రౌండ్ టేబుల్ సమావేశాలు(Round Table Conferences):
1929లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సైమన్ కమీషన్ నివేదిక, భారత రాజ్యాంగపరమైన సంస్కరణల పై చర్చించేందుకు రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసారు. ఆనాటి బ్రిటన్ ప్రధానమంత్రి రామ్ సే మెక్ డొనాల్డ్ చొరవతో రాజ ప్రతినిధి (వైస్రాయి) ఇర్విన్ ను ఇంగ్లాండుకు రప్పించారు. భారతీయుల సమస్యలు చర్చించడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుందని, ఇందులో పాల్గొనడానికి అన్ని పార్టీలకు, వర్గాలకు ఆహ్వానం వస్తుందని మెక్ డొనాల్డ్ ఒక ప్రకటన చేసారు.
మొదటి రౌండ్ టేబుల్ సమావేశం(First Round Table Conference)
1930 నవంబర్ 12వ తేది నుండి 1931 జనవరి 19 తేది వరకు మొదటి రౌండ్ టేబుల్ సమావేశం లండన్ లో జరిగింది. 89 మంది ప్రముఖ రాజనీతిజ్ఞులు పాల్గొన్నారు. కాని జాతీయ కాంగ్రెస్ పాల్గొనలేదు. భావి భారత రాజ్యాంగం సమాఖ్యంగా ఉండాలా లేదా ఏక కేంద్రంగా ఉండాలా అనే అంశం మీద చర్చ జరిగింది. కాంగ్రెస్ పాల్గొనకపోవడంవల్ల చర్చలో నిజమైన ప్రగతి సాధ్యం కాలేదు. సమావేశంలో పాల్గొనని ప్రజా వర్గాల సహకారం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రధానమంత్రి మెక్‌డొనాల్డ్ ఈ సమావేశాన్ని ముగించారు.
మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో ముస్లిం లీగ్ తరపున జిన్నా అలీఖాన్, మహ్మద్ అలీ, మహ్మద్ షా మరియు, ఫజల్ హక్, పిందూ మహాసభ తరపున మూంజే మరియు జయకర్, ఉదారవాదుల తరపున తేజ్ బహుదూర్ సప్రూ
చింతామణి, శ్రీనివాస శాస్త్రి, డా॥ బి.ఆర్. అంబేద్కర్ మరియు హైద్రాబాద్ దివాన్ అక్బర్ హైదర్ కూడా పాల్గొన్నారు.
రెండవ రౌండ్ టేబుల్ సమావేశం(Second Round Table Conference)
1931 సెప్టెంబర్ 7 నుండి డిసెంబర్ 7వ తేది వరకు లండన్‌లో జరిగింది. ఇర్విన్‌తో చేసుకున్న ఒడంబడిక ప్రకరం కాంగ్రెస తరపున గాంధీ సమావేశానికి హాజరయ్యారు. అన్ని స్వదేశీ సంస్థానాధిపతులతో సహా 107 మంది పాల్గొన్నారు. ఈ సమావేశానికి మహిళా ప్రతినిధిగా సరోజిని నాయుడు హాజరయ్యారు. “బలహీన వర్గాల తరపున డా. బి.ఆర్. అంబేద్కర్ పాల్గొన్నారు. ముస్లిం వర్గాలకు రెండు "కొత్త ప్రొవిన్స్‌లను (నార్త్ వెస్ట్రెన్ ప్రావిన్స్ మరియు సింద్) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించటం చేత, దీనిని “విభజించు, పాలించు” అనే విధానంగా భావించి గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు. అల్పసంఖ్యాక వర్గాల సమస్యపై ఈ సమావేశం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. “బిటీషు ప్రధానమంత్రి, తాను దారులు వేరయ్యే చోటుకే వచ్చానని” గాంధీ ప్రకటించారు.
కమ్యూనల్ అవార్డు 1932(Communal Award 1932)
మైనారిటీ. వర్గాల ప్రాతినిధ్యానికి ఆనాటి బ్రిటన్ ప్రధాని రామ్‌సే మెక్‌డొనాల్డ్ 1932 ఆగస్టు 4వ తేదీన ఒక ప్రతిపాదన
చేశారు. దీనిని కమ్యూనల్, అవార్డు (Communal Award) అంటారు. దీనిప్రకారం ముస్లింలకు, సిక్కులకు మరియు
క్రిస్టియన్లకు. ప్రత్యేక నియోజక గణాలే కాకుండా షెడ్యూల్డ్ కులాలకు కూడా ప్రత్యేక నియోజక గణాలను ప్రతిపాదించారు.
దీనిని డా॥ బి.ఆర్. అంబేద్కర్ సమర్థించారు. అయితే గాంధి దీనిని వ్యతిరేకిస్తూ, పూనా లోని ఎర్రవాడ కారాగారంలో 1932 సెప్టెంబర్ 20 వ తేదీన ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్నారు. రాజాజీ, మదన్‌మెహన్ మాలవ్య వంటి నాయకులు చొరవతీసుకొని డా॥ బి.ఆర్. అంబేద్కర్ మరియు గాంధితో చర్చించి దీక్షను విరమింపజేశారు.. 1932 సెప్టెంబర్‌లో పూనా ఒప్పందం కుదిరింది. తద్వారా కమ్యూనల్ అవార్డు కంటె ఎక్కువగా షెడ్యూల్డ్ కులాలకు అవకాశాలు లభించాయి.
మూడవ రౌండ్ టేబుల్ సమావేశం(Third Round Table Conference)
1932 నవంబర్ 17 నుండి డిసెంబర్ 24 వరకు లండన్‌లో జరిగింది. సమస్యలు సృష్టిస్తారనుకున్న వారికి
బ్రిటిష్ ప్రభుత్వం ఆహ్వానం పంపలేదు. అందువల్ల కాంగ్రెస్ ప్రతినిధులు సమావేశానికి హాజరు కాలేదు. ఇంగ్లాండ్‌లోని
లేబర్ పార్టీ కూడా సహకరించలేదు. ఇందులో అంతకు ముందు నియమించబడిన ఉపసంఘాల నివేదికలను
చర్చించారు. సమావేశంలో చేసిన సిఫార్సుల్లో ఎక్కువ భాగం 1935 భారత ప్రభుత్వ చట్టంలో స్థానాన్ని పొందాయి.
ఈ సమావేశానికి కేవలం 46 మంది ప్రతినిధులు హాజరయ్యారు
గమనిక: మూడు సమావేశాలకు హాజరయ్యినవారు డా॥ బి.ఆర్. అంబేద్కర్, డా॥ మహమ్మద్ అలీ జిన్నా, 3 రౌండ్ సమావేశాల్లో పాల్గొన్న మహిళా ప్రతినిధి - సరోజినీ నాయుడు
బ్రిటీషువారు రూపొందించిన రాజ్యాంగ సంస్కరణ చట్టాలలో ఈ చట్టం వివరణాత్మకమయినది మరియు సుదీర్షమైనది. 1937 ఏప్రిల్ నుండి ఇది అమలులోకి వచ్చింది. '
ఈ చట్టంలో 321 ప్రకరణలు, 10 షెడ్యూళ్ళు, 14 భాగాలు ఉన్నాయి.
ముఖ్యంశాలు

- అఖిల భారత సమాఖ్య ఏర్పాటు - ఈ సమాఖ్యలో 11 ప్రాంతాలు, 6 చీఫ్ కమిషనర్ల ప్రాంతాలు, సమాఖ్యలోచేరడానికి అంగీకరించిన స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి.
- కేంద్ర, రాష్ట్రాల మధ్య 3 జాబితాల ప్రకారం అధికార విభజన ఉంటుంది.
ఉమ్మడి జాబితా - 36 అంశాలు
- అవశిష్ట అధికారాలను (Residual Powers) - వైస్రాయికి ఇచ్చారు. అయితే స్వదేశీ సంస్థానాలు ఈ సమాఖ్యలో చేరకపోవడం వల్ల ఇది అమలులోకి రాలేదు.
- రాష్ట్రాలలో ఉన్న ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దుచేసి కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రతిపాదించారు. కేంద్రంలో పాలనాంశాలను రిజర్వుడు, ట్రాన్స్‌ఫర్డ్ అంశాలుగా విభజించారు.
- రిజర్వుడు అంశాలను తాను నియమించిన ముగ్గురు కౌన్సిలర్ల సహాయంతో గవర్నర్ జనరల్ పరిపాలిస్తారు. ట్రాన్స్‌ఫర్డ్ అంశాలకు సంబంధించి, గవర్నర్ జనరల్, 10మందికి మించకుండా ఒక మంత్రిమండలిని నియమించి, దాని సహాయంతో అంశాలను పర్యవేక్షిస్తారు
- రాష్ట్ర స్థాయిలో ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టారు. దేశంలోని మొత్తం 11 రాష్ట్రాలలో ఆరు రాష్ట్రాలలో (బెంగాల్, ముంబాయి, మద్రాసు, బీహార్. అస్సాం మరియు యునైటెడ్ ప్రావిన్స్) ప్రవేశపెట్టారు.
- భారత రాజ్య కార్యదర్శికున్న కౌన్సిల్‌ను రద్దుచేశారు. ఆ కౌన్సిల్‌కు బదులు ముగ్గురి కంటే తక్కువ కాకుండా, ముగ్గురికంటే తక్కువ కాకుండా ఆరుగురికి మించని సలహాదార్లను భారత రాజ్య కార్యదర్శికి సహాయంగా నియమించారు.
- కేంద్ర శాసనసభల పరిమాణాన్ని పెంచారు. కేంద్ర ఎగువసభ అయిన కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ సభ్యత్వ సంఖ్యను 260కి, దిగువ సభ అయిన లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యత్వాన్ని 375కు పెంచడం జరిగింది.
- కమ్యూనల్ ప్రాతినిధ్యాన్ని కొనసాగిస్తూ ఈ సదుపాయాన్ని షెద్యూల్డ్ కులాలకు, మహిళలకు వర్తింపచేశారు.
- ఓటు హక్కును విసృతపరిచారు. జనాభాలో 10 శాతానికి ఓటుహక్కును వర్తింపచేశారు.
- కేంద్ర, రాష్ట్రాల మధ్య సమాఖ్య వివాదాలను పరిష్కరించడానికి ఫెడరల్ కోర్టును (సుప్రీం కోర్టును) ఏర్పాటు చేశారు. ఇందులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఆరుగురు ఇతర న్యాయమూర్తులుంటారు. అయితే దీని తీర్పులే సర్వోన్నతం
- కాదు. వీటిని ఇంగ్లాండులో ఉన్న ప్రివి (Privy) కౌన్సిల్‌కు అప్పీల్ చేసుకోవచ్చు.
- ఈ చట్టం ద్వారా బర్మాను భారతదేశం నుండి వేరు చేశారు. ఒరిస్సా మరియు సింధ్ అనే. రెండు కొత్త ప్రావిన్సు (Province) లను ఏర్పాటు చేశారు. బ్రిటీషు ఇండియాపై బ్రిటీషు పార్లమెంటు సర్వాధిపత్యాన్ని పునరుద్గాటించడం జరిగింది.
- కేంద్రంలో ఒక ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌ను, రాష్ట్రాలలో కూడా పబ్లిక్ సర్వీస్ కమీషన్‌ను ఏర్పాటు చేశారు. భారతదేశంలో విత్త విధానం మరియు రుణ నియంత్రణ కోసం రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియాను (RBI) ఏర్పాటు చేశారు.
ప్రాంతాల స్వయంప్రతిపత్తి అనేది ఈ చట్టం ద్వారా పొందుపరచిన అత్యంత ముఖ్యమైన అంశం. మొదటిసారిగా రాష్ట్రాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. ప్రాంతీయ పరిపాలనా అంశాలన్నీ మంత్రుల ఆధీనంలోకి బదిలీ అయ్యాయి. కేంద్ర నియంత్రణ చాలా వరకు తగ్గించబడింది. గవర్చర్లు రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధమయిన అధిపతులుగా పరిగణింపబడ్డారు.
విమర్శ - వ్యాఖ్యానాలు
- బానిసత్వానికి ఒక నూతన చట్టం, భారతదేశంపైన బలవంతంగా రుద్దబడింది. ఇంజను లేకుండా కేవలం గట్టి బ్రేకులున్న యంత్రం - జవహర్‌లాల్ నెహ్రూ
- భారతదేశంలో గోచరించే భూస్వామ్య వ్యవస్థను ధృఢం చేయడానికి బ్రిటిష్ పాలకులు ఆడిన నాటకం. - సుభాష్ చంద్రబోస్
- ఖచ్చితంగా పిచ్చిది, సమూలంగా చెడ్డది, మొత్తానికి అనంగీకారమైనది. - జిన్నా
- ఈ చట్టాన్ని మా మీద బలవంతంగా రుద్దారు. బాహ్యంగానే దీనికి కొంత ప్రజాస్వామ్య రూపం ఉన్నట్లు తోచినా లోపల మాత్రం అంతా శూన్యం. - పండిట్ మదన్‌మోహన్ మాలవ్య
- ఈ చట్టం ద్వారా వైస్రాయ్‌కు హిట్లర్ మరియు ముస్సోలిని తలపించే నియంతృత్వ అధికారాలు ఇచ్చారు. ఇది పొట్టి మనుషులు కట్టిన అవమానకరమైన గొప్ప కట్టడం. - విన్‌స్టన్ చర్చిల్
- బ్రిటీష్ వారు భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణల కోసం చేసిన చట్టాల్లో అతిపెద్ద చట్టం.
- భారత రాజ్యాంగాన్ని ఈ చట్టం యొక్క నమూనాగా వర్ణిస్తారు. (Photo Copy)
- రాజ్యాంగంలోని సుమారు 60% అంశాలు ఈ చట్టం నుండే గ్రహించారు.
- ఈ చట్టంద్వారా మొదటిసారిగా కేంద్రంలో సమాఖ్య వ్యవస్థలు, రాష్ట్రాలలో ద్విసభా విధానాన్ని ప్రతిపాదించారు.
- ఈ చట్టం ప్రధానంగా స్వయంపాలనకు ఉద్దేశింపబడినది.