ప్రకరణ 16: ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో ఏడు రకాలైన వివక్షతలు రద్దు
- ప్రకరణ 16(1) ప్రభుత్వోద్యోగాలలో పౌరులందరికి సమాన అవకాశాలు.
- ప్రకరణ 16(2) - ప్రభుత్వోద్యోగాలలో పౌరులను జాతి, మత, కుల, లింగ, పుట్టుక, వారసత్వ మరియు స్థిర నివాస అనే ఏడు ప్రాతిపదికలపై వివక్షత చూపరాదు.
మినహాయింపులు
- ప్రకరణ 16(3) - ప్రభుత్వోద్యోగాలలో షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తెగలకు, ఇతర వెనుకబడిన తరగతులకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో ప్రత్యేక మినహాయింపులు, సదుపాయాలు కల్పించవచ్చు.
- ప్రకరణ 16(4a) - ప్రభుత్వోద్యోగాలలో మరియు ప్రమోషన్లలో షెడ్యూల్డ్ క్షులాలు, తెగలకు ప్రత్యేక రిజర్వేషన్స్ కల్పించవచ్చు. ప్రమోషన్లలో రిజర్వేషన్స్ కల్పించడమనేది 1995లో 77వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచారు.
- ప్రకరణ 16(4b) - ఈ క్లాజును 81వ రాజ్యాంగ సవరణ ద్వారా 2000లో చేర్చారు. ఎస్.సి. ఎస్.టిలకు ఒక సంవత్సరంలో కేటాయించిన రిజర్వ్ కోటా భర్తీ కాకపోతే ఆ ఖాళీని తరువాతి సంవత్సరంలో సంబంధిత రిజర్వేషన్ కోటాలో కలుపుతారు. అప్పుడు రిజర్వేషన్ల శాతం 50కి మించిందా లేదా అన్న విషయాన్ని నిర్జారించదానికి ఆ సంవత్సరంలోని రిజర్వేషన్ కోటాలో కలిసిన గత సంవత్సరం కోటాను పరిగణలోకి తీసుకోకుండా, మిగిలిన ఖాళీలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. దీని ప్రకారం ఎస్.సి., ఎస్.టిలకు రిజర్వేషన్ల విషయంలో క్యారి ఫార్వర్డ్ (Carry Forward) అవకాశాన్ని కల్పించడం జరిగింది.
- ప్రకరణ 16(5) - ప్రభుత్వంలో ఏదైన ఒక శాఖలో పూర్తిగా ఒక మత విశ్వాసానికి సంబంధించిన విషయం ఉన్నప్పుడు ఆ శాఖలో కేవలం ఆ మతవిశ్వాసాలకు చెందినవారిని మాత్రమే నియమించేందుకు తగిన చట్టాలు ప్రభుత్వాలు రూపొందించుకోవచ్చు.
- ఉదా : దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేయడానికి హిందువులు మాత్రమే అర్హులు. అలాగే వక్ఫ్ బోర్డు ఇతర మత సంస్థలలో నియామకాలకు సంబంధిత మత విశ్వాసం ఉన్నవారే అర్హులు.
- అదేవిధంగా, 2001లో 85వ రాజ్యాంగ సవరణ ప్రకారం, పదోన్నతులల్లో రిజర్వేషన్స్ పొందిన ఎస్.సి, ఎస్.టి. ప్రభుత్వ ఉద్యోగులకు తద్వారా లభించే సీనియారిటి అర్హత కూడా లభిస్తుంది. ఈ సవరణ 1995 నుండి వర్తిస్తున్నది.
ప్రత్యేక వివరణ
- 81, 85వ రాజ్యాంగ సవరణల ద్వారా గతంలో సుప్రీంకోర్టు బాలాజి Vs మైసూరు (1963), ఇంద్ర సహానీ Vs భారత ప్రభుత్వం (1992) కేసులలో రిజర్వేషన్స్ 50 శాతానికి మించరాదు అని చెప్పిన తీర్పులకు మినహాయింపు లభించింది.
మండల్ కమీషన్ నివేదిక - ఓబిసి లకు రిజర్వేషన్లు - క్రీమీ లేయర్ భావన
వెనుకబడిన తరగతులను వర్గీకరించి తగిన రాయితీలు కల్పించడానికి 1979లో ఆ నాటి జనతా ప్రభుత్వం B.P మండల్ అధ్యక్షతన కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ సామాజికపరంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు కేంద్ర సర్వీసుల్లో 27% రిజర్వేషన్లను కల్పించాలని 1980లో తన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్చించింది. 1989లో అదికారంలోకి వచ్చిన వి.పి. సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ నివేదికను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిని ప్రశ్నినిస్తూ సుప్రీంకోర్టులో' పిటీషన్లు దాఖలయ్యాయి. తరువాత పి. వి నరసింహారావు ప్రభుత్వం మండల్ కమిషన్ నివేదికకు రెండు సవరణలు చేసింది.
- ఎ) వెనుకబడిన తరగతులను కేటాయించిన రిజర్వేషన్లను ఆర్థిక ప్రాతిపదికన అమలు చేయడం,
- బి) అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడినవారికి 10% రిజర్వేషన్లు కల్పించడం.
పై అన్ని అంశాలు ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టులో చర్చకు వచ్చాయి.ఇందిరా సహాని Vs యూనియన్ ఆఫ్ ఇండియా (1993) (దీనినే మండల్ కేస్ అంటారు)
- వెనుకబడిన తరగతులకు 27% రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగబద్ధమే.
- వెనుకబడిన తరగతులలో త్రీ లేయర్ (మెరుగైన వర్గాలు) వారిని గుర్తించి వారిని రిజర్వేషన్లకు అనర్హులుగా పరిగణించాలి. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో తప్ప, అన్ని రకాల రిజర్వేషన్లు కలిపి 50% మించరాదు.
- ఆర్థికపరమైన రిజర్వేషన్లు చెల్లవు. ఎందుకంటే, రాజ్యాంగంలో ఆ ప్రాతిపదికపైన మినహాయింపులు లేవని సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పు చెప్పింది.
గమనిక: క్రీమీలేయర్ వర్గాలను గుర్తించెందుకు 1993లో రామ్‌నందన్ ప్రసాద్ కమిటీని నియమించారు.ప్రకరణ - 17: ఈ ప్రకరణ అనుసరించి అస్పృశ్యత (Untouchability) అనే సాంఘిక దురాచారము నిషేధించబడింది.అస్పృశ్యతను ఏ రూపంలో పాటించినా లేదా సమర్థించినా, పార్లమెంటు చేసిన చట్టం ప్రకారం శిక్షింపబడతారు. ఈ ప్రకరణ తనంతట తాను అమలులోకి రాదు. దీని అమలుకు సంబంధిత చట్టాలను రూపొందించాలి. అయితే అస్పృశ్యత అనే పదం రాజ్యాంగంలోగాని, చట్టంలోగాని నిర్వచింపబడలేదు. కులతత్వ నేపథ్యంలో అస్పృశ్యతను గమనించాలని కర్ణాటక హైకోర్టు అభిప్రాయపడింది.ఈ ప్రకరణ స్వయంగా అమలులోకి రాదు కనుక దీని అమలుకు సంబంధించి పార్లమెంటు ఈ క్రింది చట్టాలను రూపొందించింది.
Fundamental Rights of Indian Constitution (Articles 12-35)-9
22:01:00
0