సుభాష్ చంద్రబోస్:
మరణం - 18-8-1945 (ఖచ్చితమైన ఆధారాలు లేవు)
బిరుదు - నేతాజీ
పుస్తకము - The Indian Struggle
వార్తాపత్రిక - Young India
సుభాష్ చంద్రబోస్ ఒక ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారి. ఇండియన్ సివిల్ సర్వీస్‌కు రాజీనామా చేసి జాతీయోద్యమంలో అతి కీలకంగా పాల్గొన్నాడు.
1938 హరిపురా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశమునకు సుభాష్ చంద్రబోస్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. ఈ సమావేశంలో భారతదేశానికి ఒక ప్రణాళికా సంఘం ఉండాలని మొట్టమొదటిసారిగా డిమాండ్ చేశాడు. ఈ నమావేశంలోనే మొట్టమొదటిసారిగా “స్వాతంత్ర్యం” అనే పదం నిర్వచించబడినది (సంస్థానాలు కూడా చేర్చబడ్డాయి).
1939 త్రిపురి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో సుభాష్ చంద్రబోస్ గాంధీ అభ్యర్థి అయిన డా॥ పట్టాభి సీతారామయ్యను ఓడించి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు అధ్యక్షుడయ్యాడు.
తర్వాత కొన్ని కారణాలచే సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని స్థాపించాడు. కానీ బ్రిటీష్ వారిచే గృహ నిర్బంధానికి గురయ్యాడు.
1941 జనవరిలో కాబూలీ వేషంలో గృహ నిర్బంధం నుంచి బయటపడి ముందుగా కాబూల్ చేరుకున్నాడు. తర్వాత రష్యా, జర్మనీ చేరుకున్నాడు.
జర్మనీలో హిట్లర్ సుభాష్ చంద్రబోస్‌కు ఘనస్వాగతం పలికాడు (జర్మనీలో మొట్టమొదటిసారిగా సుభాష్ చంద్రబోస్ 'నేతాజీ' అని పిలువబడ్డాడు)
హిట్లర్ సలహా మేరకు సుభాష్ చంద్రబోస్ జర్మన్ సబ్ మెరైన్‌లో జపాన్ చేరుకున్నాడు.
జపాన్‌లో ఇండియన్ నేషనల్ ఆర్మీ సుభాష్ చంద్రబోస్‌కు
అప్పగించబడింది. (ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించినది -మోహన్‌సింగ్, నిరంజన్ గిల్)
సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీని పునర్వవస్థీకరించాడు.
ఝాన్సీ అనే ఒక మపిళా రెజిమెంటును ఏర్పాటు చేశాడు.
ఈ రెజిమెంటు యొక్క మొట్టమొదటిమహిళా కెప్టెన్ - లక్ష్మీ సెహగల్.
సుభాష్ చంద్రబోస్ ఈ క్రింది నినాదాలు ఇచ్చాడు
1) జైహింద్
2) చలో ఢిల్లీ
3) నాకు ఒక రక్తపు బొట్టు ఇవ్వండి నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను
అండమాన్ నికోబార్ దీవులను ఆక్రమించుకొని, వాటికి షహీద్, స్వరాజ్ అని పేర్లు పెట్టాడు. దీనికి లోకనాథన్ గవర్నర్ జనరల్‌గా నియమించబడ్డాడు.
భారతదేశ తాత్కాలిక ప్రభుత్వమును రంగూన్‌లో ఏర్పాటు చేశాడు. దీనినే ఆజాద్ హింద్ పౌజ్‌గా పేర్కొంటారు.
అజాద్ హింద్ ఫౌజ్‌లో చేరిన హైదరాబాదీలు -సప్రానీ, సురేష్ చంద్ర
ఈశాన్య రాష్ట్రాల ఆక్రమణకై జపాన్ బయలుదేరినపుడు ఇండియన్ నేషనల్ ఆర్మీ సైనికులు వారితో చేరారు.
కానీ మార్గమధ్యంలో జపాన్ సైనికులు ఇండియన్ నేషనల్ ఆర్మీ సైనికులను అతి దారుణంగా అవమానించుటచే వారు తమ ఉత్సాహాన్ని కోల్పోయారు. ఈశాన్య రాష్ట్రాల ఆక్రమణ విఫలమైనది. ఇండియన్ నేషనల్ ఆర్మీ సైనికులు బ్రిటిష్ కు పట్టుబడ్డారు.
వీరిపై 1945లో ఇండియన్ నేషనల్ ఆర్మీ లేదా ఎర్రకోట విచారణ జరిగింది.
1945 ఆగస్టు 18న సుభాష్ చంద్రబోస్ తైవాన్ విమాన ప్రమాదంలో మరణించాడని పేర్కొంటారు. ఇతని అస్థికలు టోక్యోలోని రెంకోజి బౌద్ధ దేవాలయంలో ఉన్నాయని కూడా పేర్కొంటారు.