నిర్దేశిక నియమాలు - సుప్రీంకోర్టు తీర్సు- వ్యాఖ్యానాలు

TSStudies
0
supreme court judgments on directive principles in telugu

Supreme Court Judgments on Directive Principles

నిర్దేశిక నియమాలు - సుప్రీంకోర్టు తీర్సు- వ్యాఖ్యానాలు

కేశవానంద భారతి Vs స్టేట్‌ ఆఫ్‌ కేరళ (1978)

ప్రాథమిక హక్కులు, నిర్దేశిక నియమాలు పరస్పర పోషకాలు అని, ప్రాథమిక హక్కులు వ్యక్తిగత వికాసానికి తోడ్పడితే నిర్దేశిక నియమాలు సమాజ హితానికి ఉపయోగపడతాయని వ్యాఖ్యానించింది. ఈ కేసును ప్రాథమిక హక్కుల కేసుగా అభివర్ణిస్తారు.

షాబానో బేగం Vs మహ్మద్‌ అహ్మద్‌ ఖాన్‌ (1985)

ఇది ముస్లిం స్త్రీల మనోవర్తికి సంబంధించిన కేసు. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ సెక్షన్‌ 125 ప్రకారం భార్యకు భర్త నుంచి భరణం పొందే హక్కు ఉంటుంది. ఇది ముస్లిం మహిళలకు కూడా వర్తిస్తుందని పేర్కొంది.

ఉన్ని క్రిష్ణన్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (1993)

14 సం॥లోపు బాల బాలికలకు ఉచితం నిర్బంధ ప్రాథమిక విద్యను బోధించాలని ప్రకరణ 21లో పేర్కొనబడింది. ఇది వ్యక్తి గౌరవ హక్కుల్లో అంతర్భాగమని పేర్కొంది.

సరళ ముద్గల్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (1995)

దీనిని ఉమ్మడి సివిల్‌ కేసుగా పరిగణిస్తారు. హిందువులు మతమార్పిడి ద్వారా రెండవ వివాహం చేసుకుంటే అది చెల్లదు. భారత పౌరులుగా ఉన్నంతవరకు ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ వారు భారత చట్టాలకు కట్టుబడి ఉండాలి. ఉమ్మడి సివిల్‌ కోడ్‌ను అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించింది.

సిద్దాస్‌ Vs యూనియన్‌ స్టేట్‌ ఆఫ్‌ ఢిల్లీ (1996)

ఉచిత న్యాయ సహాయాన్ని అవసరమైన వారికి చేకూర్చవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందని, ఇది ప్రకరణ 21 ప్రకారం ప్రాథమిక హక్కుగా పరిగణించవచ్చని పేర్కొంది.

పన్నాలాల్‌ బన్సిలాల్‌ పాటిల్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (1996)

ప్రకరణ 44 ప్రకారం ఉమ్మడి సివిల్‌ కోడ్‌ అందరికి వాంఛనీయమైనప్పటికీ వాటిని తప్పనిసరిగా అమలు చేసేలా న్యాయస్థానాలు తీర్పులు చెప్పలేవని ప్రభుత్వాలు, చట్టసభలు దీని అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.

ఎం.సి మెహతా Vs స్టేట్‌ ఆఫ్‌ తమిళనాడు (1997)

బాల కార్మిక వ్యవస్థ ప్రాథమిక హక్కుల ఉల్లంఘనమని, దానిని నిర్మూలించడానికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని సూచించింది. దీనిని బాల కార్మిక వ్యవస్థ నిషేధ కేసుగా పేర్కొంటారు.

Post a Comment

0Comments

Post a Comment (0)