Fundamental Rights of Indian Constitution (Articles 12-35)-3

TSStudies
0
History of Fundamental Rights of Indian Constitution notes in Telugu
హక్కులు- ప్రపంచ రాజ్యాంగాలు
హక్కుల గుర్తింపుకు సంబంధించి వివిధ దేశాలలో అనేక ప్రయత్నాలు చేశారు. అందులో ముఖ్యమైనవి

మాగ్నా కార్టా - 1215(Magna Carta)
1215లో ఇంగ్లాండ్ రాజు జాన్‌ ఎడ్వర్డ్ ప్రజలకు మొట్టమెదటిసారిగా లన్ని హాక్కులను  గుర్తిస్తూ ఒక ప్రమాణ పూర్వకమైన  దీనినే మాగ్నా కార్టా అంటారు. 
గమనిక: "మాగ్నా" అనగా పెద్దది. “కార్టా అనగా ఛార్జర్‌ (రాజ శాసనము). ఈ ప్రకటన హక్కులకు మూలంగా భావిస్తారు. హక్కుల చరిత్రలో ఒక గొప్ప ప్రకటనగా పేర్కొంటారు.

బిల్‌ ఆఫ్‌ రైట్స్‌ 1689 (ఇంగ్లాండ్‌)
ఇంగ్లాండ్‌ పార్లమెంటు ఒక చట్టం ద్వారా మొదటిసారిగా హక్కులను గుర్తించింది. నిరపేక్ష రాజరికం పై కొన్ని పరిమితులు విధించింది. ఈ ప్రకటన ఇతర దేశాలలో హక్కుల ప్రకటనకు ప్రేరణగా చెప్పవచ్చు. ముఖ్యంగా అమెరికా హక్కుల ప్రకటనపై చాలా ప్రభావం చూపింది.

బిల్‌ ఆఫ్‌ రైట్స్‌ 1789 (అమెరికా)
అమెరికా మౌలిక రాజ్యాంగంలో హక్కుల ప్రస్తావన లేదు. అయితే సుమారు పది రాజ్యాంగ సవరణలను ప్రతిపాదించి అందులో భాగంగా బిల్‌ ఆఫ్‌ రైట్స్‌ను రాజ్యాంగంలో చేర్చారు. అమెరికా రాజ్యాంగ సభ డిసెంబర్‌ 15, 1791లో ఈ హక్కులను ధృవీకరించింది. స్వేచ్చా, సమానత్వాలతో జన్మించిన మానవుడు జీవితాంతం వాటితో కొనసాగుతాడు అని ప్రకటించబడింది. జేమ్స్‌ మాడిసన్‌ అమెరికా రాజ్యాంగ పితామహుడు మరియు బిల్‌ ఆఫ్‌ రైట్స్‌ రూపకర్త.

ఫ్రెంచ్‌ హక్కుల ప్రకటన 1789
1789లో ఫ్రెంచ్‌ జాతీయ సభ చేసిన మానవహక్కుల ప్రకటన, తద్వారా ఇచ్చిన నినాదములైన స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం ప్రపంచ రాజ్యాంగాలన్నింటిని ప్రభావితం చేసింది.

రష్యా ప్రజల హక్కుల ప్రకటన 1917
రష్యాలో బోల్షివిక్‌ విప్లవం తర్వాత కొత్త రాజ్యాంగంలో సామాజిక, రాజకీయ హక్కులను ప్రకటించారు. “విశ్వ సంతోషం” అనే ప్రాతిపదిక పైన హక్కులు ఉండాలని ప్రకటించబడింది.

ఐక్యరాజ్య సమితి విశ్వమానవ హక్కుల ప్రకటన 1948
1948, డిసెంబర్‌ 10వ తేదీన ఐక్యరాజ్యసమితి చేసిన విశ్వమానవ హక్కుల ప్రకటన భారత రాజ్యాంగంలోని హక్కులకు స్ఫూర్తిదాయకము

ప్రాథమిక హక్కులు - లక్షణాలు

ప్రవేశికలో పేర్కొన్న న్యాయం, స్వేచ్చ, సమానత్వం అనే తాత్విక ఆదర్శాలకు వాస్తవితకను చేకూర్చే విధంగా ప్రాథమిక హక్కులను పొందు పరచడం జరిగింది.

ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ (Justiciable) ఉంది. ఇది అత్యంత ముఖ్యమైన లక్షణం. వీటి రక్షణకు, అమలుకు రాజ్యాంగంలో న్యాయపర ఏర్పాట్లు ఉన్నాయి.

ప్రాథమిక హక్కులు ప్రభుత్వ నిరపేక్ష అధికారాలపైన (Absolute Authority) పరిమితులు, ప్రభుత్వాలు తమ అధికారాలను రాజ్యాంగానికి లోబడి, ప్రజల హక్కులకు భంగం కలిగించకుండా వినియోగించాలి.

కొన్ని ప్రాథమిక హక్కులు పౌరులతో పాటు విదేశీయులకు కూడా వర్తిస్తాయి. ఉదా.
    • చట్టం ముందు అందరూ' సమానులే - ప్రకరణ 14
    • అక్రమ శిక్షలకు వ్యతిరేకంగా రక్షణ - ప్రకరణ 20
    • జీవించే హక్కు - ప్రకరణ 21
    • విద్యా     హక్కు - ప్రకరణ 21A
    • అక్రమ అరెస్టులకు రక్షణ - ప్రకరణ 22
    • పీడనాన్ని నిరోధించే హక్కు - ప్రకరణ 23
    • బాల కార్మిక వ్యవస్థ రద్దు - ప్రకరణ 24
    • మత స్వేచ్ఛ - ప్రకరణ 25
    • మత ప్రాతిపదికపైన పన్ను విధింపుపై ఆంక్షలు - ప్రకరణ 27
    • ప్రత్యేక మత బోధన చేయరాదు - ప్రకరణ 28

కొన్ని ప్రాథమిక హక్కులు నకారాత్మకమయినవి (Negative). అనగా ఇవి ప్రభుత్వ అధికారితపైన పరిమితులు. ఉదా. నిబంధన 14, 15, 16, 20, 21 మొదలగునవి. ఇవి ప్రభుత్వం ఏమి చేయకూడదో సూచిస్తాయి.

మరికొన్ని హక్కులు సకారాత్మకమైనవ (Positive). అనగా ఇవి ప్రభుత్వ బాధ్యతలను సూచిస్తాయి. ఉదా. నిబంధన 17లో అస్పృశ్యత నిషేధం, నిబంధనన 24లో బాలకార్మిక వ్యవస్థ నిషేధం.

ప్రాధమిక హక్కులన్నింటిని జాతీయ అత్యవసర (National Emergency) పరిస్థితులలో రద్దు చేయవచ్చు కానీ నిబంధన 20, 21 మాత్రం రద్దు కావు. 

ప్రాథమిక హక్కులన్నీ స్వతహాగా అమలులోకి వస్తాయి. కాని నిబంధన 17, 23, 24లో ప్రస్తావించిన అంశాలు స్వతహాగా అమలులోకి రావు (Non Self-Executory). వాటి అమలుకోసం పార్లమెంటు ప్రత్యేక చట్టాలు చేయాల్సి ఉంటుంది.

ప్రాథమిక హక్కులను సవరించే అధికారము పార్లమెంటుకు ఉంది. అందుకోసం రాజ్యాంగ సవరణ అవసరం. కానీ వీటి స్ఫూర్తికి భంగం కలిగించరాదు.

కొన్ని ప్రాథమిక హక్కులు కొన్ని వర్గాలకు, సాయుధ బలగాలకు, పోలీసులకు, ఖైదీలకు, అత్యవసర సర్వీస్సులలో పనిచేస్తున్నవారికి పరిమితంగా వర్తిస్తాయి.

కొన్ని ప్రాథమిక హక్కులు పౌరుల చర్యలకు వ్యతిరేకంగా కూడా లభిస్తాయి. ఉదా: ప్రకరణ 17 అస్పృశ్యత  నివారణ , ప్రకరణ 23 - వెట్టి చాకిరీ రద్దు, ప్రకరణ 24 - బాలకార్మిక వ్యవస్థ రద్దు.

కొన్ని హక్కులు అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలను కాపాడి జాతీయ సమగ్రతను నిలపడానికి ఉద్దేశించడం జరిగింది. ఉదా: మత స్వేచ్చ హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు

ప్రాథమిక హక్కులలో పేర్కొన్న నిషేధాలు/వివక్షతలు ప్రభుత్వాలకు, పౌరులకు సమానంగా వర్తిస్తాయి. ఉదా: జాతి, మత, కుల, లింగ, జన్మ సంబందమైన వివక్షతలు ఎవరూ పాటించరాదు.

Post a Comment

0Comments

Post a Comment (0)