డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటి (Doctrine of Severability)
పార్లమెంటు చేసిన చట్టాలు, ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు, నిబంధన 13 ప్రకారం ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే ఆ చట్టాలు చెల్లవు. అయితే మొత్తం చట్టాన్ని రద్దు చేయకుండా, ఏ భాగమైతే ప్రాథమిక హక్కులకు విరుద్ధమో, చట్టంలోని ఆ భాగం మాత్రమే రద్దు అవుతాయి. ప్రాథమిక హక్కులకు విరుద్దమయిన అంశాలను చట్టం నుంచి వేరుచేయడానికి వీలులేకపోతే, అప్పుడు మొత్తం చట్టం రద్దు అవుతుంది. ఈ ప్రక్రియనే డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటి అంటారు.డాక్ట్రిన్ ఆఫ్ వైవర్ (Doctrine of Waiver)రాజ్యాంగం 3వ భాగంలో పొందుపరిచిన హక్కులను ప్రభుత్వాలు అమలు చేయాలి. ఏ పౌరుడు కూడా తమ హక్కులను వదులుకోవడానికి వీలులేదు. అమలు చేయాల్సిన బాధ్యత నుండి ప్రభుత్వాన్ని మినహాయించదానికి వీలులేదు. పౌరులు తమకు ఇష్టమైనా, లేకపోయినా అవగాహన ఉన్నా లేకపోయినా తమ హక్కులను వదులుకోవడానికి న్యాయస్థానాలు అనుమతించవు. ఈ సూత్రాన్ని డాక్ట్రిన్ ఆఫ్ వేవర్ అంటారు.ఈ సూత్రాన్ని సుప్రీంకోర్టు 1959లో బసేశ్వర్‌నాథ్ Vs కమీషనర్ ఆఫ్ ఇన్‌కమ్‌టాక్స్ కేసులో ప్రస్తావించింది. అయితే ఈ సూత్రం భారత్‌లో పరిమితంగానే వర్తిస్తుంది.డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ (Doctrine of Eclipse)రాజ్యాంగం అమలులోకి రాకముందు అమలులో ఉన్న చట్టాలు, రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ విరుద్ధంగా భావించినచో, ఆ చట్టాల చెల్లుబాటు విషయంలో సుప్రీంకోర్టు ఈ సూత్రాన్ని వినియోగిస్తుంది. రాజ్యాంగం అమలులోకి రాకముందు ఉన్న చట్టాలు రాజ్యాంగ విరుద్ధమయితే ఆ చట్టాలు పూర్తిగా కొట్టివేయబడవు, ఆ చట్టాల అమలును మాత్రమే నిలుపుదల చేస్తారు. అనగా వాటికి తాత్కాలికంగా గ్రహణం పడుతుంది. తదుపరి చట్టం ద్వారా ఆ గ్రహణాన్ని వివాధాస్పద అంశాన్ని తొలగిస్తే చట్టాలు అమలులోకి వస్తాయి. అయితే రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత చేసిన చట్టాలు రాజ్యాంగ విరుద్ధమయితే వాటీని మొత్తానికి రద్దు చేస్తారు. ఈ విధమైన ప్రక్రియనే డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటారు.1955లో బికాజీ నారాయణ్ Vs స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ఈ వివాదంలో సుప్రీంకోర్టు పై సూత్రాన్ని పరిగణలోకి తీసుకుంది.1959లో దీప్‌చంద్ Vs స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ఈ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ, డ్రాక్టిన్ ఆఫ్ ఎక్లిప్స్ అనేది రాజ్యాంగం అమలులోకి రాక ముందు ఉన్నచట్టాలకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది.1974లో అంబికా మిల్స్ Vs స్టేట్ ఆఫ్ గుజరాత్ఈ కేసులో సుప్రీంకోర్టు భిన్నమైన తీర్పును ప్రకటించింది.ఈ సూత్రం రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత చేసిన చట్టాలకు కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్ట్ వ్యాఖ్యానించింది.
Fundamental Rights of Indian Constitution (Articles 12-35)-6
22:19:00
0