Fundamental Rights of Indian Constitution (Articles 12-35)-1

TSStudies
0
Introduction to the Fundamental Rights of Indian Constitution notes in Telugu

ప్రాథమిక హక్కులు (Fundamental Rights Articles 12-35)

హక్కులు - అర్ద వివరణ - వర్గీకరణ 
హక్కు అనేది రాజనీతి శాస్త్ర అధ్యయనంలో ఒక ప్రాథమిక రాజకీయ భావన. హక్కు అనగా ప్రజలచేత కోరబడి, ప్రభుత్వం చేత గుర్తింపబడిన అధికారం. హక్కు అనగా అవకాశము, అధికారము కలిగి ఉండటం అని కూడా చెప్పవచ్చు. హక్కులనేవి ప్రభుత్వ నిరపేక్ష అధికరాలపైన పరిమితులు. ఒక వ్యక్తి తన శక్తి, తెలివితేటల ఆధారంగా తన ఔన్నత్యానికి మరియు సంపూర్ణ వికాసం పొందటానికి దోహదపడే పరిస్థితులనే హక్కులుగా చెప్పవచ్చు.
ప్రభుత్వం యొక్క గొప్పతనం అది ప్రజలకు కల్పించే హక్కులపై ఆధారపడి ఉంటుందని ప్రఖ్యాత రాజనీతి శాస్త్రజ్ఞుడు హెచ్‌.జె. లాస్కి వ్యాఖ్యానించారు.

హక్కుల వర్గీకరణ
హక్కులు సాధారణంగా రెండు రకాలుగా వర్గీకరిస్తారు. అవి
  • నైతిక హక్కులు
  • చట్టబద్ధ హక్కులు
నైతిక హక్కులు
    నైతిక హక్కులనేవి ప్రజల యొక్క నైతిక విలువలపై, నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి. వీటికి సమాజ ఆమోదం ఉంటుంది. కానీ ప్రభుత్వ గుర్తింపు ఉండదు. వీటిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉండవు, సమాజం ఈ చర్యలను గర్హిస్తుంది కాని శిక్షలను విధించలేదు. ఉదా:, ఉపాధ్యాయులు, విద్యార్థుల నుండి  గౌరవాన్ని పొందే హక్కు
చట్టబద్ధ హక్కులు
    నైతిక హక్కులకు ప్రభుత్వ గుర్తింపు ఇచ్చి న్యాయస్థానాల ద్యారా అమలు చేస్తే అవి చట్టబద్ధమైన హక్కులుగా పరిగణిస్తారు. వీటిని ఉల్లంఘిస్తే తగీన శిక్షలు ఉంటాయి.
చట్టబద్ధమైన హక్కులను ఈ క్రింది రకాలుగా వర్గీకరిస్తారు.
  • పౌరహక్కులు: సమాజంలో కుల, మత, జాతి వివక్షతలు లేకుండా అందరికీ సమాన గౌరవం పొండే హక్కులు
  • రాజకీయ హక్కులు: ప్రభుత్వంలో భాగస్వామి అగుటకు అపసరమైన ఓటుహక్కు పోటీచేసే హక్కు ప్రభుత్వ పదవులు చేపట్టే హక్కు మొదలైనవి
  • అర్థిక హక్కులు: కనీస వసతులు, జీవన భృతి, ఆకలి నుండి రక్షణ, వృత్తి, వ్యాపార అవకాశాలు
  • సాంస్కృతిక హక్కులు: భాష, సంస్కృతిని రక్షించుకునే హక్కులు
ప్రాథమిక హక్కులు (Fundamental Rights of Indian Constitution)
    భారత రాజ్యాంగంలోని మూడవ భాగంలో ప్రకరణలు 12 నుండి 35 వరకు ప్రాథమిక హక్కులను పొందుపరిచారు. ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో గల అత్యంత ముఖ్యమైన లక్షణంగా . పేర్కొంటారు. వీటిని అమెరికా సంయుక్త రాష్ట్రాల (USA) రాజ్యాంగం నుండి గ్రహించారు. అమెరికా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను “బిల్‌ ఆఫ్‌ రేట్స్‌” రూపంలో పొందుపరిచారు. 
    చట్టబద్దమైన హక్కులకు రాజ్యాంగ స్థానం కల్పించి, ప్రత్యేక ప్రతిపత్రితో గుర్తిస్తే వాటిని ప్రాథమిక హక్కులు అంటారు. వ్యక్తి వికాసానికి ఇవి కనీస అవసరాలు (Fundamental needs). అలాగే, ఆ దేశ రాజ్యాంగమైన ప్రాథమిక శాసనంలో (Fundamental Law) వీటిని గుర్తిస్తారు. కనుక వీటిని ప్రాథమిక హక్కులని అంటారు.

 ప్రాథమిక హక్కులు - చట్టబద్ధమైన హక్కుల మధ్య వ్యత్యాసం

 ప్రాథమిక హక్కులు

 చట్టబద్ధమైన హక్కులు

ప్రాథమిక హక్కులకు రాజ్యాంగ ప్రతిపత్తి  మరియు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది

చట్టబద్ధమైన హక్కులు ఆ దేశ శాసనసభ ద్వారా గుర్తించబడతాయి

ప్రాథమిక హక్కులను సాధారణంగా పౌరులు వదులుకోవడానికి వీలు ఉండదు

సాధారణ హక్కులను పౌరులు స్వచ్చందంగా వదులుకోవచ్చు

ప్రాథమిక హక్కులను పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ ద్వారానే సవరించవచ్చు కాని వాటి స్ఫూర్తికి విఘాతం కల్గించరాదు

సాధారణ హక్కులను పార్లమెంటు సాధారణ మెజారిటీతో సవరించవచ్చు, తొలగించవచ్చు

ప్రాథమిక హక్కుల రక్షణ, అమలుకు రాజ్యాంగంలో ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి (Constitutional Remedies) వీటి రక్షణ కోసం ప్రత్యేక రిట్లు జారీ చేస్తారు

సాధారణ హక్కుల రక్షణకు పార్లమెంటు కల్పించిన చట్టపరపరిహారాలు (Legal Remedies) మాత్రమే ఉంటాయి

అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎప్పుడూ ప్రాథమిక హక్కులు రద్దు కావు

 సాధారణ హక్కులను ఎప్పుడైనా రద్దు చేయవచ్చు

Fundamental rights in telugu, fundamental rights of indian constitution,fundamental rights of constitutional india,fundamental rights notes in telugu,fundamental rights articles 12-35, Directive Principles and Fundamental Duties of India, How many Fundamental Rights in Indian Constitution,six fundamental rights notes in telugu,introduction to the fundamental rights notes intelugu,rights in the indian constitution notes in telugu, Fundamental rights and duties, Difference between Fundamental Rights and Fundamental Duties,list of fundamental rights, Jurisprudential Aspects of Fundamental Duties, Need to remember our fundamental duties,Supreme court verdicts on fundamental rights of indian constitution,ts studies,Indian polity lecture notes in telugu,indian polity notes in telugu,Indian constitution lecture notes in telugu,Indian constitution notes intelugu,groups exams notes in telugu,summary of fundamental rights in telugu,difference between fundamental rights and legal rights, Fundamental rights and responsibilities, Rights and duties of the Constitutional India, Relevance of Fundamental Duties in Present Scenario, THE FUNDAMENTAL DUTIES OF CITIZENS OF INDIA, Reflections on fundamental rights

Post a Comment

0Comments

Post a Comment (0)