Fundamental Rights of Indian Constitution (Articles 12-35)-21

TSStudies
0
Types of Writs in Indian Constitution notes in Telugu

 ప్రాధమిక హక్కులు - ఇతర నిబంధనలు

ప్రకరణ 33 అనుసరించి, ప్రాధమిక హక్కులు ఈ క్రింది వర్గాలకు వర్తించే విషయంలో కొన్ని పరిమితులను పార్లమెంటు చట్టం ద్వారా విధించవచ్చు.
  • ఎ) సైనికదళాలు, పారా మిలటరీ దళాలు.
  • బి) పోలీసులు, ఇతర రక్షణపరమైన విధులను నిర్వర్తిస్తున్న సంస్థలు, అధికారుల ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించవచ్చు.
  • సి) గూఢచార. సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు.
  • డి) అత్యవసర సర్వీసులైన టెలి కమ్యూనికేషన్లు, ఇతర బ్యూరోలలో పనిచేసే ఉద్యోగులు.
ప్రకరణ 34 - సైనికచట్టం (Marshal Law) ప్రాథమిక ప్రాథమిక హక్కులపై పరి పరిమితులు
దేశంలో ఏదైనా ప్రాంతంలో సైనిక చట్టం ప్రకటించినప్పుడు ఆ సమయంలో సైనిక బలగాలు తీసుకున్న చర్యలకు తద్వారా జరిగిన నష్టాలకు, పరిణామాలకు వారిని బాధ్యులు చేయడానికి వీలులేదు. పార్లమెంటు ఒక చట్టం ద్వారా వారి చర్యలకు రక్షణ కల్పిస్తుంది. ప్రాధమిక హక్కులకు భంగం కలిగినదని న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి వీలులేదు.
difference of article 33 and 34 in telugu,what is marshal law in telugu,article 35 meaning in telugu,what is article 35(b) in telugu,article 34 telugu

ప్రకరణ 33, ౩4 కు మధ్య ఉన్న తేడా
ప్రకరణ 33లో ప్రస్తావించిన అంశాలు కొన్ని వర్గాల ఉద్యోగులు, వారి హక్కులపై పరిమితులు. అయితే  ప్రకరణ 34లో ప్రస్తావించిన అంశాలు ప్రస్తావించిన ప్రత్యేక ప్రాంతాలలో ప్రాధమిక హక్కులను పరిమితం చేయడం. కనుక ఒకటి వర్గానికి సంబంధించినది మరొకటి ప్రాంతానికి సంబంధించినది.
ఉదా: 1958లో రూపొందించిన సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల (Armed forces special power Act) దీనిని దీనిని పలు పర్యాయాలు సవరించి అస్సాం, మణిపూర్ కల్లోలిత ప్రాంతాల్లో ఉపయోగించారు. అలాగే 1983లో పంజాబ్‌ & చంఢీఘర్‌లో కూడా ఉపయోగించారు. అక్కడ నెలకొన్న పరిస్థితుల కారణంగా శాంతి భద్రతల నిర్వహణలో పోలీసులు వైఫల్యం చెందినప్పుడు ఈ చట్టం ద్వారా సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి.

ప్రకరణ - ౩5 చట్టబద్దత. శిక్షలు
మూడవ భాగంలో పేర్కొనబడిన కొన్ని నిబంధనల అమలుకు చట్టబద్ధత కల్పించడం, శిక్షలు నిర్ణయించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. రాష్ట్ర శాసన సభలకు ఉండదు. ప్రాధమిక హక్కుల అమలుకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒకే విధమైన పద్ధతి లేదా ప్రక్రియ ఉండాలనే ఉద్దేశ్యం చేత ఈ అధికారాన్ని పార్లమెంటుకు మాత్రమే ఇచ్చారు.
ఉదా : ప్రకరణ 16(3) రిజర్వేషన్లు అమలు, ప్రకరణ 32(3) రిట్లు జారీ చేసే అధికారాన్ని న్యాయస్థానాలకు సంక్రమింప చేయడం, ప్రకరణ 33 ప్రకారం సాయుధ బలగాల ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించడం, ప్రకరణ 34 ప్రకారం సైనిక పాలన, మొదలగు అంశాలపై పార్లమెంటుకు మాత్రమే చట్టాలు చేసే అధికారం ఉంటుంది.

అలాగే ఈ భాగంలో పేర్కొనబడిన నేరాలకు, (ఉదాహరణకు ప్రకరణ 17లో పేర్కొనబడిన అస్పృశ్యత, 23 లో పేర్కొనబడిన దోపిడి, 24 లోని బాలకార్మిక వ్యవస్థ మొదలగు వాటికి) శిక్షలు నిర్ణయించే అధికారము పార్లమెంటుకే ఉంటుంది.

ప్రకరణ 35(b) ప్రకారం, పై విషయాలకు సంబంధించి రాజ్యాంగం అమలులోకి రాకముందు ఉండే చట్టాలు అలాగే కొనసాగుతాయి. అయితే ప్రకరణ 372 ప్రకారం పూర్వపు శాసనాలకు మార్పులు, చేర్పులు, సవరణలు చేసి కొత్త చట్టాలు కూడా పార్లమెంటు రూపొందించుకోవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)