Fundamental Rights of Indian Constitution (Articles 12-35)-10

TSStudies
0
Article 18 and its Sub Clauses Meaning in Telugu

 అస్పృశ్యత నిషేధచట్టం - 1955

అస్పృశ్యతా దురాచారాన్ని నిషేధిస్తూ, దానిని నేరంగా పరిగణిస్తూ, పార్లమెంటు 1955లో ఈ చట్టాన్ని రూపొందించింది.  అయితే ఈ చట్టంలోని లొసుగులను తొలగించడానికి 1976లో ఈ చట్టాన్ని సమగ్రంగా సవరించి “పౌరహక్కుల పరిరక్షణ చట్టంగా” (Protection of Civil Rights Act) పేరుమార్చారు. ఈ చట్టం ప్రకారం నేరం రుజువయితే 2సం॥ వరకు జైలు శిక్ష అలాగే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటిస్తారు.

షెడ్యూల్డ్‌ కులాల, షెడ్యూల్డ్‌ తెగలపై అకృత్యాల నిషేధక చట్టం (1989)
ఈ చట్టం ప్రకారం షెడ్యూల్డ్‌ కులాల, తెగలపై అకృత్యాలను సమగ్రంగా నిరోధిస్తూ కఠినమైన నియమ నిబంధనలను రూపొందించారు. 

ప్రకరణ - 18 (1): సైనిక మరియు విద్యాపరమైన గుర్తింపు మినహా మిగతా బిరుదులు రద్దు
18(2): భారత పౌరులు విదేశీ బిరుదులను స్వీకరించరాదు.
18(3): భారత పౌరులు కానప్పటికీ భారత ప్రభుత్వంలో లాభదాయక పదవులలో ఉన్నప్పుడు రాష్ట్రపతి అనుమతి లేకుండా విదేశాలనుండి ఎలాంటి బిరుదులు స్వీకరించరాదు
18(4): ప్రభుత్వంలో లాభదాయ పదవుల్లో ఉన్న వ్యక్తులు రాష్ట్రపతి అనుమతి లేనిదే విదేశాల నుండి ఎలాంటి బహుమతులను, భత్యాన్ని ఉద్యోగాన్ని స్వీకరించరాదు.

ఈ ప్రకరణలో కొన్ని రకాలైన బిరుదులను రద్దు చేశారు. ఉదాహరణకు, బ్రిటీషు పాలనాకాలంలో సమాజంలోని వ్యక్తుల సామాజిక, ఆర్థిక ప్రాతిపదికలపై కల్పించబడిన ప్రత్యేక హోదాలైన రావ్‌ బహద్దూర్‌, రావ్‌ సాహబ్‌, రాజా విక్రమార్క, జాగిర్జార్‌, ఇనాందార్‌, జమిందార్‌ మొదలగు వాటిని రద్దు చేశారు.

అయితే ఈ నిషేధం విద్యాపరమైన, సైనికపరమైన, విశిష్ట యోగ్యతాపరమైన బిరుదులకు వర్తించదు. ఉదాహరణకు భారతరత్న పద్మవిభూషణ్‌, పద్మభూషణ్‌ మరియు పద్మశ్రీ. అదే విధంగా సైనిక హోదాలైన పరమ వీరచక్ర, అశోక చక్ర, శౌర్య చక్ర, మొదలగు వాటిని ఇవ్వవచ్చు.

ప్రత్యేక వివరణ
పౌర బిరుదులైన భారతరత్న పద్మవిభూషణ్‌, పద్మభూషణ్‌, పద్మశ్రీ వంటివి ప్రత్యేక పురస్కారాలేకాని బిరుదులు కావు. వీటిని పేరుకు ముందుకాని, పేరుకు తరువాతకాని వాడటం, వ్యాపార కార్యక్రమాలకు వినియోగించడం చేయరాదని బాలాజి రాఘవన్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో (1996) సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

సినీ నటులు మోహన్‌ బాబు, బ్రహ్మానందం తమ పద్మశ్రీ గుర్తింపును వ్యాపారపరంగా ఉపయోగించారనే అభియోగంతో వాటిని రద్దు చేయాలి అని కోర్టు సూచించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)