నిర్దేశిక నియమాల అమలుకు తీసుకున్న చర్యలు
భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 65 సం॥ అయ్యింది. నిర్దేశిక నియమాల అమలుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలు రూపొందించాయి. అలాగే అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. వాటిని ఈ క్రింది విధంగా పరిశీలించవచ్చు.
- సమాజిక, ఆర్ధిక న్యాయం కొరకు, ఆదాయాలలో అసమానతను తగ్గించడానికి సంపదను జాతీయం చేశారు.
 - 1950లో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసి, పంచవర్ష ప్రణాళికలను అమలు చేసారు.
 - భూసంస్కరణ చట్టాలను రూపొందించి, జమిందారీ, జాగిర్జారీ, ఇనాందారీ వ్యవస్థలను రద్దు చేశారు. కౌలుదార్లకు హక్కులు కల్పించారు.
 - కార్మికుల కోసం కనీస వేతనాల చట్టం 1948
 - గ్రామీణ అభివృద్ధికోసం సమాజ వికాస పథకం 1952
 - సమాజ అభివృద్ధి పథకం 1953
 - అస్పృశ్యతా నివారణ చట్టం 1955
 - ప్రసూతి రక్షణ చట్టం 1961
 - బోనస్ చెల్లింపు చట్టం 1965
 - బ్యాంకుల జాతీయకరణ 1969
 - రాజభరణాల రద్దు చట్టం 1971
 - వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972
 - క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973
 - కనీస అవసరాల పథకం 1974
 - వెట్టిచాకిరి నిషేధ చట్టం 1976
 - మహిళల కోసం సమాన వేతన చట్టం 1976
 - పౌరహక్కుల పరిరక్షణ చట్టం 1976
 - సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకం 1978
 - అడవుల సంరక్షణ చట్టం 1980
 - బాలల కోసం బాల కార్మిక నిషేధ చట్టం 1986
 - ఉచిత న్యాయసలహా కోసం - లీగల్ సర్వీసుల చట్టం 1987
 - జాతీయ అడవుల విధానం 1988
 - ఎస్.సి.,ఎస్.టి.లపై అకృత్యాల నిషేధక చట్టం 1989
 - ఎస్.సి. ఎస్.టి.లకు ప్రత్యేక జాతీయ కమీషన్‌లు 1992
 - జాతీయ గ్రామీణ ఉపాధి పథకం(ప్రస్తుతం మహాత్మా గాంధి జాతీయ గ్రామీణ ఉపాధి పథకం) 2006
 - సహకార సంఘాల రాజ్యాంగ ప్రతిపత్తి 2011
 - కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల బోర్డు
 - చేనేత మగ్గాల బోర్డు
 - కాయిర్ బోర్డు
 - ఎస్.సి., ఎస్.టి. మరియు ఇతర బలహీన వర్గాలవారికి రిజర్వేషన్ చట్టం
 - మూడంచెల పంచాయితీ వ్యవస్థ కోసం 73వ రాజ్యాంగ సవరణ
 - చారిత్రక ప్రదేశాల పరిరక్షణ కోసం ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
 - మొదలగు అనేక చట్టాలు, వ్యవస్థలు నిర్దేశిక నియమాల అమలు కోసం ఉద్దేశించినవే.