రాజ్యాంగ పరిషత్తు - అదనపు, విశిష్ట సమాచారం (Additional Information of Constituent Assembly)
- రాజ్యాంగ పరిషత్తు రచనకైన ఖర్చు రూ. 64 లక్షలు(The cost of writing the Constituent Assembly is Rs. 64 lakhs)
- భారత రాజ్యాంగానికి ఆధార రాజ్యాంగాల సంఖ్య 60
- రాజ్యంగ పరిషత్తులో నామినేటెడ్ సభ్యుల సంఖ్య 15. అందులో ముఖ్యమైన వారు - సర్వేపల్లి రాధాకృష్ణన్, కె.టి. షా (Nominated Members of the Constitutional Assembly)
- రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు కానివారు - బి.యన్. రావు, ఎస్. వరదాచారియర్, హెచ్.వి. కామత్,
- డా॥ బి.ఆర్. అంబేద్కర్‌ను రాజ్యాంగ నిర్మాతగా (ఆర్కిటెక్ట్) అభివర్ణించినది - అనంత శయనం అయ్యంగార్
- డా॥ బి.ఆర్. అంబేద్కర్‌ను నైపుణ్యమున్న పైలెట్‌గా పేర్మొన్నది - డా॥ ఆర్. రాజేంద్రప్రసాద్.
- డా॥ బి.ఆర్. అంబేద్కర్, గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి క్రిష్టస్వామి అయ్యర్, బి.ఎన్.రావును పెట్టి ఫోరం అంటారు
- డా॥ బి.ఎన్. రావును రాజ్యాంగ పరిషత్తుకు స్నేహితుడిగా, మార్గదర్శిగా, తత్వవేత్తగా పేర్కొంటారు.
- రాజ్యాంగ పరిషత్తులో ఎక్కువ సవరణలు ప్రతిపాదించినది - హెచ్.వి. కామత్
- రాజ్యాంగ పరిషత్తుకు కార్యదర్శిగా వ్యవహరించింది - హెచ్.బి. అయ్యంగార్
- రాజ్యాంగ పరిషత్తులో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించినది - సోమనాథ్ లహరి
- రాజ్యాంగ విధులను నిర్వర్తించే సమయంలో మాత్రమే డా॥ రాజేంద్రప్రసాద్ అధ్యక్షులుగా వ్యవహరించారు.
- రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక పార్లమెంటుగా శాసన విధులను నెరవేర్చునప్పుడు స్పీకరుగా జి.వి. మౌలాంకర్ వ్యవహరించారు. ఉపాధ్యక్షుడిగా అనంత శయనం అయ్యంగార్ వ్యవహరించారు.
- రాజ్యాంగ పరిషత్తును ఉద్దేశించి చివరిగా మాట్లాడిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్‌బాటన్.
- రాజ్యాంగ రచన కాలీగ్రాఫర్ (Calligrapher) - ప్రేమ్ బెహారి నారాయణ్ రైజ్దా
- రాజ్యాంగానికి, ప్రవేశికకు ఆర్ట్ వర్క్ చేసినది - నందన్ లాల్ బోస్
- మౌలిక రాజ్యాంగ ప్రతిని పార్లమెంటు లైబ్రరీలో భద్రపరిచారు.
- మౌలిక రాజ్యాంగంలో 230 పేజీలు (230 leaves) ఉన్నాయి.
- హన్సా మెహత భారత జాతీయ పతాకాన్ని రాజ్యాంగ పరిషత్తులో సమర్పించారు.
రాజ్యాంగ పరిషత్తు నిర్మాణం పనితీరుపై విమర్శ
- రాజ్యాంగ పరిషత్తు సార్వభౌమ సంస్థ కాదు. ప్రజలకు నేరుగా ప్రాతినిధ్యం వహించలేదు. కేవలం 28% జనాభాకు మాత్రమే ప్రాతినిధ్యం లభించింది.
- ప్రజలు తమని తాము వ్యక్తీకరించుకోవడానికి అవసరమైన స్వేచ్భా స్వాతంత్య్రాలకు అవరోధాన్ని కల్పించింది.
- స్వదేశీ సంస్థానాల ప్రతినిధులు నామినేషన్ పద్ధతి ద్వారా సభ్యత్వాన్ని పొందడం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం.
- రాజ్యాంగ పద్ధతిలో ఒక వర్గానికి చెందిన (హిందువులు) ఆధిపత్యం ఉండేదని పాశ్చాత్య రచయితల అభిప్రాయం.
ప్రముఖుల అభిప్రాయాలు
- భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చినది - హెచ్.వి. కామత్
- భారత రాజ్యాంగ పరిషత్తు భారత ప్రజలు తమను తాము వ్యక్తీకరించుకోవడానికి, వారి స్వేచ్చా స్వాతంత్ర్యాలకు అవరోధాన్ని కల్పించింది. అది బ్రిటీషు సామ్రాజ్య వాదుల సృష్టి - లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ
- భారత రాజ్యాంగం ఇతర రాజ్యాంగాలన్నింటిని కొల్లగొట్టి రూపొందించినదిగా వర్ణిస్తే నేను గర్వపడతాను. ఎందుకనగా, మంచి ఎక్కడున్నా గ్రహించడం తప్పేమీ కాదు. - బి.ఆర్. అంబేద్కర్
- రాజ్యాంగం వైఫల్యం చెందితే రాజ్యాంగాన్ని నిందించరాదు. అమలు పరిచేవారిని నిందించాలి. - బి.ఆర్. అంబేద్కర్
- భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం, సుదీర్ణమైనది, దివ్యమైనది - సర్ ఐవర్ జెన్నింగ్స్
- అతుకుల బొంత, రాజ్యాంగ పరిషత్తులో నెహ్రూ, పటేల్, రాజేంద్ర ప్రసాద్, అంబేద్కర్, “గ్యాంగ్ ఆఫ్ ఫోర్” మండలిగా అభివర్ణించినది. - గ్రాన్‌విల్ ఆస్టిన్
- రాజ్యాంగ పరిషత్ కేవలం హిందువులకు మాత్రమే ప్రాతినిధ్యం వహించింది - లార్డ్ సైమన్
- రాజ్యాంగ పరిషత్తు దేశంలో ఒక ప్రధాన వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించింది. - విన్‌స్టన్ చర్చిల్
- రాజ్యాంగ పరిషత్తు నిర్మాణంలో ప్రజాభిప్రాయ ఛాయలు లేవు - కె. సంతానం
- భారత రాజ్యాంగం ప్రజల బహుళ అవసరాలను, ప్రయోజనాలను నెరవేర్చింది, పరిషత్తుకు సార్వభౌమాధికారం లేదనే వాదనను తిరస్మరిస్తున్నాను - జవహర్‌లాల్ నెహ్రూ
- రాజ్యాంగ రచనలలో సమన్వయ పద్ధతి కంటే సర్దుబాటు పద్ధతికే ప్రాధాన్యత ఇచ్చారు - ఓషి. గోయల్