ప్రాథమిక హక్కులు - నేపథ్యం
రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు సుదీర్ఘ చారిత్రక నేపథ్యం ఉంది. మొట్టమొదటిసారిగా, 1895లో స్వరాజ్య బిల్లులో లోకమాన్య బాలగంగాధర తిలక్ ఈ హక్కులను ప్రతిపాదించారు. ఆతర్వాత
- 1911లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో హక్కులపై తీర్మానం అమోదించారు
- 1922లో మహాత్మాగాంధీ ప్రజల హక్కుల గురించి యంగ్ ఇండియాలో ప్రస్తావించారు
- 1925లో కామన్‌వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లులో, ఐర్లాండు రాజ్యాంగంలో ప్రస్తావించిన విధంగానే భారతీయులకు కూడా ప్రాథమిక హక్కులు కావాలని అనీబిసెంట్ ప్రతిపాదించారు
- 1927లో మద్రాసులో ఎం.ఎ. అన్సారి అధ్యక్షతన జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో భావి రాజ్యాంగానకి ప్రాథమిక హక్కులు ప్రాతిపదిక కావాలని తీర్మానం ఆమోదించింది
- 1928లో మోతీలాల్ నెహ్రూ కమిటి తన నివేదికలో ప్రాథమిక హక్కులకు ఆమోదం పొందటం పౌరుల అవసరం అని పేర్కొన్నారు
- 1931లో కరాచీలో వల్లభ్‌భాయ్ పటేల్ అధ్యక్షతన ప్రాథమిక హక్కులు డిమాండు చేయబడ్డాయి. మన రాజ్యంగంలో ప్రాథమిక హక్కులను చేర్చడానికి ఆ నివేదిక ప్రాతిపదిక అయ్యింది
- 1931లో జరిగిన రెండవ రౌంద్. టేబుల్ సమావేశంలో మహాత్మాగాంధీ భావి భారత రాజ్యంగంలో ప్రాథమిక హక్కులను చేర్చాలని కోరారు
- 1945లో తేజ్ బహదూర్ సప్రూ నాయకత్వాన ఏర్పడిన పార్టీరహిత మేధావుల సంఘం కూడా ప్రాథమిక హక్కులు కావాలని డిమాండు చేసింది
ప్రాథమిక హక్కులు - రాజ్యంగ పరిషత్తుహక్కులను రాజ్యాంగంలో చేర్చి ఒక నిర్దిష్ట స్వరూపాన్ని కల్పించేందుకు రాజ్యాంగ పరిషత్ జనవరి 24, 1947న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అధ్యక్షతన 54 మంది సభ్యులతో ఒక సలహా సంఘాన్ని నియమించింది. సలహా సంఘం ప్రాథమిక హక్కులను పరిశీలనకు ఫబ్రవరి 12, 1947న ఆచార్య జె. బి. కృపలాని అధ్యక్షతన ఒక ఉప సంఘాన్ని నియమించింది.ఉపసంఘం సూచన మేరకు రాజ్యాంగ పరిషత్ సలహాదారు బి.ఎన్. రావు హక్కులపై ఒక ముసాయిదాను తయారు చేసారు.ఈ ముసాయిదాలో హక్కులను న్యాయ, సంరక్షణ ఉన్న హక్కులుగా, న్యాయసంరక్షణ లేని హక్కులుగా వర్గీకరించారు.
Fundamental Rights of Indian Constitution (Articles 12-35)-2
18:18:00
0