Fundamental Rights of Indian Constitution (Articles 12-35)-13

TSStudies
0
Article 20: Protection Against Conviction of Offences in Telugu

 ప్రకరణ- 20: నేరము, శిక్ష నుంచి రక్షణ పొందే హక్కు

ఈ నిబంధన ప్రకారం వ్యక్తులకు నేరము, శిక్ష నుండి రక్షణ పొందేందుకు కొన్ని అంశాలు పొందుపరిచారు. 
Article 20(1) - ఏ వ్యక్తిని తప్పు చేయనిదే శిక్షించరాదు. ఒక వ్యక్తి చేసిన పని అది చేసిన సమయానికి చట్టరీత్యా నేరం అయితేనే శిక్షించాలి మరియు ఆ నేరానికి చట్టపరంగా ఎంత శిక్ష విధించదగినదో అంతకంటే ఎక్కువ శిక్షను విధించరాదు, అయితే తక్కువ శిక్షను విధించవచ్చు. దీనిని “Doctrine of Beneficial Construction ” అంటారు.
Article 20(2) - ఏ వ్యక్తినీ ఒకే నేరానికి ఒకసారి కంటే ఎక్కువ సార్లు విచారించి శిక్షించరాదు.
Article 20(3) - ఏ వ్యక్తినీ తనకు తాను వ్యతిరేకముగా సాక్ష్యం చెప్పమని నిర్భంధం చేయరాదు.

వివరణ
ఒక వ్యక్తి వర్తమానంలో చేసిన పనిని భవిష్యత్‌ కాలంలో నేరంగా పరిగణించి శిక్షించరాదు. క్రిమినల్‌ చట్టాలు చేసిన రోజు నుండి లేదా తరువాత కానీ అమలులోకి వస్తాయి. వెనుకటి తేదీతో అమలు చేయడానికి వీలు లేదు. అనగా క్రిమినల్‌ చట్టాలు ముందుకాలానికి వర్తిస్తాయి కానీ గత కాలానికి వర్తించవు.
దీనినే న్యాయ పరిభాషలో ఎక్స్‌పోన్స్‌ఫ్యాక్టో చట్టాలు (Ex. Post Facto Legislations) అంటారు.
ఎక్స్‌. పోస్ట్‌ ఫ్యాక్టో అనగా Now and After, Not Before అని అర్థం. అయితే సివిల్‌ చట్టాలను గతకాలానికి కూడా వర్తింపచేయవచ్చు (Criminal Laws Applicable Prospectively Not Rectrospectively, However Civil laws may be applicable rectrospectively or prospectively).
ఉదా : ప్రభుత్వం ఇంటి పన్నును పెంచుతూ 2015 జనవరి 26వ తేదీన ఒక ఆదేశం జారీ చేస్తే దానిని గత సంవత్సరంలో జూలై నుండి వర్తిస్తుంది అని పేర్కొనడం సమంజసమే. పౌరులు ఆ రోజు నుండి పెరిగిన పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.

డబుల్‌ జపార్డీ(Double Jeopardy)
ద్వంద్వ శిక్షలను న్యాయ పరిభాషలో డబుల్‌ జపార్డీ అంటారు. అనగా, ఒక వ్యక్తి చేసిన తప్పుకు ఒక పర్యాయం శిక్ష పడి ఉంటే అదే నేరానికి మరోసారి శిక్ష వేయరాదు.
ఈ భావాన్ని లాటిన్‌ భాషలో Nemo Debet Bis Vexari Pro Una Et Eadem Causa అంటారు. అనగా No one shall be tried or punished twice in regards to the same event or crime అనే లాటిన్‌ సూత్రంనుంచి తీసుకున్నారు. ఈ రక్షణ న్యాయపరమైన ప్రక్రియలకే వర్తిస్తుంది. శాఖాపరమైన మరియు పరిపాలనాపరమైన చర్యలకు వర్తించదు. 
ఉదా. ఒక ప్రభుత్వోద్యోగి అవినీతికి. పాల్పడినట్లు నిరూపితమైతే ఉద్యోగం నుండి తొలగించడమే కాకుండా జైలు శిక్షతోపాటు అన్యాక్రాంతమైన ప్రభుత్వ ధనాన్ని రికవరి చేసుకుంటారు. ఇక్కడ తప్పు ఒక్కటే కానీ శిక్షలు రెండు, మూడు ఉండవచ్చు

స్వయం సాక్ష్యం చెల్లదు (No Self Incrimination)
ఏ వ్యక్తినీ తనకు తాను వ్యతిరేకముగా సాక్ష్యం చెప్పమని బలవంతం చేయరాదు. దీన్ని న్యాయభాషలో “సెల్ఫ్‌ ఇంక్రిమినేషన్‌” అంటారు. అయితే ముద్దాయి చేతిగుర్తులు, చేతివ్రాత, రక్త నమూనాలు, తనకు వ్యతిరేకముగా సాక్ష్యాలుగా తీసుకుంటారు.
1978లో నందిని శతపతి Vs పి.ఎల్‌. డానీ కేసులో సుప్రీంకోర్టు బలవంతపు సాక్ష్యం అనే అంశాన్ని విశదీకరించింది. దీని ప్రకారం శారీరకంగా పదేపదే బెదిరించి, హింసించి, మానసిక క్షోభకు గురిచేసి నేరము ఒప్పుకునేటట్లు చేసి సమాచారాన్ని రాబడితే అది బలవంతపు సాక్ష్యం క్రిందకు వస్తుందని పేర్కొంది. అలాంటి చర్యలు ప్రకరణ 20(3)కు వ్యతిరేకమని పేర్కొంది.
నేర వైద్య శాస్త్ర పరంగా (Forensic Science) నిందితుల నుంచి సమాచారం రాబట్టడం కొంత మేరకు చెల్లుబాటు అవుతుంది.

ఉదా: సత్య శోధన లేదా లై డిటెక్టర్‌ (Polygraph) నార్కో అనాలిసిస్‌ (Narco-Analysis), మైండ్ మ్యాపింగ్‌, మొ.
అయితే, కొన్ని రసాయనాలు ఉపయోగించి చేసే “నార్కో అనాలసిస్‌ అనేది” పూర్తిగా  శాస్త్రబద్ధం కాదని సుప్రీంకోర్టు కొవ్వాడ గాంధి కేసులో (2011)లో వ్యాఖ్యానించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)