Preamble-Philosophical Foundations-3

TSStudies
0
SC Verdicts on Constitutional Preamble
ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగామా? - వివాదాలు 

సుప్రీంకోర్టు తీర్పులు
రాజ్యాంగ సారాంశం అంతా ప్రవేశికలో నిక్షిప్తమై ఉంటుంది. అయితే, ఇది రాజ్యాంగ అంతర్భాగమా, కాదా అనే అంశంపై సుప్రీంకోర్టు భిన్న తీర్పులను వెలువరించింది. 1960లో బెరుబారి  కేసులో సుప్రీంకోర్టు ప్రవేశిక అంతర్భాగం కాదని పేర్కొంది. ప్రకరణ 143 ప్రకారం, సలహా పూర్వకమైన అభిప్రాయాన్ని చెప్పింది. అయితే 1973లో కేశవానంద భారతి వివాదంలో పూర్తి భిన్నమైన తీర్పు చెబుతూ, ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగమని వ్యాఖ్యానించింది. 1996లో LIC of India కేసులో కూడా ఇదే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు పునరురుద్ఘాటించింది.
రాజ్యాంగ పరిషత్‌లో ప్రవేశికను ఓటింగ్‌కు పెట్టినపుడు కూడా డా. రాజేంద్రప్రసాద్‌ “ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగమని” పేర్కొన్నారు. ఈ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు స్థిరీకరించింది.

ప్రవేశిక ప్రయోజనం - ప్రాముఖ్యత - విమర్శ
ప్రవేశిక రాజ్యాంగ ఆత్మ మరియు హృధయం. రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను తెలుసుకోవడానికి ఆధారం. ఇది రాజ్యాంగానికి సూక్ష్మరూపం (Constitution of  Miniature). రాజ్యాంగ తాత్విక పునాదులు ఇందులో ఉన్నాయి. 

ప్రయోజనాలు
  • రాజ్యాంగ ఆధారాలను తెలియజేస్తుంది.
  • రాజ్యాంగ ఆమోద తేదిని తెలియజేస్తుంది
  • రాజ్యాంగాన్ని సక్రమంగా వ్యాఖ్యానించడానికి న్యాయస్థానాలకు చట్టపర సహాయకారిగా ఉపయోగపడుతుంది.
విమర్శ
  • ప్రవేశికకు న్యాయ సంరక్షణ లేదు (Non-Justiciable) అనగా ఇందులో పేర్కొన్న ఆశయాలు అమలు పరచకపోతే న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవు.
  • ఇందులో పేర్కొనబడిన భావజాలానికి నిర్దిష్ట నిర్వచనాలు లేవు.
  • హక్షుల ప్రస్తావన లేదు.
  • శాసనాధికారాలకు ఇది ఆధారం కాదు.
  • సమకాలీన ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, ఆర్థిక సరళీకరణ నేపథ్యంలో ప్రవేశికలోని కొన్ని ఆదర్శాలకు గ్రహణం పట్టిందని చెప్పవచ్చు.
ప్రవేశిక - సుప్రీం కోర్ట్‌ తీర్పులు
  

 వివాదం 

 సం॥

సుప్రీంకోర్టు తీర్పు సారాంశం

ఎ.కె. గోపాలన్‌ కేసు

 1950

ప్రవేశిక రాజ్యాంగ ప్రకరణల అర్ధాన్ని పరిధిని నియంత్రిస్తుంది

బెరుబారి యూనియన్‌ కేసు

 1960

ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగం కాదు

గోలక్‌నాథ్‌ కేసు

 1967

ప్రవేశిక అనేది రాజ్యాంగ ఆదర్శాలకు, ఆశయాలకు సూక్షరూపం

కేశవానంద భారతి కేసు

 1978

ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగమే. మౌలిక నిర్మాణం పరిధిలోకి వస్తుంది. పరిమితంగా సవరించవచ్చు.

ఎక్సెల్‌ వేర్‌ కేసు

 1979

సామ్యవాద పద నిర్వచనం

నకారా కేసు

 1983

సామ్యవాదం అనేది గాంధీయిజం + మార్చిజం కలయిక

ఎస్‌.ఆర్‌. బొమ్మాయ్‌ కేసు

 1994

లౌకికతత్వం రాజ్యాంగ మౌలిక నిర్మాణంలోకి వస్తుంది

ఎల్‌.ఐ.సి. ఆఫ్‌ ఇండియా

 1995

ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగమని పునరుద్దాటించింది

అశోక్‌కుమార్‌ గుప్తా కేసు

 1997

సామాజిక న్యాయం ప్రాథమిక హక్కు

అరుణా రామ్‌ కేసు 

 2002

విద్యా సంస్థలలో మత విలువల బోధన లౌకిక తత్వానికి వ్యతిరేకం కాదు

The Preamble of the Constitution of India in English,Importance of The Preamble of the Constitution of India, Preamble to the Indian Constitution notes in telugu,Indian Constitution The Preamble,The Preamble: What does it says,The Preamble: What does it means,Which of these words begin the Preamble to the Constitution of India,What is the Preamble of the Constitution of India,The Preamble of the Indian Constitution begins with the words,The spurious debate on the preamble,A DEEP ANALYSIS ON THE CONTROVERSIAL PREAMBLE,Preamble Constitution India,Is Preamble a Part of Constitution,SC Verdict on Preamble to the Constitution of India,Supreme Court Verdicts on Constitutional Preamble,Comments on The Preamble of Indian constitution,Indian Constituion Lecture notes in telugu,Indian constitution notes in telugu,Indian polity notes in telugu

Post a Comment

0Comments

Post a Comment (0)