Difference between Directive Principles and Fundamental Rights

TSStudies
0
Difference between Directive Principles and Fundamental Rights in telugu
Difference between Directive Principles and Fundamental Rights in Telugu

పోలికలు - తేడాలు

ప్రాధమిక హక్కులు

  • న్యాయ సంరక్షణ ఉంది
  • ప్రాధమిక హక్కులకు రాజ్యాంగపరమైన నిర్వచనం, హామీ ఉన్నాయి. దేశంలోని అన్ని న్యాయస్థానాలు వీటిని అమలు చేస్తాయి.
  • ప్రాథమిక హక్కులకు నకారాత్మక స్వభావం ఉంది. పౌరుల హక్కులలో జోక్యం చేసుకునే అధికారం ప్రభుత్వానికి లేదు.
  • ప్రాధమిక హక్కులు వ్యక్తుల వ్యక్తిగత ప్రయోజనాలను పెంపొందిస్తాయి.
  • ప్రాధమిక హక్కులకు ఆజ్ఞాపించే స్వభావం ఉంది.
  • పౌరుడి హక్కులలో ఏ వ్యక్తిగాని, సంస్థగాని, 'ప్రభుత్వంగాని జోక్యం చేసుకోరాదు. ఎవరైనా ఈ హక్కులను ఉల్లంఘిస్తే పౌరుడు న్యాయస్థానానికి వెళ్ళి న్యాయం పొందవచ్చు.
  • ప్రాథమిక హక్కులకు, నిర్దేశిక నియమాలకు మధ్య వివాదం ఏర్పడితే ప్రాథమిక హక్ష్కులకే ప్రాధాన్యం ఉంటుంది.
  • దేశాన్ని ప్రజాస్వామ్య రాజ్యంగా మార్చడానికి ప్రాధమిక హక్కులు తోడ్పడతాయి.
  • రాజకీయ ప్రజాస్వామ్యాన్ని పెంపొందిస్తాయి
  • వ్యక్తి వికాసానానికి దోహదం చేస్తాయి.
  • అత్యవసర పరిస్థితి సమయంలో రద్దు అవుతాయి
  • కొన్ని ప్రాథమిక హక్కులను తొలగించారు.
  • ఇది న్యాయ సంరక్షక స్వభావాన్ని కలిగి ఉంటుంది
  • అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించారు

ఆదేశిక సూత్రాలు

  • న్యాయ సంరక్షణ లేదు.
  • నిర్దేశిక నియమాలకు ప్రజా సంక్షేమాన్ని పెంపొందించే లక్ష్యం ఉంది. కాబట్టి అనేక ప్రభుత్వాలు వాటిని అమలు జరుపుతాయి.
  • ఆదేశిక సూత్రాలకు అనుకూల స్వభావం ఉంది. రాజ్య కార్యకలాపాలలో అనేక రంగాలకు అవి విస్తరింపచేస్తాయి. ఈ సూత్రాల పేరిట రాజ్యం శాసనాన్ని, ఆజ్ఞను, ఆదేశాన్ని జారీ చేయవచ్చు.
  • సమాజ సంక్షేమాన్ని పెంపొందించడమే నిర్దేశిక నియమాల లక్ష్యం. ఇవి వ్యక్తులకు సంబంధించినవి కావు. ప్రభుత్వాలకు సంబంధించినవి.
  • ఈ నియమాలకు ఆజ్ఞాపించే-స్వభావం లేదు. ఆర్థిక వనరుల సౌలభ్యాన్ని బట్టి ప్రభుత్వాలు వీటిని అమలు చేస్తాయి. వీటిని అమలు జరపలేదని ఏ వ్యక్తి కోర్టులో కేసు వేయడానికి లేదు. 
  • 42వ రాజ్యాంగ సవరణ ద్వారా నిర్దేశిక నియమాలకు, ప్రాథమిక హక్కుల మీద కొంత ప్రాధాన్యం వచ్చింది. సాంఘిక న్యాయాన్ని సామ్యవాద రాజ్యాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో ఈ మార్చు జరిగింది.
  • దేశాన్ని సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్య రాజ్యంగా మార్చడానికి నిర్దేశిక నియమాలు తోడ్పడతాయి.
  • సామాజిక, ఆర్థిక పరిరక్షణను పెంపొందిస్తాయి.
  • సమాజ సమిష్టి ప్రయోజనాలకు ఉద్దేశించినవి.
  • వీటిపై అత్యవసర పరిస్థితి ప్రభావం ఉండదు.
  • ఇంతవరకు ఆదేశిక నియమాన్ని తొలగించలేదు.
  • ఇవి సంవర్ధక స్వభావాన్ని కలిగి ఉంటుంది.
  • ఐర్లాండ్‌ రాజ్యాంగం నుండి గ్రహించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)