పిట్స్ ఇండియా చట్టం - 1784
రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించడానికి బ్రిటీషు పార్లమెంటు ఈ చట్టాన్ని 1784లో ఆమోదించింది. ఆనాటి బ్రిటన్ ప్రధానమంత్రి “విలియం పిట్స్” ఈ చట్టాన్ని ప్రతిపాదించడం వలన దీనిని పిట్స్ ఇండియా చట్టంగా వ్యవహరిస్తారు.
ముఖ్యాంశాలు
ఈస్ట్ ఇండియా కంపెనీ విధులను వాణిజ్య మరియు రాజకీయ విధులుగా వేరుచేశారు.
గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలికి ప్రెసిడెన్సీ ప్రాంతాలపై ప్రత్యక్ష నియంత్రణ అధికారాన్ని ఇచ్చారు. అలాగే గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో కొన్ని మార్పులు చేశారు.
అ కార్యనిర్వాహక మండలి సంఖ్య నాలుగు నుండి మూడుకు తగ్గించబడింది.
ఈ చట్టం వల్ల కంపె పెనీ పాలనపై ఒక విధమైన అదుపు ఏర్పడింది. అయితే కోర్ట్ ఆఫ్ డైరక్టర్స్ మరియు, బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ అనే రెండు స్వతంత్ర సంస్థలు ఏర్పాటు చేయడం వల్ల దీనిని “ద్వంద్వ పాలనకు నాంది 'ప్రస్తావనగా” చెప్పవచ్చు.
దీనిని పార్లమెంటేతర నియంత్రణకు మొట్టమొదటి అడుగుగా కూడా పేర్కొంటారు. ఈ చట్టాన్ని భారతదేశంలో కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడానికి చేయబడినదిగా “మార్క్ మరియు ఎంగిల్స్” అభివర్ణించారు.