ప్రాథమిక హక్కులు - ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు (Public Interest Litigations-PIL)
ప్రాథమిక హక్కుల రక్షణ, అమలుకు సంబంధించి రాజ్యాంగంలో ప్రత్యేక ఏర్పాట్లును ప్రకరణ 32, అలాగే ప్రకరణ 226లో పేర్కొన్నారు. హక్కులకు భంగం కలిగినప్పుడు లేదా అమలు కానప్పుడు బాధితుడే సాధారణంగా కోర్టును ఆశ్రయిస్తాడు. అయితే బాధితునికి సరైన అవగాహన లేకపోవడం లేదా ఆర్థిక, సామాజిక స్థితి పరంగా కోర్టును ఆశ్రయించే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో బాధితులకు సంబంధించి ప్రజాప్రయోజనం అందులో ఇమిడి ఉంటే వారి తరపున మూడవ వ్యక్తి కూడా కోర్టులో వ్యాజ్యాన్ని వేయవచ్చు. దీనినే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అంటారు.సాధారణంగా కోర్టు జోక్యాన్ని కోరే హక్కు (Locus Stand) బాధితులకే ఉంటుంది. కాని సుప్రీంకోర్టు ఆ హక్కును ఇతరులకు కూడా సంక్రమింప చేసింది. ఈ వెసులుబాటును పబ్లిక్ ఇంట్రస్ట్ లిటిగేషన్ లేదా “సోషల్లీ ఇంట్రస్ట్ లిటిగేషన్” అని కూడా అంటారు.గమనిక: PIL భావన మొదటిసారిగా అమెరికా న్యాయ వ్యవస్థలో ప్రారంభమయ్యింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో బాగా ప్రచారంలోకి వచ్చింది. ఇండియాలోని PIL భావన అమెరికా నమూనాలోని భావనే కానీ, కొద్ది మార్పులతో పాటిస్తున్నారు.రాజ్యాంగంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం గురించి ప్రస్తావన లేదు. అయితే సుప్రీం కోర్టులో మొదటిసారిగా ఈ భావనను ప్రవేశపెట్టినది జస్టిస్ వి.ఆర్. కృష్ణ అయ్యర్. ఆ తర్వాత జస్టిస్ పి.ఎన్. భగవతి నేతృత్వంలోని వై.వి. చంద్రచూడ్ సుప్రీం కోర్టు బెంచ్‌కి మొట్టమొదటిసారిగా 1979లో బీహార్ జైల్లో ఖైదీల తరపున PIL ను దాఖలు చేశారు. దీనినే హస్నార ఖతూన్ Vs స్టేట్ ఆఫ్ బీహార్ కేస్ అంటారు.అయితే 1981లో ఎస్.పి. గుష్తా Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసుకు సంబంధించి అతి ముఖ్యమైన కేసుగా పేర్కొంటారు. జస్టిస్ పి.ఎన్. భగవతి PIL గురించి చక్కగా నిర్వచించి, తగిన వివరణ ఇచ్చారు.ప్రకరణ 32 ప్రకారం, సుప్రీం కోర్టులో, ప్రకరణ 226 ప్రకారం హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేయవచ్చు. ఇతర న్యాయస్థానాలకు ఈ అధికారం లేదు.ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి కుంభకోణాలు PIL ద్వారానే దేశంలో వెలుగులోకి వచ్చాయి.అయితే PIL ను వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించరాదు. ప్రచారం కోసం ప్రత్యర్థులను ఇబ్బందులకు గురి చేయాలనే దురుద్దేశంతో ప్రజాప్రయోజనాల నెపంతో PIL ను దాఖలు చేస్తే అలాంటి వ్యక్తులపై న్యాయస్థానాలు భారీ జరిమానాలు విధిస్తాయి. ఉదా. సంజీవ్ భట్నాగర్ అనే వ్యక్తి జాతీయగీతం నుండి “సింధ్” అనే పదాన్ని తొలగించాలని సుప్రీంకోర్టులో PILను దాఖలు చేశారు. అది అనవసరమైన, ఆర్భాటమైన కేసుగా భావించి కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు భారీ జరిమానా విధించింది.సినీనటి జూహీచావ్లా 5G Technology ను రద్దు చేయాలంటూ వేసిన PIL కు ఢిల్లీ హైకోర్టు 20 లక్షల రూపాయల జరిమానా విధించింది.
Fundamental Rights of Indian Constitution (Articles 12-35)-22
08:17:00
0