సహాయ నిరాకరణ ఉద్యమం(1920-22):
1919లో జరిగిన సంఘటనల కారణంగా భారతదేశంలో పూర్తిగా బ్రిటిష్ వ్యతిరేక భావాలు ఏర్పడ్డాయి.
గాంధీ ఈ పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని స్వపరిపాలన సాధించడానికి బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా ఒక మహత్తర ఉద్యమాన్ని అహింసా మార్గంలో ప్రారంభించాలని నిర్ణయించాడు.
1920 ఆగస్టు 1న గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని(non cooperation movement) ప్రారంభించాడు.
1920 సెప్టెంబర్‌లో గాంధీ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చర్చించడానికి ప్రత్యేక సమావేశాన్ని భారత జాతీయ కాంగ్రెస్ కలకత్తాలో లాలాలజపతిరాయ్ అధ్యక్షతన నిర్వహించింది.
గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని కొనసాగించవలసిందిగా ఈ సమావేశం గాంధీని సూచించింది.
1920 డిసెంబర్‌లో ఐ.యన్.సి వార్షిక సమావేశం “నాగపూర్లో విజయరాఘవాచారి(తెలుగువాడు) అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో సహాయ నిరాకరణ ఉద్యమం ఆమోదించబడింది. దీని తరువాత సహాయ నిరాకరణ ఉద్యమం భారతదేశం అంతా విస్తరించింది.
సహాయ నిరాకరణ ఉద్యమం యొక్క 4 దశలు :
1. 1921 జనవరి నుండి మార్చి
2. 1921 ఏప్రిల్ - జూన్
3. 1921 జులై -నవంబర్
4. 1921 డిసెంబర్ - 1922 ఫిబ్రవరి
మొదటి దశ(1921 జనవరి - మార్చి)
ఈ దశలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, న్యాయస్థానాలు, ప్రభుత్వ ఉద్యోగాలను బహిష్కరించాలని గాంధీ పిలుపునిచ్చాడు.
గాంధీ పిలువు వేరకు
భారతదేశంలో అనేకమంది తమ పదవులను లేదా ఉద్యోగాలను, వృత్తులను వదులు కొన్నారు. ప్రధానంగా రాజాజీ, సైపుద్దీన్ కిచ్లూ, టంగుటూరి ప్రకాశం మొ॥ వారు తమ న్యాయవాద వృత్తులను వదులుకున్నారు.
ఈ సమయంలోనే ఆంధ్రాకు చెందిన
గరిమెల్ల సత్యనారాయణ “మాకొద్దీ తెల్లదొరతనం” అనే గీతాన్ని రచించి ఆరునెలలు జైలుశిక్ష అనుభవించాడు.
రెండవ దశ(1921 ఏప్రిల్ - జూన్)
1921 మార్చి 31 మరియు ఏప్రిల్ 1వ తేదీలలో విజయవాడలో గాంధీ అధ్యక్షతన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఈ మధ్య కాలంలో అమలుపరిచారు.
ఈ సమావేశంలో అనేకమంది జాతీయ నాయకులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖ నాయకులు - సి.ఆర్. దాస్, మోతీలాల్ నెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, మొహ్మద్ ఆలీ, షౌకత్ ఆలీ.
మాడపాటి హనుమంతరావు తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా ఈ సమావేశంలో పాల్గొన్నాడు.
ఈ సమావేశానికి “అద్దేపతి రామశేషయ్య” అధ్యక్షతన ఒక ఆహ్వాన సంఘం ఏర్పాటు చేయబడింది.
ఈ నమావేశం సజావుగా జరుగుట కొరకు
500మందితో “రామదండు” అనే ఒక స్వచ్చంద దళాన్ని దుగ్గిరాల గోపాలకృష్ణయ్య (ఆంధ్రరత్న) ఏర్పాటుచేశాడు. ఈ సమావేశం జరిగిన ప్రాంతానికి గాంధీనగర్ అని పేరు పెట్టారు.
ఈ సమావేశంలోనే బందరుకు చెందిన “పింగళి వెంకయ్య” భారతదేశ త్రివర్ణ పతాకాన్ని రూపొందించి గాంధీకి సమర్పించాడు.
ఈ సమావేశంలో పాల్గొనుట కొరకు అనేక ప్రాంతాల నుండి ప్రజలు పాటలు పాడుకొంటూ కాలినడకన విజయవాడ చేరుకొన్నారు.
ఉదా:
1) దండాలు దండాలు భారత మాత - రాజమండ్రి కేసరి సమాజం
2) మహత్మాగాంధీ దర్శనమే మహాపూజ్యం - రామచంద్రాపురం దళం
ఈ సమావేశంలో “అయ్యదేవర కాళేశ్వరరావు” గాంధీ ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించాడు.
ఈ సమావేశంలో ఈ క్రింది నిర్ణయాలు తీసుకోవడ్డాయి.
1) కోటి రూపాయల తిలక్ నిధిని సేకరించుట
2) కోటిమందిని సహాయ నిరాకరణ ఉద్యమంలో చేర్ప్చించుట
3) 20లక్షల చరఖాలను (లేదా) రాట్నాలను ఏర్పాటు చేయుట
4) సారాకు వ్యతిరేకంగా ఉద్యమించుట
గాంధీ విజయవాడలోనే తిలక్ నిధిని సేకరణను ప్రారంభించాడు.
యామినీ పూర్ణతిలకం అనే వేశ్య తన యావదాస్థిని గాంధీకి విరాళంగా ఇచ్చింది.
మాగుంట అన్నపూర్ణమ్మ తన మొత్తం నగలను గాంధీకి విరాళం ఇచ్చింది.
మూడవ దశ(1921 జులై - నవంబర్)
ఈ దశలో విదేశీ వస్తువుల మరియు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ యొక్క భారత పర్యటనను బహిష్మరించారు.
అప్పట్లో ఉద్యమకారులు కేవలం ఖద్ధరును మాత్రమే ధరించేవారు.
అప్పట్లో శ్రీకాకుళంలోని 'పొందూరు'లో తయారయ్యే ఖద్దరు మొత్తం భారతదేశంలో ప్రసిద్ధి చెందింది.
అప్పట్లో ఉద్యమకారులు గాంధీ టోపీలను ధరించేవారు.
ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నవంబర్‌లో భారతదేశంలో పర్యటించాడు.
ఇతని పర్యటనను వ్యతిరేకిన్తూ భారత్‌లో అనేక ప్రాంతాలలో హర్తాళ్ నిర్వహించబడింది.
నాలుగవ దశ (1921 డిసెంబర్ - 1922 ఫిబ్రవరి)
ఈ దశలో పన్ను చెల్లింపు నిరాకరణ ఉద్యమాలు చేపట్టబడ్డాయి. అప్పటికే ఆంధ్రలోని చీరాల-పేరాల, పల్నాడు, పెదనందిపాడు మొదలగు ప్రాంతాలలో పన్ను చెల్లింపు నిరాకరణ ఉద్యమాలు ప్రారంభమయ్యాయి.
గాంధీ గుజరాత్‌లోని బార్దోలిలో పన్ను చెల్లింపు నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టాడు.
1922 ఫిబ్రవరి 5న ఉద్యమకారులు అహింసా మార్గంలో ఉత్తరప్రదేశ్‌లోని 'చౌరా-చౌరీ' అనే గ్రామంలో ఊరేగింపుగా వెళుతున్నప్రడు పోలీసులు వారిపై లారీచార్జి జరిపారు.
ఈ లాఠీచార్జ్‌లో అంబికారాయ్ చౌదరి(అస్సాం కేసరి), భగవాన్ అహిర్(గొప్ప కవి)లు తీవ్రంగా గాయపడ్డారు.
దీనికి ఆగ్రహించిన ఉద్యమకారులు చౌరా-చెౌరీ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి దానికి నిప్పుపెట్టారు.
పోలీస్ స్టేషన్‌లో ఉన్న 21మంది పోలీసులు సజీవ దహనం అయ్యారు (వీరంతా భారతీయులే).
ఈ వార్త తెలుసుకొన్న గాంధీ ఫిబ్రవరి 11న సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమిస్తున్నట్లు “బార్దోలి' నుండి ప్రకటించాడు.
దీనినే 'బార్దోలి తీర్మానం” అంటారు. దీనితో సహాయ నిరాకరణ ఉద్యమం అంతం అయ్యింది.