Fundamental Rights of Indian Constitution (Articles 12-35)-24

TSStudies
0
Types of Writs in Indian Constitution notes in Telugu

ప్రాథమిక హక్కులకు సంబంధించిన ముఖ్య వివాదాలు - సుప్రీం కోర్టు తీర్పులు

ప్రాథమిక హక్కులకు సంబంధించి సుప్రీంకోర్టు అనేక తీర్పులను వెలువరించింది. ఈ తీర్పులలో నూతన అర్దాలను,  భాష్యాలను, సూత్రాలను వివరించింది. వాటిలో ముఖ్యమైనవి.
SC judgments on fundamental rights in india,Supreme court judgments on fundamental rights in india,SC verdicts on fundamental rights in indiatsstudies
ఎ.కె. గోపాలన్‌ Vs తమిళనాడు - 1950
1950లో చేసిన నివారక నిర్బంధ చట్టంలోని సెక్షన్‌ 4 న్యాయసమీక్షాధికారానికి విరుద్ధంగా ఉన్నందున అది చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఈ చట్టం కింద ముందస్తు అరెస్టు సమంజసమేనని పేర్కొంది.

శంకర్‌ ప్రసాద్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా - 1951
మొట్టమొదటి రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశాన్ని ఈ వివాదంలో సుప్రీం కోర్టు పరిశీలించింది. ఈ సవరణ రాజ్యాంగబద్ధమేనని తీర్పు చెప్పింది. ఈ కేసులోనే సుప్రీం కోర్టు మొదటిసారిగా న్యాయ సమీక్షాధికారాన్ని వినియోగించింది.

బేలా బెనర్జీ Vs పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వము - 1954
ఈ వివాదం కూడా ఆస్తి హక్కుకు సంబంధించినదే. ప్రభుత్వం ప్రజల ఆస్తిని స్వాధీనం చేసుకున్నప్పుడు అందుకు మార్కెట్‌ విలువతో కూడిన నష్టపరిహారాన్ని చెల్లించాలని తీర్పు చెప్పింది.

సజ్జన్‌ సింగ్‌ Vs రాజస్థాన్‌ - 1964
ఈ కేసులో కూడా సుప్రీంకోర్టు రాజ్యాంగసవరణ అధికారానికి సంబంధించిన వివాదాన్ని పరిశీలించింది. ఆస్తి హక్కుకు సంబంధించి చేసిన 17వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగబద్ధమేనని ప్రకటించింది.

గోలక్‌నాథ్‌ Vs పంజాబ్‌ ప్రభుత్వము - 1967
పంజాబ్‌ ప్రభుత్వం రూపొందించిన భూసంస్కరణ. చట్టాన్ని ఈ కేసులో సుప్రీంకోర్టులో ప్రశ్నించారు. ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ప్రాథమిక హక్కులను సవరించాలంటే “ప్రత్యేక రాజ్యాంగ పరిషత్తు” ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఈ కేసులో ప్రకటించింది.

కేశవానంద భారతి Vs కేరళ ప్రభుత్వము - 1973
ప్రాథమిక హక్కులను సవరించడానికి ఉద్దేశించిన 24, 25వ రాజ్యాంగ సవరణలను సుప్రీం కోర్టులో ప్రశ్నించారు. గోలక్‌నాథ్‌ కేసులో చెప్పిన తీర్పులకు విరుద్ధంగా పార్లమెంటుకు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఉందని, అయితే మౌలిక స్వరూపం మార్చరాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. మౌలిక స్వరూపం (Basic Structure) అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఈ సందర్భంలోనే సుప్రీంకోర్టు ప్రయోగించింది.

మినర్వా మిల్స్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా - 1980
42వ రాజ్యాంగ సవరణను ఈ కేసులో సుప్రీం కోర్టులో ప్రశ్నించారు. ప్రాథమిక హక్కులు రాజ్యాంగ స్వరూపంలో భాగమని, వాటిని తగ్గించడం లేదా రద్దుచేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది మరియు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని నిర్వచించింది.

ఇందిరా సహాని Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా - 1992
వెనుకబడిన తరగతులకు 27% రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని ఈ కేసులో ప్రశ్నించారు.

ఉన్ని కృష్ణన్‌ Vs ఆంధ్రప్రదేశ్‌, మోహిని జైన్‌ Vs కర్నాటక, 1993
ప్రాథమిక హక్కులలో విద్యాహక్కు లేకపోతే జీవించేహక్కుకు, వ్యక్తి గౌరవానికే అర్ధం లేదని, ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.

Post a Comment

0Comments

Post a Comment (0)