Fundamental Rights of Indian Constitution (Articles 12-35)-23

TSStudies
0
Types of Writs in Indian Constitution notes in Telugu

ప్రాథమిక హక్కులసై పరిమితులు - జాతీయ అత్యవసర పరిస్థితి ప్రభావం

నిబంధన 352 ప్రకారం, జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు మూడవ భాగంలో పేర్కొనబడిన ప్రాధమిక హక్కులు రద్దు అవుతాయి. దీనికి సంబంధించి రాజ్యాంగంలో ప్రకరణలు 358 మరియు 359లో వివరణలు ఇవ్వబడ్డాయి.
Emergency articles in indian constitution,what is article 358 in telugu,article 359 in telugu,cancellation of fundamental rights in india,ts studies
ప్రకరణ 358 ప్రకారం బాహ్య అత్యవసర పరిస్థితి
  • యుద్ధం, దురాక్రమణ కారణంగా అత్యవసర పరిస్థితి విధించినపుడు మాత్రమే వర్తిస్తుంది. దీని ప్రకారం ప్రకరణ 19లో పేర్కొనబడిన స్వేచ్చలను మాత్రమే రద్దు చేస్తారు. ఇతర ప్రాథమిక హక్కులు రద్దు కావు.
  • ప్రకరణ 358 ప్రకారం, జాతీయ అత్యవసర పరిస్థితిలో ప్రకరణ 19లో పేర్కొనబడిన స్వేచ్చలు వాటంతట అవే రద్దవుతాయి. కానీ ప్రకరణ 359 ప్రకారం, ప్రాథమిక హక్కులు రద్దు చేయడానికి రాష్ట్రపతి ప్రత్యేక ఆదేశాన్ని జారీ చేయాలి. ఎమెర్జెన్సీ విధించినంత మాత్రాన వాటంతట అవి రద్దు కావు.
  • నిబంధన 358 పరిధి దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. కాని ప్రకరణ 359 పరిధి దేశంలో కొన్ని ప్రాంతాలకు లేదా కొంత భాగానికి లేదా మొత్తం భాగానికి వర్తింపచేయవచ్చు. 
  • జాతీయ అత్యవసర పరిస్థితి ఏ కారణంగా విధించినప్పటికీ (బాహ్య, అంతరంగిక కారణాలు) ప్రకరణ 20 మరియు 21 ఎట్టి పరిస్థితులలోను రద్దుకావు. ఈ అంశాన్ని 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచారు.
  • ప్రకరణలు 358 మరియు 359 మధ్య కొంత సామీష్యత ఉంది. ఇది అత్యవసర పరిస్థితి విధించడం ద్వారా జరిగే పరిణామాలకు రక్షణ కల్పిస్తాయి కానీ ఎమర్జెన్సీతో సంబంధము లేని చట్టాలకు వర్తించవు.
ప్రాథమిక హక్కులు - మినహాయింపులు
  • ప్రకరణ 31-Aలో పేర్కొన్న ఐదు రకాలైన చట్టాలు తమ ప్రాథమిక హక్కులకు విరుద్ధమంటూ న్యాయస్థానాల్లో ప్రశ్నించడానికి వీలులేదు. ఈ అంశాలను తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చారు.
  • నిబంధన 31-Bలో కూడా ఇలాంటి పరిమితులనే పేర్కొన్నారు. 31-C ప్రకారం నిర్దేశిక నియమాలలో పొందుపరచబడిన 39-B మరియు 39-C అమలు కోసం ప్రాథమిక హక్కులపై పరిమితులు విధిస్తే, అది రాజ్యాంగ విరుద్ధమంటూ న్యాయస్థానంలో ప్రశ్నించరాదు.
ప్రాథమిక హక్కులు - విమర్శనాత్మక పరిశీలన
  • మూడవ భాగంలోని ప్రాథమిక హక్కులపై ఈ క్రింది విమర్శలున్నాయి.
  • ఆర్థికపరమైన హక్కులను గుర్తించలేదు. ఉదా. పని హక్కు, విశ్రాంతి హక్కు, సామాజిక భద్రతా హక్కులను ప్రాథమిక హక్కులలో పొందుపరచలేదు.
మితిమీరిన పరిమితులు
  • మూడవ భాగంలో ఆరు ప్రాథమిక హక్కులుంటే రెట్టింపు సంఖ్యలో పరిమితులున్నాయని, ఒకవైపు హక్కులు కల్పిస్తూ మరొక వైపు పరిమితులు కల్పించడం సమంజసం కాదనేది విమర్శకుల అభిప్రాయం.
  • జస్వంత్‌రాయ్‌ కపూర్‌ అనే రచయిత భారత రాజ్యాంగంలోని మూడవ భాగం ప్రాథమిక హక్కుల జాబితా కాదని ప్రాథమిక హక్కులపై గల పరిమితుల జాబితా (It is not a list on fundamental rights but a list on exceptions on it) అని వ్యాఖ్యానించాడు.
  • ఒక చేత్తో హక్కులిచ్చి మరొక చేత్తో వాటిని తీసుకునే విధంగా హక్కులు ఉన్నాయని ప్రఖ్యాత రాజ్యాంగ నిపుణుడు ఎం. సి. ఛాగ్లా వ్యాఖ్యానించారు.
స్పష్టత లేకపోవడము, కఠిన పదజాలము
ప్రాథమిక హక్కులలో ఉపయోగించిన భాష సంక్లిష్టంగా ఉండి సామాన్యులకు అర్ధం కాదు. న్యాయకోవిదులకు కూడా దీనిని అర్థం చేసుకోవడం తేలిక కాదు. భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం అన్న ఐవర్‌ జెన్నింగ్స్‌ విమర్శ ఒక్క ప్రాథమిక హక్కులతోనే బుజువు అవుతుంది.

ఆస్తి హక్కు - తొలగింపు
  • మౌలిక రాజ్యాంగంలో ఉన్న ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించడం వలన ప్రాథమిక హక్కుల స్థాయిని తగ్గించినట్లయింది.
  • అత్యవసర పరిస్థితి సమయంలో ప్రాథమిక హక్కులు రద్దు చేయడం, నివారక నిర్భంధ చట్టాల ఆధారంగా ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించడం వలన రాజకీయ ప్రయోజనాలకు, కక్ష సాధింపులకు ఆస్కారమయింది.
  • ప్రాథమిక హక్కులు, నిర్దేశిక నియమాల మధ్య వివాదాలు ఏర్పడి అది శాసన, న్యాయ వ్యవస్థల మధ్య ఘర్షణ వైఖరికి దారితీసే అవకాశముంది.
అత్యవసర పరిస్థితి - హక్కుల రద్దు
  • జాతీయ అత్యవసర పరిస్టితి విధించినప్పుడు ప్రాధమిక హక్కులను రద్దు చేయవచ్చు. తద్వారా ప్రజల 'స్వేచ్చలకు, హక్కులకు రక్షణ ఉండదు.
  • ప్రాధమిక హక్కులపై విమర్శ ఉన్నప్పటికీ, వాటి ప్రాముఖ్యతను, విలువను విస్మరించలేదు. ప్రాథమిక హక్కులనేవి వ్యక్తి స్వేచ్చలకు మూలాలు. వ్యక్తి వికాసానికి అనివార్యాలు. వ్యక్తులు నేరోపరంగా, నైతికంగా, అలాగే భౌతికంగా ఎదగడానికి చాలా అవసరం.
  • హక్కుల అమలు కేవలం న్యాయస్థానాల జోక్యం ద్వారానే కాకుండా, పౌరుల యొక్క చైతన్యం, అవగాహన పై కూడా ఆధారపడి ఉంటుంది. “నిరంతర జాగరూకతే” పై స్వేచ్చలకు మూలమని జె.ఎస్‌.మిల్‌ అనే రాజనీతి శాస్త్రజ్ఞుడు వ్యాఖ్యానించాడు (Eternal Vigilence is the Price of Liberty).
ఇతర భాగాలలో ఉన్న హక్కులు
  • మూడో భాగంలో పొందుపరచబడిన ప్రాథమిక హక్కులే కాకుండా రాజ్యాంగములోని మరికొన్ని భాగాలలో రాజ్యాంగ హక్కులు లేదా చట్టబద్ధమైన హక్కులున్నాయి. వీటినే ప్రాథమికేతర హక్కులు అంటారు.
ఉదా. 12వ భాగంలో 265 ప్రకారము చట్టపరమైన ఆధారము లేనిదే పన్నులు విధించరాదు.
  • 12వ భాగములో ప్రకరణ 300A ప్రకారం, వ్యక్తి యొక్క అస్తికి చట్ట బద్దంగా తప్ప మరే విధంగా  భంగం కలిగించరాదు
  • 15వ భాగంలో ప్రకరణ 326 ప్రకారం, వయోజన ఓటుహక్కును గుర్తించారు. పై హక్కులకు కూడా న్యాయ సంరక్షణ ఉన్నప్పటికీ ప్రాథమిక హక్కులతో సమానం కావు,
  • వీటి అమలు, రక్షణకోసం ప్రకరణ-32 ప్రకారం సుప్రీం కోర్టును ఆశ్రయించడానికి వీలులేదు. అయితే ప్రకరణ-226 ప్రకారం హైకోర్టు ద్వారా రక్షణను పొందవచ్చు.
రాజ్యాంగ సమీక్షా కమీషన్‌ సూచించిన ఇతర ప్రాథమిక హక్కులు
  • 2002 సం.లో జస్టిస్‌ వెంకట్రామయ్య అధ్యక్షతన నియమించిన రాజ్యాంగ సమీక్ష కమీషన్‌, కమీషన్‌ మూడవ భాగంలో ప్రాధమిక హక్కుల జాబితాలో ఈ క్రింది హక్కులను కూడా పొందుపరచాలని సిఫారసు చేసింది.
  • పత్రికా స్వేచ్చ - సమాచార స్వేచ్చ 
  • క్రూర శిక్షలకు వ్యతిరేకంగా రక్షణ
  • పని హక్కు 
  • రహస్యాలను కాపాడుకునే హక్కు
  • రక్షిత మంచినీరు 
  • పర్యావరణ హక్కు
  • న్యాయాన్ని న్యాయసలహాను పొందే హక్కు

Post a Comment

0Comments

Post a Comment (0)