భారత సమాఖ్య వ్యవస్థ

TSStudies
0
Supreme Court Judgements on Fundamental Duties in Telugu

భారత సమాఖ్య వ్యవస్థ
విశిష్ట లక్షణాలు శాసన, పరిపాలన, ఆర్ధిక సంబంధాలు
(Indian Federal System-Distinctive Features)

Federation by Integration,Federation by disintegration,Indian Federal System in telugu,Indian Federal System and Distinctive Features notes in telugu,
కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధాల ఆధారంగా రాజకీయ వ్యవస్థలను సమాఖ్య లేదా ఏక కేంద్ర ప్రభుత్వాలుగా వర్గీకరిస్తారు.

కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన ఉంటే సమాఖ్య వ్యవస్థగా, అధికారాలన్నీ ఒకే ప్రభుత్వములో కేంద్రీకృతమై ఉంటే దానిని ఏక కేంద్ర ప్రభుత్వంగా పేర్కొంటారు.
సమాఖ్య అనే పదాన్ని ఆంగ్లంలో 'Federation' అంటారు. ఈ పదము లాటిన్‌ భాషలోని “ఫోడస్‌” (Foedus) అనే పదము నుండి ఉద్భవించింది. ఫోడస్‌ అనగా ఒప్పందము లేదా అంగీకారము. సమాఖ్య ప్రభుత్వాలు సాధారణంగా కేంద్రము రాష్ట్రాల మధ్య ఒప్పందము ద్వారా ఏర్పడతాయి.

సమాఖ్య వ్యవస్థకు ఉదాహరణలు: అమెరికా, కెనడా, స్విట్టర్లాండ్‌, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, అర్జంటీనా, పాకిస్థాన్‌, శ్రీలంక మొదలైనవి.

ఏక కేంద్ర వ్యవస్థ:
ఈ తరహా వ్యవస్థలో అధికారాలన్ని ఒకే ప్రభుత్వంలో కేంద్రీకృతమై ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు
ఉండవు. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రాంతాలను కొన్ని యూనిట్లుగా విభజిస్తారు. వీటికి స్వతంత్ర ప్రతిపత్తి ఉండదు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి.

ఏక కేంద్ర వ్యవస్థకు ఉదాహరణలు : బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జపాన్‌, చైనా, ఇటలీ, బెల్జియం మొదలైనవి.

సమాఖ్య ఏక కేంద్రాల మధ్య పోలికలు, తేడాలు 
సమాఖ్య ప్రభుత్వం
  • కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన ఉంటుంది
  • లిఖిత మరియు ధృఢ రాజ్యాంగం తప్పనిసరి 
  • ద్వంద్వ ప్రభుత్వాలు ఉంటాయి 
  • కేంద్ర శాసనసభ ద్విసభా విధానాన్ని కలిగి ఉండాలి. 
  • స్వతంత్ర సర్వోన్నత న్యాయవ్యవస్థ ఉంటుంది. 
  • రాజ్యాంగ ఆధిక్యత ఉంటుంది 
ఏక కేంద్ర ప్రభుత్వం
  • అధికారం కేంద్రీకృతమై ఉంటుంది.
  • ఏ తరహా రాజ్యాంగంమైనా ఉండవచ్చు.
  • కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఉంటుంది.
  • ద్విసభా విధానం తప్పనిసరి కాదు.
  • న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు
  • కేంద్ర ప్రభుత్వ ఆధిక్యత ఉంటుంది.

సమాఖ్య ఏర్పడే పద్ధతులు

సమాఖ్య సాధారణంగా రెండు పద్ధతుల ద్వారా ఏర్పాటవుతుంది.

రాష్ట్రాల కలయిక వల్ల ఏర్పడే సమాఖ్య (Federation by Integration)

ఈ తరహాలో, స్వతంత్రంగా ఉన్న రాష్ట్రాలు ఆర్థిక, రాజకీయ మరియు సైనిక కారణాల వల్ల సమీకృతమై సమాఖ్యగా ఏర్పడతాయి. ఉదా. అమెరికాలోని రాష్ట్రాలన్నీ ఒక ఒప్పందము ద్వారా 1787లో అమెరికా సంయుక్త రాష్ట్రాలు అనే సమాఖ్య రాజ్యంగా ఏర్పడ్డాయి.

ఈ పద్ధతి "Coming together" పద్ధతి.

విచ్చిత్తి ప్రక్రియ వల్ల ఏర్పడే సమాఖ్య (Federation by disintegration)

భౌగోళికముగా, జనాభాపరంగా పెద్ద దేశాలు, పరిపాలనా సౌలభ్యం కోసం కొన్ని స్వతంత్ర ప్రతిపత్తిగల రాష్ట్రాలను ఏర్పాటు చేసి, వాటికి రాజ్యాంగపరంగా అధికారాలు బదలాయిస్తాయి. ఉదా. 1867లో ఏక కేంద్రంగా ఉన్న కెనడా 10 కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసి సమాఖ్యగా అవతరించింది.

ఈ పద్ధతి "Holding together"పద్ధతి.

Post a Comment

0Comments

Post a Comment (0)