ప్రకరణ 13 చట్ట నిర్వచనం, ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైన చట్టాలు - న్యాయ సమీక్షాధికారంప్రకరణ 13(1) ప్రకారం, రాజ్యాంగం అమలులోకి వచ్చిన వెంటనే అంతవరకు అమలులో ఉన్న చట్టాలు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైతే అలాంటి చట్టాలు చెల్లకుండా పోతాయి.ప్రకరణ 13(2) ప్రకారం ప్రాథమిక హక్కులను హరించే లేదా పరిమితం చేసే చట్టాలు, ఆదేశాలు చెల్లవు.ప్రకరణ 13(3) లోని చట్టం నిర్వచనంలోకి ఈ క్రింది అంశాలు వస్తాయి.
- కేంద్ర, రాష్ట్ర శాసన సభలు రూపొందించిన శాసనాలు
- రాష్ట్రపతి, గవర్నర్‌లు జారీ చేసిన ఆదేశాలు మరియు ఆర్దినెన్సులు
- ప్రభుత్వ రూల్స్, రెగ్యులేషన్స్, నోటిఫికేషన్స్ మరియు ప్రకటనలు
- ప్రభుత్వం గుర్తించి చట్టబద్ధత ఉన్న ప్రజల ఆచార వ్యవహారాలు
ప్రత్యేక వివరణ1971లో 24వ రాజ్యాంగ సవరణ ద్వారా, నిబంధన 368 ప్రకారం రాజ్యాంగానికి చేసిన సవరణలు నిబంధన 13లో పేర్మొన్న “చట్టం” నిర్వచన పరిధి నుండి మినహాయించారు. ఈ అంశాన్ని గోలక్‌నాథ్ కేసులో (1967) సుప్రీంకోర్టు తీర్పును అధిగమించడానికి చేశారు. కాని సుప్రీంకోర్టు 1973లో కేశవానందభారతి కేసులో ఈ సవరణ చెల్లదని తీర్పు చెప్పింది. కనుక రాజ్యాంగ సవరణ కూడా చట్ట నిర్వచన పరిధిలోకి వస్తుంది.న్యాయ సమీక్షాధికారం (Power of Judicial Review)ప్రకరణ 13లో సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్షా అధికారం ఉన్నట్లు స్పష్టంగా పేర్కొన్నారు. అయితే న్యాయ సమీక్ష అనే పద ప్రయోగం లేదు. ఏదైనా చట్టం ప్రాథమిక హక్కులకు విరుద్ధమైతే, అలాంటి చట్టాలు చెల్లవు. అలా చెల్లుబాటు కాకుండా తీర్చు చెప్పే అధికారం సుప్రీం కోర్టుకు ఈ నిబంధన ద్వారా సంక్రమించింది. కనుక న్యాయ సమీక్షా అధికారం అనేది మౌలిక నిర్మాణంలో అంతర్భాగం అవుతుంది. దీనిని పరిమితం చేసే అధికారం పార్లమెంటుకు ఉండదు.న్యాయ సమీక్షా అధికారాన్ని లాటిన్ పరిభాషలో ఈ క్రింది విధంగా పేర్కొంటారు.ఏదైనా చట్టం తన పరిధి దాటి ఉంటే దానిని "Ultra Vires" అంటారు. (Ultra=Beyond, Vires=Limits)"Null and Void" అనగా Not Valid లేదా చట్టం చెల్లుబాటు కాదు అని అర్థం.సూచన: (న్యాయ సమీక్షా అధికారం గురించి సుప్రీంకోర్టు చాష్టర్‌లో మరింత వివరంగా ఇవ్వబడింది)నిబంధన 13లో పొందుపరిచిన చట్ట నిర్వచనం, పరిధి, పార్లమెంటుకు ప్రాథమిక హక్కులను సవరించే అధికారాల గురించి సుప్రీంకోర్టు కొన్ని న్యాయసూత్రాలను ప్రకటించింది. వాటికి సంబంధించిన వివరాలు
Fundamental Rights of Indian Constitution (Articles 12-35)-5
21:04:00
0