Preamble-Philosophical Foundations-4

TSStudies
0
Importance of the Constitutional Preamble in Telugu
ప్రవేశిక ప్రాముఖ్యత - విమర్శనాత్మక పరిశీలన
భారత రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మగా పరిగణించబడుతున్న ప్రవేశిక ప్రాముఖ్యతపై భిన్న అభిప్రాయాలున్నాయి. ప్రవేశికకు న్యాయ సంరక్షణ లేదు. అనగా ఇందులో పొందుపరచబడిన ఆశయాలు, లక్ష్యాలు స్వతంత్రంగా అమలులోకి రావు. వాటిని అమలుపరచమని పౌరులు న్యాయస్థానాన్ని ఆశ్రయించలేరు. ఆ విధంగా న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేయలేవు. కనుక అత్యంత పవిత్రమైన ఈ ఆశయాలకు ఆచరణ లేదా అమలు చేయకపోవడం వల్ల వాటి సార్ధకతపై తీవ్ర విమర్శ ఉంది. అయితే రాజ్యాంగంలోని ప్రకరణల భావము లేదా ఆచరణీయతపై సక్రమంగా వ్యాఖ్యానించడానికి ప్రవేశికలోని సారాంశాన్ని న్యాయస్థానాలు ప్రాతిపదికగా తీసుకుంటాయి. ప్రవేశికకు స్వతంత్రంగా ప్రాముఖ్యత లేకపోయినా, ఇందులోని ఆదర్భాలను అమలుచేస్తూ పార్లమెంటు చట్టం చేసినప్పుడు లేదా ఆ విధంగా చేసిన చట్టాలను అమలు చేయనప్పుడు, న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు.

ప్రవేశికపై ప్రముఖుల అభిప్రాయాలు
  • ప్రవేశిక అనేది భారత ప్రజాస్వామ్య గణతంత్రానికి రాజకీయ జాతకం (Political Horoscope) - కెయం. మున్షి
  • ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అత్యంత పవిత్రమైన భాగం. ఇది రాజ్యాంగ ఆత్మ మరియు రాజ్యాంగానికి తాళం చెవిలాంటిది. - పండిట్‌ ఠాకూర్‌దాస్‌ భార్గవ
  • ప్రవేశిక అనేది రాజ్యాంగానికి ఒక గుర్తింపు పత్రం వంటిది. - ఎం.ఎ. నాని పాల్మీవాలా
  • అతా భారత రాజ్యాంగం - రాజకీయ వ్యవస్థ మరియు పరిపాలన
  • ప్రవేశిక అనేది రాజ్యాంగానికి కీలక సూచిక వంటిది. అలాంటి సూచికలు సాధారణంగా పాశ్చాత్య రాజ్య వ్యవస్థలో ఉంటాయి. ఇది భారత రాజ్యాంగంలో ఉన్నందుకు నేను పులకించి గర్వపడుతున్నాను. - సర్‌ ఎర్నస్ట్ బార్కర్ 
  • ప్రవేశిక అనేది మన కలలకు, ఆలోచనలకు రాజ్యాంగంలో వ్యక్తీకరించుకున్న అభిమతం- అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌
  • భారత రాజ్యాంగ ప్రవేశిక అమెరికా స్వతంత్ర ప్రకటనలాగే రాజ్యాంగ ఆత్మ. రాజకీయవ్యవస్థ స్వరూపం, పవిత్ర నిర్ణయాన్ని తెలియచేస్తుంది. వివ్లవం తప్పు మరొకటి దీన్ని మార్చలేదు - జస్టిస్‌ హిదయతుల్లా
  • ప్రవేశికను ఒక నిశ్చితమైన తీర్మానం మరియు హామీ - నెహ్రూ
  • రాజ్యాంగ ప్రధానాల లక్షణ సారం - మథోల్మర్‌
  • ప్రవేశిక అనేది రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను, లక్ష్యాలను తెలుసుకోవడానికి ఒక తాళం చెవి వంటిది - జె. డయ్యర్‌
  • ప్రవేశిక అనేది రాజ్యాంగానికి ఆధారంకాదు, అలాగే పరిమితి కాదు- సుప్రీం కోర్ట్‌
ప్రవేశికలోని ప్రధాన పదాలకు వర్తించే భాగములు, ప్రకరణలు

 పదం

 ప్రకరణలు

సామ్యవాదం / సంక్షేమ స్వభావం

నాల్గవ భాగంలోని ఆదేశిక సూత్రాలు

లౌకిక తత్వం

25 నుండి 28 వరకు గల ప్రకరణలు - మత స్వాతంత్య్రన్ని ప్రాథమిక హక్కుగా, లౌకిక భావనలను పెంపొందించడానికి వీలుగా హామీ

ప్రజాస్వామికత

326వ ప్రకరణ - సార్వత్రిక వయోజన ఓటుహక్సును, నిర్జీత కాలానికి ఎన్నికలను జరపడం మరియు చట్టసభలకు గల ప్రభుత్వ బాధ్యతను తెలియజేయడం.

గణతంత్రం

54వ ప్రకరణ - దేశాధినేతగా ఎన్నికయిన అధ్యక్షుడు ఉండటం

సామాజిక ఆర్థిక న్యాయం

17వ ప్రకరణ - అంటరానితనం నిషేధం, ప్రకరణలు 23 మరియు 24 - పీడన నిరోధ హక్కులు, సామాజిక న్యాయాన్ని ఆదేశిక సూత్రాలు కల్పిస్తున్నాయి.

రాజకీయ న్యాయం

326వ ప్రకరణ సార్వత్రిక వయోజన ఓటుహక్కు

ఆలోచన, భావ ప్రకటన స్వేచ్చ

19వ ప్రకరణ - వాక్‌ స్వాతంత్య్రం, భావ ప్రకటనా హక్కులు.

విశ్వాసం, నమ్మకం, ఆరాధనా స్వేచ్చ

25వ ప్రకరణ - మత స్వాతంత్య్రపు  హక్కు

హోదా, అవకాశాలలో సమానత్వం

14వ ప్రకరణ - చట్టం ముందు అందరూ సమానులు మరియు చట్టం ముందు సమానత్వం.

15వ ప్రకరణ - వివక్షతలకు వ్యతిరేకంగా రక్షణ
16వ ప్రకరణ - ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు
39వ ప్రకరణ - సమాన పనికి సమాన వేతనం గ్యారంటీ
326వ ప్రకరణ - సార్వత్రిక వయోజన ఓటుహక్కు

వ్యక్తి గౌరవం-సౌభ్రాతృత్వం

51e ప్రకరణ - సామరస్యాన్ని పెంపొందించి భారత ప్రజలలో సోదర భావాన్ని కల్పించడం. 3వ భాగంలోని ప్రాథమిక హక్కులు వ్యక్తి గౌరవానికి హామీ.

42వ ప్రకరణ - పని చేసే చోట సరైన పరిస్థితులు కల్పించడం.
43వ ప్రకరణ - గౌరవంతో కూడిన జీవనం, విశ్రాంతితో కూడిన ఉపాధి, సామాజిక, సాంస్కృతిక అవకాశాలకు హామీ.
The Preamble of the Constitution of India in English,Importance of The Preamble of the Constitution of India, Preamble to the Indian Constitution notes in telugu,Indian Constitution The Preamble,The Preamble: What does it says,The Preamble: What does it means,Which of these words begin the Preamble to the Constitution of India,What is the Preamble of the Constitution of India,The Preamble of the Indian Constitution begins with the words,The spurious debate on the preamble,A DEEP ANALYSIS ON THE CONTROVERSIAL PREAMBLE,Preamble Constitution India,Is Preamble a Part of Constitution,SC Verdict on Preamble to the Constitution of India,Supreme Court Verdicts on Constitutional Preamble,Comments on The Preamble of Indian constitution,Indian Constituion Lecture notes in telugu,Indian constitution notes in telugu,Indian polity notes in telugu

Post a Comment

0Comments

Post a Comment (0)