ప్రాథమిక హక్కులు - వర్గీకరణ
సమానత్వపు హక్కు (ప్రకరణ 14-18)-Equality Rights (Articles 14-18)
- ప్రకరణ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే మరియు చట్టం మూలంగా అందరికి సమాన రక్షణ కల్పించాలి.
- చట్టం ముందు అందరూ సమానులు అనే భావన బ్రిటీషు రాజ్యాంగములోని సమ న్యాయ పాలనకు (Rule of Law) అనుగుణంగా పొందుపరిచారు. చట్టం ముందు అందరూ సమానులే అనగా దేశంలో ఒకే చట్టం ఉంటుంది మరియు ఆ చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది. వ్యక్తి హోదా, గౌరవంతో సంబంధం లేకుండా హక్కులు కల్పించబడతాయి. ఏ వ్యక్తికీ ప్రత్యేక మినహాయింపులు గాని హక్కులుగాని కల్పించరు. ప్రధానమంత్రి మొదలు అతి సామాన్య వ్యక్తి వరకు వారు చేసిన తప్పులకు చట్టపరంగా సమానంగా బాధ్యత వహించాల్సిందే.
- సమన్యాయ పాలన అనే భావాన్ని “ఎ.వి. డైసీ” అనే రాజ్యాంగ నిపుణుడు ప్రతిపాదించారు. ప్రధానమంత్రి మొదలు సామాన్య చిరుద్యోగి వరకు వారు చేనిన తప్పులకు చట్టపరంగా సమాన బాధ్యత వహించాల్సి ఉంటుంది.
- "చట్టం మూలంగా సమాన రక్షణ" (Equal Protection of Laws) అనేది అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది.
- “చట్టం మూలంగా సమాన రక్షణ” అనగా సమానులను, సమాన పరిస్థితులలో సమానులుగా చూడాలి. అసమానులు, అసమాన పరిస్థితులలో ఉంటే అసమానంగానే చూడాలి. ఏ ఇద్దరు సమానులను అసమానులుగా, అసమానులను సమానులుగా వివక్షత చూపరాదు.
- దేశంలో ఒకే చట్టం ఉన్నప్పటికీ, ఆ చట్టాన్ని అమలు చేసే సమయంలో ప్రజలను వర్గీకరించి అమలు చేయవచ్చు. అయితే వర్గ చట్టాలు చేయరాదు (Classification of People but not class legislation) దీనినే "రక్షిత వివక్ష" (Protective Discrimination) అంటారు. తద్వారా సామాజిక న్యాయం సాధ్యమవుతుంది.
- ప్రకరణ 14 ప్రకారం, చట్టం ముందు అందరు సమానులే అయినప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయింపులు ఇవ్వవచ్చు. హేతుబద్ధమైన, శాస్త్రీయమైన వర్గీకరణ ద్వారా మినహాయింపులు ఇవ్వడం ప్రకరణ 14కు వ్యతిరేకం కాదు.
- భౌగోళిక ప్రాంతం, అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, పెద్ద, చిన్న పరిశ్రమలు, మైనర్, మేజర్, స్త్రీలు, పురుషులు, మొదలగు ప్రాతిపదికలపైన మినహాయింపులు ఇవ్వవచ్చు.
ప్రత్యేక వివరణప్రకరణ .39(b) మరియు (c) లోని ఆదేశికాలను అమలు చేయుటకు చర్యలు తీసుకొంటే అవి ప్రకరణ 14కు వ్యతిరేకమని న్యాయస్థానంలో ప్రశ్నించరాదు. వీటిని అమలు చేయడానికి ప్రకరణ 14 అడ్డు కాదు (When Article 31(c) comes in Article 14 goes out)చట్టం ముందు అందరు సమానులు అనే సూత్రానికి మినహాయింపులు
- నిబంధన 14లో పేర్కొనబడిన “అందరూ సమానులు” అనే సూత్రం రాష్ట్రపతి, గవర్నర్‌కు వర్తించవు. వారు ఈ సూత్రానికి మినహాయింపు.
- ప్రకరణ 361 ప్రకారం, రాష్ట్రపతి, గవర్నర్ తమ అధికార విధుల నిర్వహణలో ఏ న్యాయసానానికీ జవాబుదారులు కాదు. వారిపైన ఎలాంటి క్రిమినల్ కేసులు పెట్టడానికి వీలులేదు. అయితే రెండు నెలల ముందస్తు నోటీసుతో సివిల్ కేసులు పెట్టవచ్చు.
- ప్రకరణ 105, ప్రకరణ 194 ప్రకారం, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలో సభ్యులు వ్యక్తీకరించిన అభిప్రాయాలకు వారు ఏ న్యాయస్థానానికీ బాధ్యులు కారు.
- అలాగే, విదేశీ సార్వభౌములకు, దౌత్వవేత్తలకు కూడా మినహాయింపు ఉంటుంది.
- ఐక్యరాజ్య సమితి వివిధ అంగాలలో పనిచేస్తున్న సిబ్బందికి కూడా ఈ మినహాయింపు ఉంటుంది.
Fundamental Rights of Indian Constitution (Articles 12-35)-7
19:40:00
0