Supreme Court Judgements on Fundamental Duties in Telugu
ప్రాథమిక విధులు - సుప్రీంకోర్టు తీర్పులు
శ్యాం నారాయణ్ చాక్సీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా
జాతీయ పతాకాన్ని ప్రైవేట్ వ్యక్తులు ప్రచారం కోసం వినియోగించరాదని ఈ కేసులో సుప్రీం కోర్టు పేర్కొంది.
బిజో మాన్యూవల్ Vs కేరళ (1986)
జాతీయ గీతాన్ని తప్పనిసరిగా ఆలపించవలసిన అవసరం లేదని ఈ కేసులో సుప్రీం కోర్టు పేర్కొంది. జాతీయ గీత ఆలాపన అనేది వారి మత విశ్వాసాలకు విరుద్ధం అయితే దానికి మీనహాయింపు ఉంటుంది. అయితే జాతీయ గీతాన్ని ఆలపించినప్పుడు అందరూ గౌరవ సూచికంగా నిలబడాలని పేర్కొంది.
అభిల భారత వైద్య విజ్ఞాన సంస్థ Vsస్టూడెంట్ యూనియన్ (2002)
ప్రాథమిక విధులు విస్మరించరాదని అది దేశ సమగ్రతకు, సామాజిక జీవనానికి ఆదర్శంగా ఉంటాయని పేర్కొంది.
దాశరధి Vs ఆంధ్రప్రదేశ్
ఆస్థాన కవుల హోదా చెల్లదని ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.
గ్రామీణ వ్యాజ్యాలు హక్కుల కేంద్రం Vs ఉత్తరప్రదేశ్ (1986)
పర్యావరణ పరిరక్షణలో ప్రాథమిక విధులను తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది.
నవీన్ జిందాల్ Vsయూనియన్ ఆఫ్ ఇండియా (2004)
జాతీయ జెండాను ఎగరవేయడం భావ వ్యక్తీకరణ క్రిందికి వస్తుందని, పౌరులు స్వేచ్చగా జెండా ఎగురవేసే హక్కు ఉంటుందని పేర్కొంది.
ప్రాథమిక విధులు - జస్టిస్ జె.ఎస్. వర్మ కమిటీ సూచనలు
1999లో నియమించబడిన వర్మ కమిటీ ప్రాథమిక విధులకు సంబంధించి కొన్ని సిఫారసులు చేసింది. అవి
జాతీయపతాకం, జాతీయగీతం, భారత రాజ్యాంగ పరిరక్షణకు, గౌరవానికి సంబంధించి, 1971లో చేసిన చట్టం సరిపోతుందని పేర్కొంది. అలాగే భారతీయ శిక్షా సృృతిలో ఉన్న సెక్షన్లు, ఈ క్రింది చట్టాల ద్వారా కొన్ని విధులను అమలు చేయవచ్చని చెప్పింది.
- పౌరహక్కుల పరిరక్షణ చట్టం - 1955
- ప్రజా ప్రాతినిధ్య చట్టం - 1951
- చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం - 1967
- వన్యప్రాణి సంరక్షక చట్టం - 1972
- అడవుల పరిరక్షణ చట్టం - 1980
మరి కొన్ని సిఫారసులు
- ప్రతి సంవత్సరం జనవరి 3ను ప్రాథమిక విధుల దినోత్సవంగా పాటించాలి.
- అన్ని విద్యా ప్రణాళికల్లో ప్రాథమిక విధులను పాఠ్యాంశంగా చేర్చాలి.
- అన్ని విద్యా సంస్థలలో ఎన్.సి.సి.ని తప్పక ప్రవేశ పెట్టాలి.
- ప్రసార మాధ్యమాల ద్వారా ప్రాథమిక విధుల గురించి విసృత ప్రచారం కల్పించాలి.
ప్రాథమిక విధులు - ప్రముఖుల వ్యాఖ్యానాలు
ఆదేశిక సూత్రాలు అమలు ప్రభుత్వ చిత్తశుద్ధిపై ఆధారపడినట్లే, ప్రాధమిక విధుల అమలు అనేది వ్యక్తుల చిత్త శుద్ధిపై ఆధారపడి ఉంటుంది - దుర్గాదాస్ బసు
ప్రాథమిక విధులు కేవలం అలంకారపూర్వకమైనవి - జస్టిస్ కె.పి ముఖర్జీ
హక్కులు, విధులనేవి ఒకే నాణానికి ఉన్న ముఖాలు (Two side of a same coin ) - హెచ్.జె. లాస్కి
ప్రాథమిక విధులు అసంబందధ్ధంగా, గందరగోళంగా ఉన్నాయి. - నానీ పాల్కీవాలా