ప్రాథమిక విధులు - ప్రయోజనాలు

TSStudies
0
Uses of Fundamental Duties in Telugu

Uses of Fundamental Duties in Telugu

ప్రాథమిక విధులు

51(A)
  1. రాజ్యాంగానికి కట్టుబడి ఉండి, దాని ఆదర్శాలను, సంస్థలను, జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించటం
  2. జాతీయ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో గల ఉన్నత ఆదర్శాలను పాటించడం
  3. భారతదేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను, సమగ్రతను పరిరక్షించటం
  4. దేశరక్షణకు, జాతీయ సేవకు సదా సన్నద్ధంగా ఉండటం
  5. భారత ప్రజల మధ్య మత, భాష, ప్రాంతీయ, వర్గ, వైవిధ్యాలకు అతీతంగా సోదరభావాన్ని స్ఫూర్తిని పెంపొందించటం, స్తీ గౌరవాన్ని భంగపరిచే ఆచారాలను త్యజించటం
  6. భారత మిశ్రమ సంస్కృతిని, ఔన్నత్యాన్ని సంప్రదాయాన్ని గౌరవించి పరిరక్షించటం
  7. అడవులు, సరస్సులు, నదులు వన్యప్రాణులతో సహా ప్రకృతిలోని పరిసరాలను కాపాడటం, అభివృద్ధి చేయటం, జీవులపట్ల కారుణ్యం కలిగి ఉండటం
  8. శాస్త్రీయ దృక్పథాన్ని మానవ జిజ్ఞాసని, పరిశోధన, సంస్కరణ స్ఫూర్తిని పెంపొందించుకోవడం
  9. ప్రజల ఆస్తిని సంరక్షించడం, హింసను విసర్జించడం
  10. తమ వ్యక్తిగత, సమిష్టి చర్యల ద్వారా ప్రతి కార్యరంగంలోనూ అత్యున్నత స్టానాన్ని పొందడానికి కృషి చేయడం, తద్వారా దేశ అత్యున్నత అభ్యుదయానికి తోడ్పడటం
  11. 6 నుంచి 14 సం॥ లోపు గల తమ పిల్లలకు విద్యావకల్పించే బాధ్యతను తల్లి లేడా తండ్రి లేడా సంరక్షకుడు నిర్వర్తించడం

ప్రాథమిక విధులు - విమర్శనాత్మక పరిశీలన
  • ప్రాథమిక విధుల చేరికపై అనేక విమర్శలు ఉన్నాయి. భారత పౌరులు సహజంగా చట్ట విధేయులు, క్రమశిక్షణ గలవారు అయినప్పుడు వారి బాధ్యతలను ప్రత్యేకంగా గుర్తు చేయడం సమంజసం కాదు.
  • అత్యంత ముఖ్యమైన విధులైన పన్నుల చెల్లింపు, కుటుంబ నియంత్రణ, ఎన్నికల్లో ఓటు చేయడం, మొదలగు వాటిని ప్రాథమిక విధులలో పొందుపరచలేదు.
  • ఈ విధులు కేవలం నైతికపరమైన నియమావళియే. వీటిని పాటించకపోతే శిక్షించే ఆస్కారం లేదు.
  • ప్రాథమిక విధులలో పేర్కొన్న కొన్ని పదాలకు స్పష్టత లేదు. ఉదా. శాస్త్రీయ దృక్పథం, మిశ్రమ సంస్కృతి, పరిశోధనా స్ఫూర్తి అనే పదాలకు నిర్ణీత అర్థాలు లేవు.
  • వీటిని నాలుగవ భాగంలో కాకుండా మూడో భాగంలోనే చేర్చి ఉండాల్సింది.
  • సాధారణంగా ప్రాథమిక విధులు ప్రజాస్వామ్య రాజ్యాంగంలో అంతర్భాగంగా ఉండవు. నియంతృత్వ దేశాల రాజ్యాంగంలో మాత్రమే ఉండటం సాంప్రదాయం.
  • చట్ట నిర్దేశానికి, ఆత్మ ప్రబోధానికి మధ్య వైరుధ్యాన్ని ప్రాథమిక విధులు కలిగించవచ్చు.
  • ప్రజలే సార్వభౌములు అని గుర్తించిన రాజ్యాంగం వారికి విధులను నిర్ధేశించడం సమంజసం కాదు.

ప్రాథమిక విధులు - ప్రయోజనాలు
  • ప్రాథమిక విధులకు న్యాయ సంరక్షణ లేనప్పటికీ, కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, వీటిని రాజ్యాంగంలో చేర్చడం సమంజసమే. ఎందుకంటే విధులు లేకుండా హక్కులు మాత్రమే గుర్తిస్తే అది బాధ్యతా రాహిత్యానికి దారితీస్తుంది. అలాగే హక్కులు లేని బాధ్యతలు బానిసత్వానికి ప్రతీక అవుతాయి. కనుక హక్కులు, విధులు, పరస్పర పోషకాలు. అవి ఒకే నాణానికి ఉన్న రెండు పార్వ్వాలు.
  • ప్రాథమిక విధులు కూడా ఆదేశిక సూత్రాల లాగా ప్రభుత్వ విధానాలను, కార్యాచరణను ప్రభావితం చేస్తాయి.
  • ఆచరణాత్మకమైనవి కాకపోయినా నిరంతరం పౌరుల నైతిక బాధ్యతలను గుర్తు చేస్తాయి.
  • అనేక వైవిధ్యాలున్న భారతదేశంలో పౌరులు చిత్తశుద్ధితో, విశాల దృక్పథంతో బాధ్యతాయుత పౌరులుగా దేశ ఐక్యతకు, సమగ్రతకు, కృషి చేసేలా సహాయ పడతాయి.
  • ప్రాథమిక విధులను, ప్రాథమిక హక్కులపై గల హేతుబద్ధమైన పరిమితులుగా పరిగణించవచ్చని 1992లో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

Post a Comment

0Comments

Post a Comment (0)