చేయడం
జోతేదార్‌ అనే అధికారులు అనేక రకాలైన ఇతర పన్నులను చట్ట వ్యతిరేకంగా రైతుల నుంచి వసూలు చేసేవారు.