చట్టం ముందు అందరూ సమానులు - సుప్రీంకోర్టు ముఖ్య తీర్పులు
చిరంజిత్ లాల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా (1950)చట్టం ముందు అందరు సమానులు అనగా సమానుల్లో మాత్రమే సమానత్వం అమలుపరచడం జరుగుతుందని సుప్రీం కోర్టు పేర్కొంది. హేతుబద్ధమైన వర్గీకరణ చెల్లుబాటు అవుతుంది.బెన్నెట్ కోల్‌మెన్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా (1979)పత్రికలను చిన్న పత్రికలు, పెద్ద పత్రికలు అనే ప్రాతిపదికపైన వర్గీకరించి ఆ విధంగా న్యూస్ ప్రింట్ పంపిణీ చేయడం చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. అన్ని పత్రికలకు సమానంగా పంపిణీ చేయడం న్యాయ సమ్మతంకాదని చెప్పింది.విశాఖ Vs స్టేట్ ఆఫ్ రాజస్థాన్ (1997)పనిచేసే ప్రదేశాలలో మహిళా ఉద్యోగుల పట్ల అనుచిత ప్రవర్తన, లైంగిక వేధింపులు అనేవి ప్రకరణ 14లోని చట్టం ముందు అందరూ సమానులే అనే సూత్రానికి వ్యతిరేకం మరియు స్త్రీ పట్ల వివక్షత అనీ, పురుషులతో సమానంగా వారు తమ హక్కులను కలిగివుండే అధికారం ఉందని పేర్కొంది. మహిళల పట్ల పని ప్రదేశాలలో లైంగిక వేధింపులు నివారించడానికి సమగ్ర మార్గదర్శక సూత్రాలను సుప్రీంకోర్టు జారీ చేసింది.ప్రకరణ 15: మత, జాతి, కుల, లింగ, పుట్టుక అనే ఐదు రకాలైన వివక్షతలను పాటించరాదు.
- ప్రకరణ 15(1) ప్రకారం రాజ్యం పౌరులను జాతి, మత, కుల, లింగ అలాగే పుట్టుక ప్రాతిపదికన వివక్ష చూపరాదు.
- ప్రకరణ 15(2) ప్రకారం ప్రజా ప్రయోగకరమైన ప్రదేశాలలోకి అందరికి సమాన ప్రవేశం ఉండాలి. ఈ సౌకర్యాల విషయంలో వివక్షత చూపరాదు.
- బావులు, చెరువులు, రోడ్డు, హోటళ్ళు, వినోద ప్రదేశాల్లోకి మరియు ఇతర ప్రజా సంబంధ ప్రదేశాల్లోకి అందరికీ సమాన అవకాశాలు ఉండాలి.
మినహాయింపులు
- ప్రకరణ 15(3) ప్రకారం మహిళలకు, బాలలకు ప్రత్యేక మినహాయింపులు, సౌకర్యాలు కల్పించవచ్చు.
- ప్రకరణ 15(4) సామాజికపరంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక సౌకర్యాలు, మినహాయింపులు ఇవ్వవచ్చు. ,
- ప్రకరణ 15(4) క్లాజ్‌ను 1951లో 1వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.
- ప్రకరణ 15(5) ప్రైవేటు అలాగే ప్రభుత్వ ధన సహాయం పొందిన విద్యాసంస్థల అన్నింటిలోను సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు (Sociality, Educational Backward Classes of Citizens) లేదా షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల అభివృద్ధికి ప్రత్యేక మినహాయింపులు, సదుపాయలు ఇవ్వవచ్చు. అయితే ఇది ప్రకరణ 30లో పేర్కొన్న మైనారిటీ సంస్థలకు వర్తించదు.
- ప్రకరణ 15(5) క్లాజ్‌ను 2005లో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.
సుప్రీంకోర్టు తీర్పులు - ముఖ్యాంశాలుప్రకరణ 15లోని అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని తీర్పులను వెలువరించింది.చంపకం దొరైరాజన్ Vs స్టేట్ ఆఫ్ మద్రాస్ (1951)
- మత ప్రాతిపదికపై విద్యా సంస్థలలో రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. మద్రాస్ ప్రభుత్వం వైద్య, ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశానికి మత మరియు కుల ప్రాతిపదికపైన సీట్లు కేటాయించింది. దీనిని ప్రశ్శిస్తూ చంపకం దొరైరాజన్ అనే విద్యార్థిని సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
ఎం.ఆర్. బాలాజీ Vs స్టేట్ ఆఫ్ మైసూర్ (1963)
- ప్రకరణ 15(4) ప్రకారం, వెనుకబాటుతనం అనేది కేవలం కులాన్ని బట్టి కాకుండా సామాజిక, విద్యాపరమైన ప్రాతిపదికపైన కూడా ఉండాలని పేర్కొంది. అలాగే ఒక తరగతి వెనుకబడిందా లేదా అనే అంశాన్ని నిర్ణయించడంలో కులంతో పాటు పేదరికం, నివాసం, ఇతర అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పింది.
ఇనాందార్ Vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర (2005)
- ప్రభుత్వం ధన సహాయం పొందని మైనారిటీ మరియు మైనారిటీయేతర విద్యా కళాశాలలలో రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు తీర్చు చెప్పింది. ఈ తీర్చు అధిగమించడానికి 2005లో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా 15(5) ను చేర్చారు. ఈ రాజ్యాంగ సవరణను అశోక్ కుమార్ ఠాకూర్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (2008)లో సుప్రీంకోర్టులో సమర్థించింది.
Fundamental Rights of Indian Constitution (Articles 12-35)-8
19:57:00
0