Indian Independence Movement-21

TSStudies
సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో భారత దేశంలో జరిగిన ఉద్యమాలు:
పంజాబ్‌:
సిక్కులు గురుద్వారాల సంస్కరణల కొరకు మహంతులకు వ్యతిరేకంగా అకాలీ ఉద్యమాన్ని చేపట్టారు.
ఈ ఉద్యమ ఫలితంగా అవినీతిపరులైన మహంతులను గురుద్వారాల నుండి తొలగించి గురుద్వారాల పరిపాలన  కొరకు శిరోమణి గురుద్వార ప్రబంధక్‌ కమిటీ ఏర్పాటు చేయబడింది.
ఆంధ్ర:
1. చీరాల-పేరాల ఉద్యమం-దుగ్గిరాల గోపాలక్రిష్టయ్య
2. పల్నాడు సత్యాగ్రహం-కన్నెగంటి హనుమంతరావు
3. పెదనందిపాడు ఉద్యమం-పర్వతనేని వీరయ్య చౌదరి
కేరళ: 
మోష్లా ఉద్యమం కేరళలోని మలబార్‌ తీరంలో జరిగింది. దీని నాయకుడు కున్‌ అహ్మద్‌ హజ్‌
మోష్లా ఉద్యమం బ్రిటీష్‌ మరియు జమీందార్లకు వ్యతిరేకంగా జరిగింది
సహాయ నిరాకరణ ఉద్యమంలో ఏర్పడిన విద్యాసంస్థలు:
1 జామియా మిలియా ఇస్లామియా
2 గుజరాత్‌ విద్యాపీఠ్‌
3 కాశీ విద్యాపీఠ్‌

రంపా తిరుగుబాటు (1922-24):
Contribution of Alluri Sitarama Raju in the freedom movement of India in telugu,Alluri Sitarama Raju Indian social reformer,Alluri Sitarama Raju  Indian National Congress,How,What is the contribution of Alluri Sitarama Raju towards India's freedom struggle in telugu,What was the role of Alluri Sitarama Raju in the Indian Independence Struggle in telugu,The legacy of Alluri Sitarama Raju,Alluri Sitarama Raju was the pioneer of Indian National movement,Freedom fighter Alluri Sitarama Rajuఅల్లూరి సీతారామరాజు 1897 జులై4న పశ్చిమ గోదావరి జిల్లా మాగల్లు / చెంగల్లులో వెంకట రామరాజు, సూర్యనారాయణమ్మలకు జన్మించాడు.
అల్లూరి సీతారామరాజు 14వ ఏట తండ్రి వెంకట రామరాజును కోల్పోయాడు. పినతండ్రి రామరాజు ఇతని‌ని చదివించాడు.
అల్లూరి సీతారామరాజు తణుకు, భీమవరం, కాకినాడ, విశాఖలలో విద్యాభ్యాసం చేశాడు.
విశాఖ ఎ.వి.యన్‌ కళాశాలలో చదువుకొన్నాడు. ఈ కళాశాలలోనే అతనికి సీత అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది.
అల్లూరి నీతారామరాజు సీత పేరు మీదుగానే సీతారామరాజుగా మారాడు.
అల్లూరి సీతారామరాజు ఉత్తర భారతదేశంలో హిమాలయాలలో గల బద్రినాథ్‌, హరిద్వార్‌ మొదలైన పుణ్యక్షేత్రాలను సందర్శించి ఒక సన్యాసి / రుషిగా మారి మన్యం(విశాఖ దక్షిణ ప్రాంతం మరియు తూర్పు గోదావరి ఉత్తర ప్రాంతం)కు తిరిగి వచ్చాడు.
అల్లూరి సీతారామరాజు విశాఖపట్నంలోని కృష్ణదేవిపేట మండలంలోగల “తాండవినదీ తీరాన గల చిక్కాల గడ్డ అనే గిరిజన గ్రామంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని నివసించసాగాడు.
సమీపంలో గల నీలకంఠేశ్వర ఆలయం వద్ద తపస్సు చేసేవాడు.
గిరిజనుల యొక్క సమస్యలను అల్లూరి సీతారామరాజు తన సలహాలతో పరిష్కరించేవాడు.
అప్పటి కృష్ణదేవిపేట మండలం తహశీల్దార్‌ బాస్టియన్‌, అతని దుబాసి సంతానం పిళ్లై స్థానిక గిరిజనులపై అనేక అరాచకాలు చేసేవారు.
దీనితో అల్లూరి సీతారామరాజు బాస్టియన్‌కు వ్యతిరేకంగా గ్రామాలలో పంచాయతీలు నిర్వహించాడు.
ఈ విషయాన్ని తెలుసుకొన్న బాస్టియన్‌ అల్లూరి సీతారామరాజును అరెస్ట్‌ చేయించి అడ్డతీగల దగ్గరగల పైడిపుట్టి అనే గ్రామానికి తరలించాడు.
1921లో అల్లూరి సీతారామరాజు నేపాల్‌లోని హిమాలయాలలో తపస్సు చేయడానికి వెళ్తున్నానని పేర్కోని పైడిపుట్ట గ్రామాన్ని వదలి బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌కు వెళ్లాడు.
అక్కడ బెంగాల్‌ విప్లవ వీరుడు అయిన 'పృథ్వీసింగ్'ను కలసుకొని గెరిల్లా యుద్ధవిద్యలు నేర్చుకున్నాడు.
అల్లూరి సీతారామరాజు చిట్టగాంగ్‌ నుండి మన్యంనకు బయలుదేరి మార్గంమధ్యలో 'పర్లాకిమిడి'లోని సవరజాతి వారిని బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా ఏకం చేసినాడు.
అల్లూరి సీతారామరాజు మన్యంలో అనేక మంది అనుచరులను ఏర్పరచుకొన్నాడు. వారు
1) గంటం దొర
2) మల్లు దొర
3) వీరయ్య దొర
4) అగ్గిరాజు(పేరిచర్ల సూర్యనారాయణరాజు)
5) ఎండుపడాలు
1922 ఆగష్టు 22న అల్లూరి సీతారామరాజు  మొట్టమొదటగా చింతపల్లి పోలీస్‌స్టేషన్‌పై దాడిచేసి ఆయుధాలను తీసుకొనిపోయాడు.
దీని తరువాత ఆగస్టు 23న కృష్ణదేవిపేట పోలీస్‌ స్టేషన్‌పై, ఆగస్ట్‌ 24న రాజఒమ్మంగి పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశాడు.
రాజఒమ్మంగి పోలీస్‌ స్టేషన్‌లో బందీగా ఉన్న వీరయ్య దొరను విడిపించాడు.
దీనితో అప్రమత్తమైన బ్రిటిష్‌వారు ట్రైమర్‌హోర్‌, స్కాట్‌ కవర్డ్‌, హైటాస్‌ అనే సైనిక అధికారుల నేతృత్వంలో సైన్యాన్ని మన్యంలోకి పంపారు.
1922 సెప్టెంబర్‌లో దామన్‌ఘాట్‌ / పంజారిఘాట్‌ వద్ద జరిగిన సంఘర్షణలో స్కాట్‌‌ కవర్డ్‌ మరియు హైటాస్‌లు మరణించారు.
వీరి శవాలను అప్పగించడానికి అల్లూరి సీతారామరాజు బ్రిటిష్‌ వారి నుండి శిస్తును వసూలుచేశాడు.
దీని తరువాత రంపచోడవరం పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేసినాడు.
అల్లూరి సీతారామరాజును పట్టుకొనడానికి ప్రభుత్వం
మలబార్‌ రెజిమెంట్‌ను మన్యానికి పిలిపించింది. మలబార్‌ రెజిమెంట్‌ సైనిక అధికారి అయిన జాన్‌ పెద్దగడ్డపాలెం వద్ద సీతారామరాజు శిబిరంపై దాడిచేశాడు.
ఈ దాడిలో అనేకమంది అల్లూరి సీతారామరాజు అనుచరులు మరణించారు.
దీని తరువాత అల్లూరి సీతారామరాజు కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
దీంతో మలబార్‌ రెజిమెంట్‌ మన్యంలో నుండి విరమించబడింది.
1923 ఏప్రిల్‌లో సీతారామరాజు అన్నవరం పోలీస్‌ స్టేషన్‌పై దాడిచేశాడు. ఈ దాడిలో ఆయుధాలు లభించనప్పటికీ పోలీస్‌ స్టేషన్‌ అధికారి మరియు అన్నవరం ప్రజలు అల్లూరి సీతారామరాజుకు ఘనస్వాగతం పలికారు.
1923 సెప్టెంబర్‌లో “నడింపాలెం” వద్ద కీరన్స్‌ అనే అధికారి మల్లు దొరను అరెస్ట్‌ చేశాడు.
1924 జనవరిలో 'రూథర్‌ఫర్డ్'‌ మన్యంనకు స్పెషల్‌ కమిషనర్‌గా నియమించబడ్డాడు. ఇదే సమయంలో అస్సాం రైపిల్స్‌ 'మేజర్‌ గుదాల్' నేతృత్వంలో మన్యంలో ప్రవేశించింది.
రూథర్‌పర్డ్‌ మరియు మేజర్‌ గుడాల్ ‌సీతారామరాజును పట్టుకొనుటకు అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు.
దీనితో వీరు మన్యం ప్రజలపై అనేక అకృత్యాలు చేయసాగారు. దీనితో అల్లూరి సీతారామరాజు లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు.
మన్యంలో 'పంపా' అనే నదీ తీరాన “కంచు మీనన్‌” అనే అధికారి అల్లూరి సీతారామరాజును 1924 మే 7వ తేదీన అరెస్ట్‌ చేశారు.
Contribution of Alluri Sitarama Raju in the freedom movement of India in telugu,Alluri Sitarama Raju Indian social reformer,Alluri Sitarama Raju  Indian National Congress,How,What is the contribution of Alluri Sitarama Raju towards India's freedom struggle in telugu,What was the role of Alluri Sitarama Raju in the Indian Independence Struggle in telugu,The legacy of Alluri Sitarama Raju,Alluri Sitarama Raju was the pioneer of Indian National movement,Freedom fighter Alluri Sitarama Rajuఅదే రోజు అల్లూరి సీతారామరాజు “ఉయ్యూర్‌” శిబిరంనకు తరలించబడ్డాడు. అచట మేజర్ గుడాల్‌ మే 7వ తేదీ సాయంత్రం సీతారామరాజును కాల్చి చంపాడు.
మే 8న సీతారామరాజు విశాఖపట్నంలో కృష్ణదేవిపేటలో సమాధి చేయబడ్డాడు.
జూన్‌ నెలలో సీతారామరాజు యొక్క ప్రధాన అనుచరులు అయిన గంటం దొర, వీరయ్య దొర మొదలగువారు పోలీస్‌ ఎన్‌కౌంటర్‌లో చంపబడ్డారు. దీనితో రంపా తిరుగుబాటు పూర్తిగా అంతమయింది.
1938లో మల్లుదొర జైలు నుండి విడుదల అయ్యాడు. ఇతడు విశాఖలో గిరిజన సేవ కొరకు తన శేష జీవితాన్ని అంకితం చేశాడు.
1952 మొదటి సార్వత్రిక ఎన్నికలలో మల్లు దొర స్వతంత్ర అభ్యర్థిగా విశాఖపట్నం నియోజకవర్గం నుండి ఏకగ్రీవంగా పార్లమెంట్‌కు ఎన్నికయ్యాడు.
అల్లూరి సీతారామరాజుపై జీవిత చరిత్ర రాసింది - ఎర్రమల్లి నరసింహారావు

సహాయ నిరాకరణ ఉద్యమం విరమించబదిన తరువాత సంఘటనలు:
1922 ఫిబ్రవరి 11న గాంధీ సహాయ నిరాకరణోద్యమం విరమించడాన్ని కొంతమంది ఖండించారు.
గాంధీపై క్రింది వ్యాఖ్యలు చేశారు.
1. ఇది గాంధీ బలహీన నాయకత్వానికి ఉదాహరణ - ఎం.ఎన్‌ రాయ్‌
2. ప్రజల ఆశలపై చల్లని నీటిని చల్లడం? - సుభాష్‌ చంద్రబోస్‌
సి.ఆర్‌ దాస్‌ మరియు మోతీలాల్‌ నెహ్రూ ఇక చట్టసభలోకి ప్రవేశించి మనకు కావలసినది పొందవలెనని గాంధీని కోరారు. కానీ చట్టసభలలోకి ప్రవేశించేందుకు గాంధీ నిరాకరించాడు.