ఛార్టర్ చట్టం - 1793
ఈ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారాలను విస్తృతం చేయడం జరిగింది.
కంపెనీకి గల వ్యాపార గుత్తాధిపత్యం మరొక 20 సం॥ పొడిగించబడింది.
బోర్జు కార్యదర్శిని పార్లమెంటులో కూర్చోవడానికి అనుమతించారు.
ఛార్టర్ చట్టం - 1813
ఈస్టిండియా కంపెనీ ఛార్టర్ను మరొక 20 సం॥ పొడిగించారు.
కంపెనీకి భారతదేశ వర్తకంపై గల గుత్తాధిపత్యాన్ని తొలగించి కేవలం పరిపాలనాపరమైన సంస్థగా మార్చారు.
పన్నులు విధించడానికి, అవి చెల్లించని వారిపై చర్యలను తీసుకునే అధికారాన్ని స్థానిక సంస్థలకు ఇచ్చారు.
భారతీయులకు మతపరమైన, విద్యాపరమైన అధ్యయనం కోసం లక్ష రూపాయలతో ఒక నిధిని ఏర్పాటు చేశారు. అలాగే, సివిల్ సర్వెంట్లకు శిక్షణా సదుపాయాన్ని కల్పించారు.
ఈ చట్టం ద్వారా భారత్‌లో వర్తకం చేయడానికి అందరికీ అవకాశం కల్పించారు. భారత్‌లో మిషనరీ లు ప్రవేశించి చర్చ్ లు, ఆసుపత్రులు, విద్యాలయాలుస్థాపించడం వలన మతమార్పిడులకు అవకాశం ఏర్పడింది.
ఛార్టర్ చట్టం - 1833
ఈస్టిండియా కంపెనీ పాలన మరొక 20 సం॥ పొడిగించడం జరిగింది.
బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను ఈ చట్టం ద్వారా “ఇండియన్ గవర్నర్ జనరల్గా మార్చారు. ఆ హోదాలో మొదటి గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్.
రాష్ట్ర ప్రభుత్వాల శాసనాధికారాలు రద్దయి, కార్యనిర్వాహక మండలి. సమేతుడయిన గవర్నర్ జనరల్‌కు పూర్తి శాసనాధికారం లభించింది.
కంపెనీ వ్యాపార లావాదేవీలను రద్దుచేసి, పరిపాలనా సంస్థగా మార్చారు.
సివిల్ సర్వీసుల నియామకాల్లో సార్వజనిక పోటీ పద్ధతిని ప్రతిపాదించారు. కాని కోర్ట్ ఆఫ్ దైరక్టర్స్ వ్యతిరేకించడం వల్ల అమల్లోకి రాలేదు.
భారతీయ శాసనాలు క్రోడీకరించడానికి ఒక భారతీయ 'లా' కమీషన్‌ను నియమించారు. దీనికి మొట్టమొదటి
అధ్యక్షుడు లార్డ్ మెకాలె,
ఈ చట్టాన్ని భారతదేశంలో “కేంద్రీకృత పాలన”కు తుదిమెట్టుగా అభివర్ణిస్తారు.
ఛార్టర్ చట్టం - 1853
ఛార్టర్ చట్టాల్లో ఇది చిట్టచివరి చట్టం. ఛార్టర్చట్టాలను ప్రతి 20 సం.రాలకు పొడిగించడం అనే అనవాయితీకి అనుగుణంగా ఈ చట్టాన్ని చేశారు. అయితే ఈ పర్యాయం కంపెనీ పాలనను 20 సం.లకు పొడిగించలేదు. దీనితో కంపెనీ పాలన త్వరలోనే అంతమవుతుందని సూచించినట్లయింది.
గవర్నర్ జనరల్ యొక్క సాధారణ మండలి అధికారాలను శాసన మరియు కార్యనిర్వాహక విధులుగా విభజించి, శాసనాలు రూపొందించే ప్రక్రియ కొరకు ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. ఇది బ్రిటీష్ పార్లమెంటు వలె తన విధులను నిర్వర్తిస్తుంది. అందుకే దీనిని “మినీ పార్లమెంటు” అనేవారు.
కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో మొదటిసారిగా స్థానిక ప్రతినిధులకు ప్రాతినిధ్యాన్ని కల్పించారు. మొత్తం ఆరుగురు శాసన సభ్యులలో నలుగురు సభ్యులను మద్రాసు, బొంబాయి, బెంగాల్ మరియు ఆగ్రా ప్రాంతాలనుండి తీసుకున్నారు.
సివిల్ సర్వీసు నియామకాలను “సార్వజనిక పోటీ విధానం” (Open Merit) ద్వారా నియమించే పద్ధతిని ప్రవేశపెట్టారు. ఇందుకోసం లార్డ్ మెకాలే కమిటీని 1854లో ఏర్పాటు చేశారు.
వివిధ లా కమీషన్‌ల సిఫారసుల ద్వారా సివిల్ ప్రోసీజర్ కోడ్ (1859), ఇండియన్ పీనల్ కోడ్ (1860) మరియు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లను. (1861) రూపొందించడం జరిగింది.
కంపెనీ పాలనకు సంబంధించి నిర్దిష్ట వ్యవధి పేర్కొనకపోవడం వల్ల కంపెనీ పాలన చక్రవర్తి చేతుల్లోకి మారడానికి ఛార్టర్ చట్టం మార్గం సుగమం చేసిందని భావిస్తారు. భారతీయులకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించకపోవడం వల్ల, తరువాత జరిగిన పరిణామాలు సిపాయిలు తిరుగుబాటుకు దారితీసిందని చెప్పవచ్చు.
Note: అతి తక్కువ కాలం అమలులో ఉన్న చట్టం ఇదే.