Nature and Salient features of Indian Constitution-12

TSStudies
Highlights of Indian constitution in telugu
భారత రాజ్యాంగం - ముఖ్య లక్షణాలు (Highlights of Constitution of India)
ప్రపంచంలో లిఖించబడిన (ప్రతి రాజ్యాంగానికి సాధారణ మరియు విశిష్ట లక్షణాలు ఉంటాయి. రాజ్యాంగ రచనా సమయానికి ఆ దేశంలో నెలకొనివున్న రాజకీయ, సాంస్కృతిక, చారిత్రక పరిస్థితులు ఈ లక్షణాలలో చోటు చేసుకుంటాయి. అలాంటి లక్షణాలు భారత రాజ్యాంగంలో కూడా చాలా ఉన్నాయి.
భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోకెల్లా అత్యంత శ్రేష్టమైన, ఉత్తమమైన రాజ్యాంగంగా అభివర్ణించవచ్చు. రాజ్యాంగంలో పొందుపరచిన వివిధ అంశాలను పరిశీలిస్తే రాజ్యాంగ విశిష్టత, ప్రత్యేకత స్పష్టమవుతుంది. ఆ ప్రత్యేక లక్షణాలను ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు.

అతి పెద్ద లిఖిత రాజ్యాంగం (The Largest Constitution of World)
ప్రపంచ లిఖిత రాజ్యాంగాలలో అతి పెద్ద రాజ్యాంగం. సుధీర్ఘ స్వభావాన్ని రాజ్యాంగంలో ఉన్న ప్రకరణలు, భాగాలు,షెడ్యూళ్ల రూపంలో గుర్తిస్తారు.
రాజ్యాంగము అమలులోకి వచ్చే సమయానికి, అనగా 1950 జనవరి 26 నాటికి 395 ప్రకరణాలు 22 భాగాలు, మరియు 8 షెడ్యూళ్ళు ఉండేవి.
అయితే ప్రస్తుతం 470 ప్రకరణలు, 25 భాగాలు, 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. వీటి సంఖ్య కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. 
కొత్తగా చేర్చిన ప్రకరణల సంఖ్య 97 కాగా, తొలగించబడిన ప్రకరణల సంఖ్య 22. (వీటి గురించి వివరణ రాజ్యాంగ సవరణ చాప్టర్ లో చూడండి).
కొత్తగా చేర్చబడిన భాగాలు - IVA, IXA, IXB, XIVA, తొలిగించబడిన భాగం - VII
గమనిక: ముసాయిదా రాజ్యాంగంలో, అనగా రాజ్యాంగపరిషత్తు ఆమోదించకముందు 315 ప్రకరణలు, 8 షెడ్యూల్స్ ఉండేవి.

ప్రత్యేక వివరణ
పాఠకులు ప్రకరణల సంఖ్యకు సంబంధించి ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఏదైనా ఒక కొత్త ప్రకరణ రాజ్యాంగంలో పొందుపరిస్తే ఆంగ్ల అక్షరాలయిన “A, B, C, D” ల రూపంలో సూచిస్తారు. అంతేకాని వాటికి ప్రత్యేక సంఖ్యను ఇవ్వరు. అలాగే తొలగించబడిన ప్రకరణను ఖాళీగా ఉంచుతారు. ప్రకరణల సంఖ్యను సర్దుబాటు చేయరు. ఉదాహరణకు, నిబంధన 81లోని ఆస్తి హక్కును తొలగించారు. అయితే ఆ తరువాత నిబంధన 31లో చేర్చిన అంశాలను 31A, 31B, 31C లుగా గుర్తిస్తారు. కనుక మౌలిక రాజ్యాంగంలోని నిబంధనల సంఖ్యల వారిగా 395కు మించదు. ఇదే పద్ధతి భాగాలకు కూడా వర్తిస్తుంది. అయితే క్రొత్తగా చేర్చిన ప్రకరణల సంఖ్యను కలుపుకుంటే మొత్తం నిబంధనల సంఖ్య వస్తుంది. ఈ క్రింది విధంగా వీటిని గుర్తుంచుకోవచ్చు.
395 - సంఖ్యాయుత ప్రకరణలు (Numbered Articles)
470 - మొత్తం ప్రకరణల సంఖ్య (Number of Articles) [There are 104 amendments have been made in the Indian constitution Till the date]
ప్రకరణలు లేదా నిబంధనలు లేదా అధికరణలు - అనగా క్రోడీకరించబడిన సమగ్ర సూత్ర నియమాలు. వీటిని ఆంగ్లములో “ఆర్టికల్స్" అంటారు.
భాగాలు (Parts) - అవగాహన సౌలభ్యం కోసం, ప్రత్యేక అంశాలవారిగా రాజ్యాంగంలోని ప్రకరణలను భాగాలుగా, భాగాలను ఛాఫ్టర్లుగా వర్గీకరించారు.
షెడ్యూల్స్ (Schedules)- షెడ్యూల్స్ రాజ్యాంగానికి అనుబంధాల వంటివి. రాజ్యాంగములోని ప్రకరణకు సంబంధించిన అంశాన్ని అదనపు సమాచారాన్ని షెడ్యూలు రూపంలో పొందుపరుస్తారు. 
ఉదా. పంచాయితి విధులను 11వ షెడ్యూల్లో పొందుపరిచారు.
Nature and Salient features of Indian Constitution,Salient Features of the Constitution of India,Indian Polity tspsc,Indian Polity notes in telugu,Indian constitution amendments,indian constitution notes in telugu,indian polity study material in telugu,Constituent Assembly notes in telugu,Constitution of India notes in telugu,Constitution of India tspsc notes in telugu,Constituent Assembly of India,Amendments of the Constitution India,Amend constitutional features,Revise Schedules in the Constitution of India,The Role of Constituent Assemblies in Constitution Making,