భావ వ్యక్తీకరణ స్వేచ్చ- సుప్రీంకోర్టు తీర్పులు
భావ వ్యక్తీకరణ స్వేచ్చకు సంబంధించి సుప్రీం కోర్టు అభ్యుదయమైన, విసృతమైన తీర్పులు వెలువరించింది.శ్రేయా సింఘాల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా (2015)ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజి చట్టం 2000లోని సెక్షన్ 66A భావ వ్యక్తీకరణ స్వేచ్చకు విరుద్ధమని అది చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.శ్రీమతి కుష్బూ Vs తమిళనాడు (2012)పౌరుడు తమ భావాలను స్వేచ్చగా వ్యక్తీకరించవచ్చని, ఒకరు వ్యక్తీకరించిన భావం నచ్చకపోతే న్యాయస్థానంలో దావా వేయవచ్చని, కానీ పూర్తిగా తమ భావాలను వ్యక్తీకరించకుండా నిషేధించడానికి వీలులేదని వ్యాఖ్యానించింది.స్తీ, పురుషులు మేజర్లుగా ఉంటే, వివాహం చేసుకోకుండా సహజీవనం చేయడం నేరంగా పరిగణించరాదని పేర్కొంది. వారి ఇష్టానుసారంతో సహ జీవనం చేయవచ్చని చెప్పింది.భరత్ కుమార్ Vs సి.పి.ఎం. (1998)బందులు, సార్వత్రిక సమ్మెలు, ప్రాధమిక హక్కులు కావని, అవి ప్రజా జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని, బలవంతంగా ప్రజా జీవితాన్ని ప్రభావితం చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇలాంటి తీర్పునే టి. రంగరాజన్ Vs తమిళనాడు కేసులో (2003)లో సమ్మెచేసే హక్కు ప్రాథమిక హక్కు కాదని తీర్పు చెప్పింది.బిజో ఇమాన్యూవల్ Vs స్టేట్ ఆఫ్ కేరళ (1986)దీనిని జాతీయ గీతం కేసుగా పేర్కొంటారు. జాతీయ గీతం పాడడం వారి మత విశ్వాసానికి విరుద్ధం అవుతుందని వారు నిరూపించగలిగితే దానిని ఆలపించమని ఏ వ్యక్తిని ఒత్తిడి చేయరాదని పేర్కొంది. భావ వ్యక్తీకరణ స్వేచ్చలో ఒక వ్యక్తి మౌనంగా కూడా ఉండే స్వేచ్చ కూడా ఉంటుందని వ్యాఖ్యానించింది.మేనకా గాంధీ Vs యూనియన్ అఫ్ ఇండియా (1978)పౌరులకు సంచార స్వేచ్చతో పాటు భావ వ్యక్తీకరణ స్వేచ్చ దేశంలోను, విదేశ పర్యటనలో ఉన్నప్పుడు కూడా ఉంటుందని ఆ స్వేచ్చకు భౌగోళిక పరిమితి ఉండవని పేర్కొంది.నవీన్ జిందాల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా (1995)జాతీయ జెండాను ప్రతి పౌరుడు ఎగరవేయడం భావ వ్యక్తీకరణ స్వేచ్చలో అంతర్భాగమని ప్రకటించింది.ప్రత్యేక విశ్లేషణ:పత్రికలు లేదా మీడియాపై ముందస్తు సెన్సార్‌షిప్ లేదా నియంత్రణ సాధ్యం కాదని అయితే సినిమాలపై ముందస్తు సెన్సార్‌షిప్ ఉండాలని, అది స్వేచ్చకు వ్యతిరేకం కాదని, బ్రిజ్ భూషణ్ Vs యూనియన్ టెరిటరి ఆఫ్ ఢిల్లీ వివాదంలో సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. సెన్సార్‌షిప్ విషయంలో పత్రికలను/మీడియాను, సినిమాలను ఒకే విధంగా చూడడం సమంజం కాదని పేర్కొంది.ప్రత్యేక వివరణసమాచార స్వేచ్చ అనగా ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి సమాచారాన్ని తెలుసుకునే హక్కు. ప్రకరణ 19(1)(a)లో అంతర్భాగం అని బెన్నెట్ కోల్‌మన్ కంపెని కేసులో 1973లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అందుచేత 2005 జూన్‌లో పార్లమెంటు సమాచార హక్కు చట్టాన్ని రూపొందించింది.19(1)(b) : సమావేశ స్వేచ్చపౌరులు శాంతి భద్రతలకు భంగం కలిగించని రీతిలో ఆయుధాలు లేకుండా, శాంతియుతంగా సమావేశం కావడానికి స్వేచ్చ ఉంది. అయితే సిక్కు మతస్తులు తమ మత చిహ్నమైన చిన్న కత్తిని (కృపాణాన్ని) ధరించి శాంతియుతంగా సమావేశం కావచ్చు.స్వేచ్ఛపైన కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. దేశ సార్వభౌత్వానికి, సమగ్రతకు, శాంతి భద్రతలకు భంగం కలిగించేలా సమావేశాలు ఉంటే వాటిని నిషేధించవచ్చు. ఉదా: క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 144 ప్రకారం నిషేధాజ్ఞను, కర్ఫ్యూ నిబంధనలను అమలు చేయవచ్చు.19(1)(c) : సంఘాలను, సంస్థలను ఏర్పాటు చేసుకునే స్వేచ్చపౌరుడు స్వచ్చందంగా తమకు నచ్చిన సంఘాలు, సంస్థలు స్థాపించుకుని కార్యకలాపాలు కొనసాగించవచ్చు. అయితే కొన్ని నైతిక విరుద్ధమైన, సమాజ హితానికి వ్యతిరేకమైన సంస్థలను దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు, శాంతిభద్రతలకు భంగం కలిగించే సంస్థలను, సంఘాలను అనుమతించరు.గమనిక: 2012లో 97వ రాజ్యాంగ సవరణ ద్వారా “సహకార సంఘాలను ఏర్పరుచుకుని నిర్వహించుకునే" స్వేచ్చను కూడా అర్జికల్ 19(1)(c)లో చేర్చారు.19(1)(d): సంచార స్వేచ్చపౌరుడు దేశమంతటా తమ ఇష్ట ప్రకారం సంచరించడానికి స్వేచ్చ ఉంటుంది. తద్వారా వారికి విశాల భావజాలం పెంపొందడమేకాక వైవిధ్యాన్ని అర్ధం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ సంచార స్వేచ్చపై కొన్ని ఆంక్షలు విధించవచ్చు. సామాన్య ప్రజల సంక్షేమం, షెడ్యూల్డు తెగల ప్రయోజనాలు, శాంతి భద్రతల దృష్ట్యా జన సంచారాన్ని నిషేధించవచ్చు. అలాగే, సంచార సమయంలో పౌరులు కొన్ని నియమ నిబంధనలు పాటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. ఉదా: వాహనదారులు హెల్మెట్లు ధరించడం, సీటు బెల్టు పెట్టుకోవడం, అంటువ్యాధులు రాకుండా వ్యాక్సిన్లు వేసుకోవడం, మొ॥ సహేతుకమైన నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవచ్చు.19(1)(e): నివాసం ఏర్పర్చుకుని స్థిరపడటానికి స్వేచ్చపౌరులు భారతదేశంలో ఏ ప్రాంతలోనైనా నివాసం ఏర్పర్పుకుని స్థిర పడటానికి స్వేచ్చ ఉంది. అయితే ఈ హక్కుపై ప్రజా సంక్షేమం, షెడ్యూల్లు ప్రాంతాల ప్రయోజనాల దృష్టా హేతుబద్ధమైన పరిమితులు విధించవచ్చు.
గమనిక: ప్రకారణ 19(1)(f) ను తొలిగించారు19(1)(g): వృత్తి వ్యాపారం చేసుకునే స్వేచ్చభారత పౌరులు తమకు ఇష్టమైన వృత్తిని, వ్యాపార వాణిజ్యాలను చేసుకోవడానికి స్వేచ్చ ఉంది. అయితే ప్రజాసంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం హేతుబద్ధమైన ఆంక్షలు విధించవచ్చు. ఉదా: కొన్ని కులవృత్తులైన జోగిని, దేవదాసి, వేశ్యా వృత్తి పూర్తిగా నిషేధించడమైనది. అలాగే కొన్ని వృత్తులు చేపట్టాలంటే ప్రభుత్వ అనుమతులతో పాటు కొన్ని అర్హతలు, షరతులు పాటించాలి. ఉదా : వైద్య వృత్తి, న్యాయవాద వృత్తి, బెషధాలను విక్రయించే వారికి ప్రత్యేక అర్హతలతో పాటు ప్రభుత్వ అనుమతి కూడా ఉండాలి.
Fundamental Rights of Indian Constitution (Articles 12-35)-12
08:28:00
0