Fundamental Rights of Indian Constitution (Articles 12-35)-15

TSStudies
0
Article 22 and its sub clauses Meaning in telugu

విద్యా హక్కు (ప్రకరణ 21-A) (Right to Education-RTE)

విద్యా హక్కును 2002 సం.లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21A లో చేర్చడం జరిగింది. 6 నుండి 14 సంవత్సరాల బాలలకు ఉచిత నిర్బంధ విద్యను (Universal free Compulsory Free Education) అందించాలని పేర్కొన్నారు.

ప్రత్యేక వివరణ
వాస్తవానికి 2002 కంటే ముందు నిర్దేశక నియమాలలోని ప్రకరణ 45లో ఉచిత నిర్భంధ. ప్రాథమిక విధ్యను పొందుపరిచారు. కాని 86వ రాజ్యాంగ సవరణ ద్వారా దీనీని.21-A కి బదలాయించి, ప్రాథమిక హక్కుగా గుర్తించారు. ప్రస్తుతం నిబంధన 45లో ఉచిత పూర్వ ప్రాథమిక విద్యను (6 స సం.రాల వయస్సు లోపలి వారికి) అందించాలి అనే కొత్త అంశాన్ని చేర్చారు. 2009 విద్యా హక్కు చట్టాన్ని చేశారు. విద్యా హక్కు దేశవ్యాప్తంగా April 1, 2010 నుంచి అమల్లోకి వచ్చింది. 

విద్యా హక్కు చట్టం ముఖ్యాంశాలు
  • 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు వారు నివనిస్తున్న ప్రదేశానికి ఒక కిలోమీటరు పరిధిలో పాఠశాల ఉండాలి.
  • ప్రైవేటు పాఠశాలలు తమ మొత్తం విద్యార్థుల సంఖ్యలో 25 శాతం బలహీన వర్గాలకు కేటాయించాలి.
  • ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి 1 : 30  నిష్పత్తిలో ఉండాలి.
  • ఈ చట్టం అమలు చేసేందుకు అయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 65:35 నిష్పత్తిలో భరిస్తాయి.
  • ప్రైవేటు పాఠశాలల్లో ఈ కోటా క్రింద ఒక్క సీటు కూడా ఖాళీగా ఉండరాదు.
విద్యాహక్కు - సుప్రీంకోర్టు తీర్పులు
  • 1992లో మోహిని జైన్‌ Vs కర్నాటక, అలాగే ఉన్నిక్రిష్ణన్‌ Vs ఆంధ్రప్రదేశ్‌ కేసులలో విద్యా హక్కు అనేది జీవించే హక్కులో, వ్యక్తి గౌరవాన్ని పొందే హక్కులో అంతర్భాగము అని, దీనిని ప్రాథమిక హక్కుగా పరిగణించా చాలని చెప్పింది.
  • బాలలకు ప్రమాణాలతో కూడిన విద్యను వారి యొక్క ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక నేపథ్యంతో సంబంధం లేకుండా అందించాలని తమిళనాడు ప్రభుత్వం Vs శ్యామ్‌సుందర్‌ కేసులో (2011) సుప్రీం కోర్టు తీర్చు చెప్పింది. 
ప్రాథమిక విధి
ఇదే సవరణ ద్వారా నిబంధన 51-Aలో ప్రతి తల్లిదండ్రులు మరియు సంరక్షకులు, తమ పిల్లలకు అనగా_6 నుండి 14 సం॥ వయస్సు లోపలి బాలలకు, బాలికలకు విద్యా సౌకర్యాలు కల్పించాలనే విధిని ప్రాథమికవిధిగా పేర్కొన్నారు.

ప్రకరణ-22-అక్రమ నిగ్రహణ (Arrest), నిర్బంధం (Detention) నుంచి రక్షణ 
అక్రమ అరెస్టులకు, నిర్భంధాలకు వ్యతిరేకంగా రక్షణ. ఈ ప్రకరణ ప్రకారం చట్టబద్ధంగా అరెస్ట్ చేయడానికి క కొన్ని ప్రాతిపదికలు పాటించాల్సి ఉంటుంది. అవి
ప్రకరణ 22(1)
  • a) ప్రతి అరెస్టుకు కారణం ఉండాలి లేదా కారణాన్ని తెలియచేయాలి. అలాగే న్యాయవాదిని సంప్రదించుకునే అవకాశం ఇవ్వాలి.
  • b) అరెస్టు చేసిన సమయం నుంచి, ప్రయాణ సమయాన్ని మినహాయించి కలిపి, నిందితుడిని 24 గంటల లోపల సమీప న్యాయస్థానంలో హాజరుపరచాలి.
ప్రత్యేక వివరణ
  • 24 గంటలు లెక్కించే సమయంలో ప్రయాణ సమయాన్ని మినహాయిస్తారు. అయితే సెలవు దినాలు మినహామించరు. అరెస్టు కాబడిన వ్యక్తిని సమీప మేజిస్ట్రేట్ నివాసంలో హాజరు పర్చాల్సి ఉంటుంది.
  • అయితే పై రక్షణలకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ప్రకరణ 22(3) ప్రకారం, ఈ రక్షణలు శత్రుదేశ పౌరులకు, అలాగే ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ చట్టాలు క్రింద అరెస్టు కాబడిన వారికి వర్తించవు.
  • ప్రకరణ 22(4) ప్రకారం, ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ చట్టాల క్రింద అరెస్టు కాబడినవారిని మూడు నెలలకు మించి నిర్బంధంలో ఉంచరాదు. అయితే ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ చట్టాల క్రింద ఏర్పాటైన Advisory Board సూచన మేరకు మూడు నెలల కంటే ఎక్కువ నిర్బంధంలో ఉంచవచ్చు. ఈ బోర్డులో హైకోర్టు న్యాయమూర్తులు లేదా హైకోర్టు న్యాయమూర్తిగా నియామకానికి అర్హత కలిగిన వ్యక్తులు సభ్యులుగా ఉంటారు.
  • ప్రకరణ 22(5) ప్రకారం, ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ క్రింద అరెస్ట్ అయిన వారికి అరెస్టుకు గల కారణాలు సాధ్యమైనంత త్వరగా తెలియచేయాలి. తద్వారా బాధితులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్‌ వేసుకునే అవకాశాన్ని పొందుతారు.
  • ప్రకరణ 22(6) ప్రకారం ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ప్రివెంటివ్‌ అరెస్టుకు గల కారణాలను వెల్లడించకుండా ఉండేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంటుంది.
  • ప్రకరణ 22(7) ప్రకారం పైన పేర్కొనబడిన క్లాజులతో సంబంధం లేకుండా పార్లమెంటు మూడు నెలల కంటే ఎక్కువ కాలం నిర్బంధించే విధంగా శాసనాలు రూపొందించవచ్చు.
what is article 22 in telugu,article 22 meaning in telugu,article 22(1) meaning in telugu,article 22(3) meaning in telugu,article 22(4) meaning in telugu,article 22(5) meaning in telugu,article 22(6) meaning in telugu,article 22(7) meaning in telugu,Article 22(1)(a) meaning,article 22(1)(b) meaning in telugu
ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ చట్టాలు, వివరణ
సాధారణంగా నిర్బంధాలు రెండు రకాలు.
  1. శిక్షించే (Punitive) చట్టాలు
  2. నివారక (Preventive) చట్టాలు.
శిక్షించే చట్టాలలో ముద్దాయి యొక్కనేరం నిరూపితం అయి, కోర్టు విధించిన శిక్షను అమలుపరచడానికి నిర్భంధిస్తారు. నివారక నిర్బంధంలో విచారణ లేకుండా నిందితుడిని లేదా అనుమానితుడిని నేరం చేస్తారేమో అనే అనుమానంతో ముందుగానే నిర్భంధిస్తారు. ఇది దేశ రక్షణ, శాంతి భద్రతల దృష్టా చేస్తారు.

ముఖ్యమైన ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ చట్టాలు
  • నివారక నిర్బంధ చట్టాన్ని 1950లో చేశారు. కాని దీనిని 1969లో రద్దు చేశారు.
  • అంతర్గత భద్రతా చట్టం-1971, దీనిని 1976లో సవరించారు, 1978లో రద్దు చేశారు. (Maintenance of Internal Security Act-MISA)
  • విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, దొంగ వ్యాపార నిరోధక చట్లం-1974 (Conservation of Foreign Exchange and Prevention of Smuggling Activities-COFEPOSA)
  • అత్యవసర సరకుల దొంగ మార్కెట్‌ నిరోధక నిర్వహణ చట్టం-1980 (Prevention of Black Market and Maintenance of Essential Service Act)
  • జాతీయభద్రతా చట్టం-1980. దీనిని 1984లో సవరించారు.(National Security Act-NASA)
  • ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి రెగ్యులేషన్‌ నిర్బంధాలు,స్మగ్లర్‌ మరియు ఫారెన్‌ ఎక్స్చేంజి నిరోధక  చట్టం- 1976 (Smuggler and Foreign Exchange Manipulation Act)
  • ఉగ్రవాద మరియు కల్లోల కార్యకమాల నివారక చట్టం. (Terrorist and Disruptive Activities Act-TADA). దీనిని 1995లో రద్దు చేశారు.
  • ఉగ్రవాద నిరోధకచట్టం- 2002 (Prevention of Terrorism-POTA) 2004లో రద్దు చేశారు.
  • ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇల్లిసిట్‌ ట్రాఫిక్‌ ఇన్‌.నార్కోటిక్‌- డ్రగ్స్‌ మరియు సైకో ట్రాఫిక్‌ చట్టం - 1988
  • న్యాయ విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (Unlawful Activity Prevention Act) - 1969.
  • అత్యవసర సేవల నిర్వహణ చట్టం (Essential Services Maintenance Act-ESMA) 1968.

Post a Comment

0Comments

Post a Comment (0)