ఆదేశిక / నిర్దేశిక సూత్రాలు(Directive Principles of State Policy)
నిర్దేశిక నియమాలు - చరిత్ర
18వ శతాబ్దంలో స్కాండినేవియన్ దేశాలలో స్వామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థ అమలులో ఉండేది. స్పెయిన్ రాజ్యాంగంలో సంక్షేమ రాజ్య విధానం (Directive Principles of Social Policy) అనే పేరుతో మొట్టమొదటిసారిగా వీటిని అమలు చేశారు. 1935 భారత ప్రభుత్వ చట్టంలో వీటిని Instruments of Instructions పేరుతో పొందుపరిచారు. 1937లో ఐర్లాండ్ ఆదేశిక సూత్రాలను స్పెయిన్ రాజ్యం నుండి గ్రహించింది. ప్రస్తుత రాజ్యాంగంలో ఉన్న ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ రాజ్యాంగం నుండే నేరుగా గ్రహించడం జరిగింది.
ప్రత్యేక వివరణ
Norway, Denmark, Sweden, France అనేవి స్కాండినేవియన్ దేశాలు. స్మాండినేవియన్ అనేది ఉత్తర యూరప్‌లో ఒక జాతి సమూహం
ఉద్దేశం
- నిర్దేశిక నియమాల ప్రధాన ఉద్దేశం సామ్యవాద తరహా సమాజ స్థాపన (Socialistic Pattern of Society) లేక శ్రేయోరాజ్యం/ సంక్షేమ రాజ్య స్థాపన.
- సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని ఏర్పరిచి, సమాన అవకాశాలను పౌరులు వినియోగించుకొనుటకు దోహదం చేస్తాయి.
నిర్దేశికలో రాజ్యాంగ స్థానం
భారత రాజ్యాంగంలో నాలుగవ భాగంలో ప్రకరణ 36 నుండి 51 వరకు ఆదేశిక లేదా నిర్దేశక నియమాలను పేర్కొన్నారు.
ఆదేశిక సూత్రాలు - లక్షణాలు
- సమగ్ర ఆర్థిక, సామాజిక, రాజకీయ, ప్రజాస్వామ్య సమాజ ఏర్పాటుకు దోహదం చేస్తాయి.
- ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు(Non-Justiciable). ఇవి స్వయంగా అమలులోకి రావు. వీటి అమలుకు న్యాయస్థానాల ద్వారా ఆదేశాలను పొందలేము.
- వీటి ముఖ్య ఉద్దేశం సంక్షేమ లేదా శ్రేయో రాజ్యస్థాపన
- ఇవి కేంద్ర, రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలకు మార్గదర్శక సూత్రాలు
- ఇవి సంవర్ధక స్వభావాన్ని కలిగి ఉంటాయి. అనగా వివిధ స్థాయిలలో ఉన్న ప్రభుత్వాలు చేపట్టవలసిన విధులను, కార్యక్రమాలను విస్పృతం చేస్తాయి. భారత దేశంలో ఆర్థిక సమానత్వాన్ని సాధించి సామ్యవాద తరహా సమాజాన్ని నిర్మించడం వీటి ముఖ్య ఉద్దేశ్యం.
ప్రయోజనాలు
- పలు విమర్శలున్నప్పటికీ, ఆదేశిక నియమాల ద్వారా ఈ క్రింది ప్రయోజనాలు చేకూరుతాయి.
- ఇవి ప్రభుత్వాలకు మార్గదర్శక సూత్రాలు. ప్రభుత్వ బాధ్యతను తెలియచేస్తాయి.
- ప్రవేశికలోని తత్వానీకి, ఆశయాలకు ఆచరణ రూపాన్ని ఇస్తాయి. ప్రవేశికను ద్విగుణీకృతం చేస్తాయి.
- ప్రభుత్వాలు మారినా కొన్ని సామాజిక, ఆర్థిక, అంతర్జాతీయ అంశాలలో స్థిరత్వాన్ని నిరంతరతను చేకూరుస్తాయి.
- ప్రాథమిక హక్కులకు పోషకాలుగా (Supplementary) ఉండి, వాటిలోని వెలితిని (Vaccuum) ను పూరిస్తాయి.
- రాజ్యాంగాన్ని ఉదారంగా వ్యాఖ్యానించడానికి న్యాయస్థానాలు ఉపకరిస్తాయి. శాసనశాఖకు, కార్యనిర్వాహక శాఖకు స్నేహితుడిగా మరియు మార్గదర్శిగా పనిచేస్తాయి.