జవహర్‌లాల్ నెహ్రూ :
మరణం: 27-5-1964
బిరుదులు - పండిత్, చాచా, నవభారత నిర్మాత
పస్తకాలు:
- Discovery of India
- Glimpses of World History (జవహర్‌లాల్ నెహ్రూ తన కుమార్తె ఇందిరాగాంధీకి రాసిన లేఖలు)
- Soviet Asia
- Wither India (ఏ దిశలో పయనిస్తుంది) (గాంధీతో తనకు భావభేదాలను విశదీకరించాడు)
3 సార్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కి అధ్యక్షుడైన రెండవ వ్యక్తి జవహర్‌లాల్ నెహ్రూ.
జవహర్‌లాల్ నెహ్రూ స్వాతంత్ర్యానికి ముందు 3 సార్లు, స్వాతంత్ర్యం తర్వాత 3 సార్లు మొత్తం 6 సార్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు అధ్యక్షుడయ్యాడు.
1929 లాహోర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షత 3 ప్రధాన
తీర్మానాలు ఆమోద్ధించబడ్డాయి. అవి
1) పూర్ణ స్వరాజ్
2) శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించుట
3) ప్రతి సంవత్సరం జనవరి 26ను స్వాతంత్ర్య దినంగా జరుపుట
1929 డిసెంబర్ 31న అర్ధరాత్రి కాంగ్రెస్ అధ్యక్షుడు నెహ్రూ ప్రశాంత గంభీరమైన ఊరేగింపుగా వచ్చి స్వతంత్ర త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. ఈ సందర్భంగా నెహ్రూ 'విస్తృత ప్రజాసమూహం ఆనంద ఉద్వేగభరితులయ్యారు. వారిలో భారతదేశ బంగారు భవిష్యత్తును గూర్చిన నూతన ఆశలు చిగురించినాయి' అని అన్నాడు.
1930 జనవరి 26న దేశమంతటా పూర్ణ స్వరాజ్య దినంగా జరపవలెనని ప్రకటించాడు.
నెహ్రూ 'కమ్యూనిస్టు సిద్ధాంతం పూజారి' అని బ్రిటీష్ అధికారులు చాలామంది భావించారు.
సామ్యవాదం అంటే 'మన రాజకీయ, ఆర్థిక వ్యవస్థలో విసృత విప్లవాత్మక మార్పులు రావాలి. ప్రస్తుత పెట్టుబడిదారీ విధానం స్థానంలో నూతన నాగరికత ఆవిర్భవించాలి' అని నెహ్రూ ఉద్ఘాటించారు.
1936 లక్నో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశమునకు నెహ్రూ అధ్యక్షుడు. ఈ సమావేశంలో సామ్యవాదం (సోషలిజం) అనే పదం మొట్టమొదటిసారిగా నిర్వచించబడినది.
1937 ఫైజ్‌పూర్(మహారాష్ట్ర) ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశమునకు నెహ్రూ అధ్యక్షుడు.
ఇది గ్రామంలో జరిగిన ఏకైక సమావేశం -ఫైజాపూర్ (మిగతావన్నీ పట్టణాల్లో జరిగాయి)
1937 ఎన్నికలలో మొత్తం 11 రాష్ట్రాలోని 8 రాష్ట్రాలలో నెహ్రు అధ్యక్షతన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విజయం సాధించింది.
1938లో ఏర్పాటు చేయబడిన ప్లానింగ్ కమిటీకి నెహ్రూ అధ్యక్షుడయ్యాడు.
1946 సెప్టెంబర్ 2న నెహ్రూ నేతృత్వంలో భారతదేశంలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పడింది.
1946 డిసెంబర్ 13వ తేదీన లక్ష్యాలు, ఆశయాలు తీర్మానాన్ని నెహ్రూ రాజ్యాంగ పరిషత్‌లో ప్రవేశపెట్టాడు.
ఆదేశ సూత్రాలు రాజ్యాంగంలో ఉండాలని నెహ్రూ పేర్కొన్నాడు.
జవహర్‌లాల్‌నెహ్రూ యొక్క వ్యాఖ్యలు:
1919 చట్టం గురించి Old Wine in the New Bottle
1935 చట్టం గురించి - "A Charter of Slavery", "We are Provided by a Car, all Brakes & No Engine"