Fundamental Rights of Indian Constitution (Articles 12-35)-4

TSStudies
0
List of Fundamental rights in telugu
ప్రాథమిక హక్కుల వర్గీకరణ
భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ప్రధానంగా ఏడు రకాలుగా వర్గీకరించారు. 
  1. సమానత్వపు హక్కు (ప్రకరణలు 14-18) (Right to Equality)
  2. వ్యక్తి స్వేచ్చ, స్వాతంత్రపు హక్కు (ప్రకరణలు 19-22) (Personal Freedoms)
  3. పీడనాన్ని నిరోధించే హక్కు (ప్రకరణలు 23, 24) (Right against Exploitation)
  4. స్వాతంత్య్రపు హక్కు (ప్రకరణలు 25-28) (Right to Religion)
  5. సాంస్కృతిక, విద్యా హక్కులు (ప్రకరణలు 20,30) (Cultural and Educational Rights)
  6. ఆస్థి హక్కు (ప్రకరణ 31) (Right to Property)
  7. రాజ్యాంగ పరిహార హక్కు (Right to constitutional Remedies)
ప్రత్యేక వివరణ
అయితే, పైన పేర్కొన్న ప్రాథమిక హక్కులలో అత్యంత వివాదాస్పదమైన ఆస్తిహక్కు (ప్రకరణ 31)ను, అలాగే ఆస్తి సంపాదన విషయంలో వ్యక్తి స్వేచ్చకు సంబంధించిన 19(1)(f)ను 1978లో 44వ రాజ్యాంగ సవరణ. ద్వారా ప్రాధమిక హక్కుల జాబితా నుండి తొలగించి 12వ భాగంలో 300A లో చేర్చారు. ప్రస్తుతము ఆస్తి హక్కు రాజ్యాంగ బద్ధమైన (Constitutional Right) హక్కు మాత్రమే. ఒక చట్టబద్దమైన హక్కుగా కూడ పరిగణించబడుతుంది.

ప్రకరణ 12 - రాజ్య నిర్వచనం - ప్రాముఖ్యత
ప్రాథమిక హక్కులను మౌలికంగా రాజ్యం యొక్క నిరపేక్ష అధికారాలకు వ్యతిరేకంగా పొందుపరిచారు. రాజ్యం అనే పదాన్ని రాజ్యాంగంలో చాలా చోట్ల ప్రయోగించారు. అయితే రాజ్యం నిర్వచనాన్ని మాత్రం ప్రకరణ 12లో పేర్కొన్నారు.
రాజ్యం అనే పదానికి విస్సృతమైన నిర్వచనాన్ని పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులు రాజ్యం లేదా ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా గుర్తించబడ్డాయి కనుక ఏయే సంస్థలు రాజ్య పరిధిలోకి వస్తాయో స్పష్టంగా. నిర్వచించకపోతే కొన్ని సంస్థలు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినప్పటికీ వాటిపై న్యాయస్థానంలో ప్రశ్నించే అవకాశం ఉండదు. అందుచేత దీనిని విస్తృతమైన నిర్వచనం అవసరం. రాజ్యం అనగా
  • ఎ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర, రాష్ట్ర శాసనసభలు
  • బి) స్థానిక ప్రభుత్వాలు అనగా మున్సిపాలిటీలు, పంచాయితీలు, జిల్లా బోర్డులు, ట్రస్టులు
  • సి) ప్రభుత్వ ఆదేశాల ద్వారా ఏర్పాటైన చట్టబద్ధ, చట్టేతర సంస్థలైన ఎల్‌.ఐ.సి., ఓ.ఎన్‌.జి.సి.. మరియు ఎన్‌.టి.పి.సి. మొ. 
  • డి) న్యాయవ్యవస్థ కూడా రాజ్య నిర్వచన పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు తన తీర్పులలో తెలిపింది. అలాగే ప్రభుత్వ భాగస్వామ్యమున్న ప్రైవేటు సంస్థలు కూడా రాజ్య నిర్వచన పరిధిలోకి వస్తాయని పేర్కొంది.
ప్రత్యేక వివరణ
పైన పేర్కొనబడిన సంస్థలతో పాటు ఎలాంటి ఇతర సంస్థలు రాజ్య పరిధిలోకి వస్తాయనే అంశాన్ని వివిధ తీర్చులలో సుప్రీంకోర్టు స్పష్టపరిచింది.

అజయ్‌ సహాయ్‌ Vs  ఖలీద్‌ ముజీద్‌ (1981)
ఈ వివాదంలో ఒక సంస్థను రాజ్యం అనే నిర్వచనంలోకి చేర్చడానికి ఈ క్రింది 'ప్రాతిపదికలను పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
  • మూలధనంలో ప్రభుత్వ వాటా ఉండాలి
  • ఆ సంస్థ మొత్తం ఖర్చును ప్రభుత్వం భరించాలి
  • ఆ సంస్థపై. సంపూర్ణ పరిపాలనా నియంత్రణ ఉండాలి
  • ఆ సంస్థ ఆర్ధిక లావాదేవీలు. ప్రభుత్వ నియంత్రణలో ఉండాలి
న్యాయస్థానాలు రాజ్య నిర్వచన పరిధిలోకి వస్తాయి-సుప్రీంకోర్ట్‌ తీర్పులు
ఎ. ఆర్‌.అంతూలే Vs ఆర్‌.ఎస్‌. నాయక్‌ (1988)
న్యాయస్థానాల కొన్ని చర్యలు రాజ్య నిర్వచనంలోకీ వస్తాయని, ఈ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది. దీనికి రాజ్యాంగంలో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి.
ప్రకరణ 145, 146 ప్రకారం; సుప్రీంకోర్టు స్వంత నియమ నిబంధనలను రూపొందించుకోవచ్చు. అలాగే తన, సిబ్బందిని నియమించుకునే అధికారం కూడా ఉంది. ఈ చర్యలు కార్య నిర్వహకపరమైనవి. వీటివల్ల పౌరుల ప్రాధమిక హక్కులకు భంగం కలిగినప్పుడు. వాటిని న్యాయస్థానంలో ప్రశ్నించవచ్చు.
కనుక, న్యాయశాఖ కార్యనిర్వాహక విధులను నిర్వర్తిస్తున్నప్పుడు మాత్రమే రాజ్యమనే పరిధిలోకి పస్తుందని సుప్రీంకోర్టు ప్రకటించింది.

రాజ్య నిర్వచనం - మినహాయింపులు
సహకార సంఘాలు, బోర్డ్‌ ఆఫ్‌ క్రికెట్‌ కంట్రోల్‌ ఆఫ్‌ ఇండియా, ప్రభుత్వ ధనసహాయం పొందని ప్రైవేట్‌ విద్యాసంస్థలు మరియు ప్రభుత్వ పరిపాలన మరియు ఆర్థిక నియంత్రణ లేని ఇతర సంస్థలు రాజ్య పరిధిలోకి రావు.
History of Fundamental Rights of Indian Constitution notes in Telugu

Post a Comment

0Comments

Post a Comment (0)