1919లో జరిగిన సంఘటనలు
1. రౌలత్ చట్టము
2, జలియన్‌వాలాబాగ్ సంఘటన
3. ఖిలాఫత్ ఉద్యమం
1. రౌలత్ చట్టం:
మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో(1914-1918) ఇండియాలో, ఉన్న అత్యవనర చట్టాలను సమీక్షించుటకై బ్రిటిష్ ప్రభుత్వం జస్టిస్ రౌలత్ కమిటీని ఏర్పాటుచేసింది.
జస్టిస్ రౌలత్ కింది అంశాలతో తన నివేదికను సమర్పించాడు.
1) మొదటి ప్రపంచ యుద్ధకాలంలో ఉన్న అన్ని అత్యవసర చట్టాలు కొనసాగాలి.
2) అనుమానితులను అరెస్ట్ చేసి రెండు సంవత్సరాలపాటు ఎటువంటి విచారణ లేకుండా నిర్భంధించవచ్చు.
3) విచారణ కొరకు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయవచ్చు.
బ్రిటిష్ ప్రభుత్వం రౌలత్ యొక్క నివేదికను ఆమోదించి దానిని ఒక చట్టంగా మార్చింది. దీనినే “రౌలత్ చట్టం” అని అంటారు. దీనినే “బ్లాక్ యాక్ట్ అని కూడా అంటారు.
రౌలత్ చట్టం 1919 మార్చిలో అమలులోకి వచ్చింది. తక్షణమే భారతదేశంలో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టబడ్డాయి.
1919 ఏప్రిల్ 6న భారతదేశంలో 'హర్తాళ్ జరగాలనిన గాంధీ పిలుపుఇచ్చాడు.
జలియన్ వాలాబాగ్ సంఘటన (1919 ఏప్రిల్ 13):
రౌలత్ చట్ట వ్యతిరేక ఉద్యమాల తీవ్రత పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో అధికంగా ఉందేది.
సైఫుద్దీన్ కిచ్లూ, సత్యపాల్ అమృత్‌సర్ లో రౌలత్ చట్ట వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టారు. వీరిద్దరూ అరెస్ట్ చేయబడ్డారు.
పంజాబ్ గవర్నర్ ఒ. డయ్యర్ అమృత్‌నర్‌లో ఉద్యమ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అమృత్‌సర్ పట్టణాన్ని “జనరల్ డయ్యర్'కు అప్పగించాడు.
జనరల్ డయ్యర్ వచ్చీరాగానే అమృత్‌సర్‌లో నిషేధ ఆజ్ఞలు జారీచేశాడు.
ఏప్రిల్ 13న పంజాబీల కొత్త సంవత్సరం 'బైసాఖీ' రోజున అమృత్‌సర్‌లోని జలియన్‌వాలాబాగ్‌లో సమావేశమై తమ నాయకుల అరెస్ట్ ను ఖండించవలెనని ప్రజలు నిర్ణయించారు.
ఏప్రిల్ 13న అమృత్‌సర్ ప్రజలు జనరల్ డయ్యర్ విధించిన నిషేధ ఆజ్ఞలను ఉల్లంఫించి జలియన్ వాలాబాగ్‌లో సమావేశమయ్యారు.
హన్సరాజ్ అనే వ్యక్తి ప్రసంగిస్తున్నపుడు జనరల్ డయ్యర్ జలియన్ వాలాబాగ్ చేరుకొని ఎటువంటి ముందస్తు హెచ్చరికలు జారీచేయకుండా సమావేశమైన వారిపై కాల్పులకు ఆదేశించాడు.
సుమారు 10 నిమిషాలపాటు కొనసాగిన ఈ కాల్పులలో వందలమంది ప్రజలు మరణించారు.
జలియన్‌వాలాబాగ్ సంఘటన గురించి తెలుసుకొన్న వెంటనే రవీంద్రనాథ్ ఠాగూర్ తన సర్ లేదా నైట్‌హుడ్ బిరుదును బ్రిటిష్ వారికి తిరిగి ఇచ్చివేశాడు.
ఓ జలియన్ వాలాబాగ్ సంఘటన తరువాత జనరల్ డయ్యర్ అమృత్‌సర్‌లోని ప్రజలపై తనేక అకృత్యాలను చేశాడు. అనేకమంది యువకులు అంగవైకల్యానికి గురయ్యారు.
ఐ.యన్.సి జనరల్ డయ్యర్‌పై చర్య తీసుకోవలసిందిగా
డిమాండ్ చేయడంతో బ్రిటిష్ ప్రభుత్వం జలియన్‌వాలాబాగ్ సంఘటనపై హంటర్ కమిషన్‌ను నియమించింది.
హంటర్ కమిషన్ జనరల్ డయ్యర్ నిర్దోషి అని పేర్కొన్నది.
దీనితో గాంధీ హంటర్ కమిషన్‌ను వైట్ వాష్ అని పేర్కొన్నాడు.
పంజాబి సిక్కువాడైన '“ఉధమ్‌సింగ్” జనరల్ డయ్యర్ మరియు ఒ డయ్యర్‌లను హతమార్చాలని నిర్ణయించుకొన్నాడు.
1940లో ఉధమ్‌సింగ్ వీరిని చంపడానికి లండన్‌కు వెళ్లాడు. కానీ అప్పటికే జనరల్ డయ్యర్ అనేక బాధాకరమైన రోగాలతో మరణించాడు. ఉధమ్ సింగ్ ఒ.డయ్యర్‌ను హతమార్చాడు.
ఆంధ్రాకు చెందిన దామరాజు పుందరీకాక్షుడు జనరల్ డయ్యర్‌పై “పాంచాల పరాభవం” అనే నాటకాన్ని రచించాడు.
ఖిలాఫత్ ఉద్యమం:
మొదటి ప్రపంచ యుద్ధంలో “టర్కీ ఓడిపోయిన దేశం. అప్పట్లో ముస్లిములకు మత, రాజకీయ పెద్ద అయిన “ఖలీఫా టర్కీలో ఉందేవాడు.
బ్రిటన్ మొదటి ప్రపంచ యుద్ధంలో విజయం సాధించిన తరువాత టర్కీలోని 'ఖలీఫా' పదవిని రద్దు చేసింది.
తక్షణమే మొత్తం ప్రపంచంలోని ముస్లింలు ఖలీఫా పదవి పునరుద్దరణ కొరకు ఉద్యమాలు చేపట్టారు.
భారతదేశంలో కూడా ఖలీఫాకు మద్దతుగా ఉద్యమ ప్రారంభమయింది. దీనినే ఖిలాఫత్ ఉద్యమం అని పేర్కొంటారు.
భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమాన్ని ప్రారంభించినవారు అలీ సోదరులు (మహ్మద్ ఆలీ, షౌకత్ ఆలీ)
తర్వాత హస్రత్ మొహాని, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ మొదలగువారు ఖిలాఫత్ ఉద్యమంలో చేరారు.
ఖిలాఫత్ ఉద్యమానికి అధ్యక్షత వహించవలసిందిగా అఖిల భారత ఖిలాఫత్ కమిటీ గాంధీకి విజ్ఞప్తి చేసింది.
హిందూ-ముస్లిం ఐక్యతకు ఈ ఉద్యమం తోడ్పడుతుందని భావించిన గాంధీ ఖిలాఫత్ ఉద్యమానికి నాయకత్వం వహించాడు.
గాంధీ ఖిలాపత్ ఉద్యమానికి నాయకత్వం వహించడంతో ఈ ఉద్యమం భారతదేశం అంతా విస్తరించింది.
1920-21లో టర్కీ నూతన పాలకుడు అయిన “ముస్తఫా కెమాల్ పాషా” టర్కీలో ఆధునీకరణ లేదా అనేక సంస్కరణలను ప్రవేశపెట్టాడు.
దీనిలో భాగంగా ఇక నుండి టటర్కీలో ఖలీఫా పదవి ఉ౦డదని కెమాల్ పాషా స్వయంగా ప్రకటించాడు. దీనితో మొత్తం ప్రపంచంలో ఖలీఫాకు మద్దతుగా జరుగుతున్న ఉద్యమాలు అంతమయ్యాయి.