ప్రకరణలు 19-22 - వ్యక్తి గత స్వేచ్చలు, హక్కులు
ప్రకరణ 19 నుండి 22 వరకు ఉన్న హక్కులను వివిధ స్వేచ్చల రూపంలో పొందుపరచారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత స్వేచ్చలు చాలా విలువైనవి. కానీ ఈ స్వేచ్చలపైన కూడా హేతుబద్ధమైన పరిమితులు విధించవచ్చు.అధికరణం 19లో ఆరు వ్యక్తిగత స్వేచ్చలు ఉన్నాయి.1. ప్రకరణ 19 (1)
- వాక్ స్వాతంత్య్రము, భావవ్యక్తీకరణ, అభిప్రాయ ప్రకటన
- శాంతియుతంగా, నిరాయుధంగా సమావేశములు నిర్వహించుకొనుట
- సంస్థలను, సంఘాలను ఏర్పాటు చేసుకోవడం, సహకార సంఘాలను ఏర్పరచుకుని నిర్వహించుకోవడం
- దేశవ్యాప్త సంచార స్వేచ్చ
- దేశవ్యాప్త స్థిర నివాస స్వేచ్చ
- ఆస్తిని సముపార్దించుకునే స్వేచ్చ (ఈ క్లాజును 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు)
- వృత్తి, వ్యాపార, వాణిజ్య స్వేచ్ఛలు
ప్రత్యేక వివరణపైన పేర్కొన్న ఆరు స్వేచ్చలు ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఉంటాయి మరియు పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. విదేశీయులకు, కంపెనీలకు, కార్బోరేషన్లకు వర్తించవు.ప్రకరణ 19 (1)(a) లో పేర్కొన్న వాక్ స్వాతంత్య్రము భావ ప్రకటనా స్వేచ్చకు సంబంధించి చాలా విసృతంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలు చెప్పింది. పౌరుడు తన భావాలతో పాటు ఇతరుల భావాలను కూడా వ్యక్తీకరించవచ్చని, ఇది పత్రికా స్వేచ్చ ద్వారా సాధ్యమౌతుంది కనుక “పత్రికా స్వేచ్ఛ” (Freedom of Press) అనేది భావ ప్రకటన స్వేచ్చలో అంతర్గతంగా ఉంటుందని పేర్కొంది. అలాగే, ఈ క్రింది స్వేచ్చలు కూడా భావ వ్యక్తీకరణ స్వేచ్చలో అంతర్గతంగా ఉంటాయని వ్యాఖ్యానించింది.
- పత్రికా స్వేచ్చ
- వాణిజ్య ప్రకటన స్వేచ్చ
- రహస్యాలను కాపాడుకునే స్వేచ్చ
- ప్రసారాల స్వేచ్చ
- బంద్‌ను వ్యతిరేకమయిన స్వేచ్చ
- సమాచార స్వేచ్చ
- మౌనాన్ని పాటించే స్వేచ్చ
- నిరసనను వ్యక్తం చేసే స్వేచ్చ
మినహాయింపులుపైన పేర్కొనబడిన స్వేచ్చలపై హేతుబద్ధమైన పరిమితులను నిర్మించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఈ క్రింది కారణాలపై పరిమితులు విధించవచ్చు.
- భారత సార్వభౌమాధికారం, సమగ్రత
- దేశ రక్షణ, విదేశాలతో స్నేహ సంబంధాలు
- ప్రజాశాంతి, సఖ్యత, మర్యాద, నీతి, కోర్టు ధిక్కారం,
- పరువు నష్టం, నేర ప్రేరేపణ, మొదలగు ప్రాతిపదికలపై హేతుబద్ధమైన పరిమితులు విధించవచ్చు.
అయితే పైన పేర్కొనబడిన పరిమితులు పార్లమెంటు, శాసనసభ చర్చలకు వర్తించవు. సభాధ్యక్షుల యొక్క రూలింగ్ మేరకు సభ్యులు తమ భావాలను వ్యక్తీకరించవచ్చు.
Fundamental Rights of Indian Constitution (Articles 12-35)-11
08:15:00
0