Categorization of directive principles of state policy
ఆదేశిక సూత్రాలు - వర్గీకరణ
రాజ్యాంగపరంగా నిర్దేశిక నియమాల వర్గీకరణ లేదు. కానీ వాటి స్వభావాన్ని, తత్వాన్ని బట్టి ప్రొఫెసర్ ఎం.పి.శర్మ, ప్రొఫెసర్ ఎం.పి. జైన్, ప్రొఫెసర్ జి.ఎన్. జోషి వీటిని పలురకాలుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణకు రాజ్యాంగ బద్ధత లేదు.
- సామ్యవాద నియమాలు (Socialistic Principles)
- గాంధేయ నియమాలు (Gandhian Principles)
- ఉదారవాద నియమాలు (Liberal Principles)
- అంతర్జాతీయ, పాశ్చాత్య నియమాలు (International, Western Principles)
నిబంధన 12లో పేర్కొనబడిన నిర్వచనమే ఇక్కడ ఉదహరించారు.
ప్రకరణ 37
నిర్దేశిక నియమాలకు న్యాయ సంరక్షణ లభించదని స్పష్టంగా పేర్కొనబడింది.
సామ్యవాద నియమాలు (నిబంధన 38,39,41,42,43)
పై ప్రకరణలో పొందుపరచిన అంశాలు సామ్యవాద సిద్ధాంతాలను ప్రతిబింబిస్తాయి.
ప్రకరణ 38 - ప్రభుత్వాలు సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలి.
ప్రకరణ 38(1) - ప్రజా సంక్షేమం కొరకు ప్రభుత్వాలు పాటుపడాలి. రాజ్యం స్థాపించే సంస్థలు, వ్యవస్థ ప్రజలకు సాంఘిక, ఆర్థిక రాజకీయ న్యాయాన్ని సమకూర్చే సాధనాలుగా ఉండాలి.
ప్రకరణ 38(2) - వ్యక్తుల మధ్య ఆదాయ అసమానతలను తగ్గించుటకు, హోదాలోని అసమానతలను నిర్మూలించుటకు రాజ్యం ప్రత్యేక కృషి చేయాలి. అలాగే, వేరు వేరు వృత్తుల్లో, వేరు వేరు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల మధ్య ఉన్న ఆర్థిక స్థితులలోను, పని, ఉద్యోగ అవకాశాల్లోను అసమానతలు నివారించాలి.
ప్రకరణ 39 - ఇందులో పరిపాలనా విధానంలో రాజ్యం అనుసరించవలసిన ఆరు సూత్రాలను పొందుపరిచారు.
- (a) - పౌరులందరికి స్త్రీ, పురుష భేదము లేకుండా సమాన జీవనోపాధులను కల్పించాలి.
- (b) - దేశంలోని వనరులు, వాటి పంపిణీ మరియు యాజమాన్యం సమాజ అభివృద్ధికి దోహదపడేలా
- నిర్వహించాలి.
- (c) - ఆర్థిక, ఉత్పాదక వనరులు కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.
- (d) - స్త్రీ పురుషులకు సమాన పనికి, సమాన వేతనం ఇవ్వాలి.
- (e) - ఆర్థిక దుస్థితి వలన కార్మికులు, మహిళలు, బాలలు తమ వయస్సు లేదా శక్తికి మించిన పని
- భారంతో వారి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపే విధంగా పనిచేయమని బలవంత పెట్టరాదు.
- (f) - బాలలు, స్వేచ్చాయుతమైన, గౌరవప్రదమైన వాతావరణంలో వికాసం చెందడానికి అవసరమైన సదుపాయాలను కల్పించాలి. వారు నైతికంగా, భౌతికంగా దోపిడీకి గురికాకుండా చర్యలు తీసుకోవాలి.
గమనిక: 39(f) - ఈ క్లాజ్‌ను 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.
ప్రకరణ 41 - నిరుద్యోగులకు, వృద్ధులకు, వికలాంగులకు జీవన భృతిని కల్పించాలి. విద్యా హక్కును వినియోగించుకునేటట్లు చర్యలు తీసుకోవాలి. పని హక్కును గుర్తించాలి.
ప్రకరణ 42 - ప్రణాళికలను రూపొందించి, 'హేతుబద్ధమయిన పనిగంటలను, పనిచేయదానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు తోద్బడాలి. స్త్రీలకు ప్రసూతి సౌకర్యం కల్పించాలి.
ప్రకరణ 43 - కార్మికుల సంపూర్ణ, మానసిక, శారీరక వికాసానికి శ్రద్ధ వహించాలి, కుటీర పరిశ్రమలను స్థాపించి ఉపాధి లభించేటట్లు చర్యలు తీసుకోవాలి.
గాంధేయవాద నియమాలు
ఇవి మహాత్మాగాంధీ ఆలోచనలకు, ఆశయాలకు ప్రతీకగా నిలిచాయి. ఇవి 'రామరాజ్య” స్థాపనకు తోడ్పడతాయి. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, గ్రామ పంచాయతీలు, కుటీర పరిశ్రమలు, గ్రామ స్వరాజ్, బడుగు బలహీన వర్గాల వికాసం, అహింస మొ॥ అంశాలను మహాత్మాగాంధీ ఆశయాలకు, తత్వాలకు అనుగుణంగా రాజ్యాంగంలో పొందుపరిచారు. గాంధేయవాద నియమాలను నిబంధన 40, 43, 46, 47, 48 లో పేర్కోన్నారు.
40వ ప్రకరణ - గ్రామ పంచాయితీల ఏర్పాటు, స్థానిక సంస్థల ప్రగతి ద్వారా సమీకృత గ్రామీణాభివృద్ధి చేయాలని ఆదేశిస్తుంది.
43వ ప్రకరణ - గ్రామీణ ప్రాంతాలలో కుటీర పరిశ్రమలను వ్యక్తి లేదా సమిష్టి ప్రాతిపదికన నెలకొల్పడానికి ప్రయత్నించాలని ఆదేశిస్తుంది.
46వ ప్రకరణ - 'షెడ్యూల్డు కులాల, తెగల, ఇతర వెనుకబడిన తరగతుల ప్రజల యొక్క విద్యా, సామాజిక, అభివృద్ధికి శ్రద్ధ చూపాలి. వారిని సాంఘిక అన్యాయాలు, దోపిడీల నుండి రక్షించాలి.
47వ ప్రకరణ - పౌష్టికాహారంలో ప్రజారోగ్య స్థాయిని పెంచాలి. బెషధ, పారిశ్రామిక అవసరాల నిమిత్తం మినహా ఇతర అన్ని పరిస్థితుల్లో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేయాలి. మత్తు పదార్థాల హాని నుండి ప్రజలను కాపాడాలి.
48వ ప్రకరణ - వ్యవసాయం, పాడి పరిశ్రమలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించి పశువులు, గోవులు, ఇతర పెంపుడు జంతువుల వధను నిషేధించాలి.
ఉదారవాద నియమాలు
లౌకిక ప్రజాస్వామ్య దేశాల్లో ప్రభుత్వం ఎలాంటి వివక్షత లేకుండా చట్టాలను రూపొందించాలి. అందరిపట్ల సమదృష్టితో ఉండాలి. ఇందుకోసం నిర్దేశిక నియమాల్లో కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి. పౌరులందరికీ కనీస విద్యా సదుపాయం, దేశమంతటికి ఒకే పౌరసత్వం, న్యాయ శాఖకు స్వతంత్య్ర హోదాకు సంబంధించిన అంశాలు ఉదారవాదంలో పొందుపరచడం జరిగింది.
44వ ప్రకరణ ప్రకారం, దేశంలో నివశించే పొరులందరికి వర్తించే విధంగా ఉమ్మడి సివిల్ కోడ్‌ను రూపొందించాలి. దేశంలో ఒకే రకమైన క్రిమినల్ చట్టాలు ఉన్నాయి. కానీ సివిల్ వ్యవహారాలలో వారసత్వం, వివాహం, ఆస్తి, మొదలగు వాటిలో మతాల వారిగా విభిన్నమైన సాంప్రదాయాలు ఉన్నాయి. అందుచేత సామాజిక సామరస్యానికి, జాతీయ భావానికి అనుగుణంగా ఉమ్మడి పౌర నియమావళి ఉండాలని పేర్కొన్నారు.
ఐతే ఇంత వరకు ఉమ్మడి పౌర నియమవాళి అమలు పరచలేదు. అలా అమలుకు నోచుకోని ఏకైక ఆదేశిక నియమం కూడా ఇదే.
45వ ప్రకరణ ప్రకారం, 6 సం॥ లోపు బాల బాలికలందరికి సంరక్షణ, ఉచిత విద్యా సదుపాయాలు కల్పించాలి.
ప్రత్యేక వివరణ
ఈ అంశాన్ని కొత్తగా 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచారు. మౌలిక రాజ్యాంగంలో ఈ ప్రకరణలో 6 నుంచి 14 సం॥ల లోపల బాలలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విధ్య కల్పించాలని ఉందేది. ప్రస్తుతం ఈ అంశాన్ని ప్రకరణ 21(A)లోకి మార్చడం జరిగింది.
49వ ప్రకరణ ప్రకారం చారిత్రక ప్రాముఖ్యత గల ప్రవేశాలను, కట్టడాలను పరిరక్షించాలి.
పార్లమెంటు ఒక చట్టం ద్వారా చారిత్రక ప్రామ్ముఖ్యత,గల ప్రదేశాలను, పురావస్తు వస్తువులను, ఇతర స్థిర, చర, వస్తు సంపదను గుర్తించి వాటిని పరిరక్షించాల్సి ఉంటుంది.
50వ ప్రకరణ ప్రకారం, కార్య నిర్వాహకశాఖను న్యాయ శాఖనుంచి వేరుచేయుటకు చర్యలు తీసుకోవాలి.
అంతర్జాతీయ, పాశ్చాత్య నియమాలు
51వ ప్రకరణ - ప్రపంచ శాంతి భద్రతల సాధన
- ఎ) అంతర్జాతీయ శాంతి భద్రతలను ప్రోత్సహించారు.
- బి) అన్ని దేశాల మధ్య సుహృద్భావాన్ని పెంపొందించారు.
- సి) అంతర్జాతీయ న్యాయ సూత్రాలపై, ఒప్పందాలపై గౌరవం ఉంచి వాటిని ఆచరించాలి.
- డి) అంతర్జాతీయ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలి.
కొత్తగా చేర్చిన ఆదేశిక సూత్రాలు
ఈ క్రింది ఆదేశిక సూత్రాలను 1976లో 42వ ర-శ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.
39(A) ప్రకారం పేదవర్గాలవారీకి ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలి.
ప్రకరణ 39(f) ప్రకారం పిల్లలు హుందాగా పెరగడానికి అవకాశం కల్పించి, యువత దోపిడీకి గురై నైతికపతనం చెందకుండా చూడాలి.
ప్రకరణ 43A ప్రకారం, పారిశ్రామిక యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలి.
ప్రకరణ 48A ప్రకారం, పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణి సంరక్షణ చేయాలి
1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ క్రింది అంశాలను చేర్చారు.
ప్రకరణ 38(2) ప్రకారం ప్రజల మధ్య ఆర్థిక అసమానతను తగ్గించడానికి ప్రయత్నం చేయాలి.
2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా
ప్రకరణ 45లో విషయాన్ని మార్చారు. 6 సం॥ల లోపు బాలలకు రాజ్యం సంరక్షణతో పాటు విద్యను కూడా అందించాలి.
2011లో 97వ రాజ్యాంగ సవరణ ద్వారా
ప్రకరణ 43B ప్రకారం సహకార సంఘాలను ఏర్పరిచి వాటిని స్వతంత్రంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో నైపుణ్యంతో నిర్వహించాలి.
రాజ్యాంగంలో ఇతర భాగాలలో ఉన్న నిర్దేశిక నియమాలు
రాజ్యాంగంలో నాల్గవ భాగంతో పాటు ఇతర భాగాలలో కూడా కొన్ని నిర్దేశిక నియమాలున్నాయి.
16వ భాగం - ప్రకరణ 335 - ప్రభుత్వోద్యోగాలలో ఎస్.సి, ఎస్.టి లకు సముచితమైన స్థానాన్ని కల్పించాలి.
17వ భాగం ప్రకరణ 350(A) - మాతృభాషలోనే ప్రాథమిక విద్యను అందించాలి.
17వ భాగం - ప్రకరణ 351 - హిందీ భాషను జాతీయ భాషగా గుర్తించి అమలు చేయాలి.
గమనిక : వీటికి కూడా న్యాయ సంరక్షణ లేదు. అయితే వీటికి న్యాయస్థానాలు సముచిత ప్రమ ఇవ్వాల్సి ఉంటుంది.