నిర్దేశిక నియమాలపై ప్రముఖుల అభిప్రాయాలు

TSStudies
0
Difference between Directive Principles and Fundamental Rights in telugu

నిర్దేశిక నియమాలపై ప్రముఖుల అభిప్రాయాలు

  • బ్యాంకు సౌకర్యం ప్రకారం ముందు తేదిని చెల్లింపదగిన చెక్కు వంటిదని, విలువ లేని అనవసర సూత్రాలని వర్ణించారు (Post dated cheque payable at the convenience of the bank) - ప్రొ. కె.టి.షా
  • నిర్దేశిక నియమాలు ప్రతి కొత్త సంవత్సరం ప్రారంభ రోజున తీసుకునే తీర్మానాల వంటివి (New Year Resolutions) జనవరి 2వ తేదీనే భంగమవుతాయి. - నసీరుద్దీన్‌ షా
  • వైవిధ్య సెంటిమెంట్లతో కూడిన ఒక చెత్తబుట్ట వంటిది. - టి.టి. కృష్ణమాచారి.
  • సిడ్వి వెబ్‌, వీట్రిస్‌ వెబ్‌ అనే సంక్షేమ దయ్యాలు రాజ్యాంగ పుటల్లో వయ్యారంగా నడిచాయి, సామాజికవాదం లేకుండా ఫెబియన్‌ సామాజిక వాదాన్ని వ్యక్తీకరిస్తుంది. 20వ శతాబ్దంలో ఇవి సమంజసమే కానీ, 21వ శతాబ్దంలో వీటికి సమాధానం లేదు. వీటికి ఖచ్చితమైన తత్వములేదు. - ఐవర్‌ జన్నింగ్స్‌
  • ఆర్థిక ప్రజాస్వామ్యానికి మంచి మార్గము. 1935 చట్టంలోని Instrument of Infrastructure ను పోలి ఉన్నాయి. ఇవి కొత్త పోకడను సృష్టిస్తాయి. ఆదేశిక సూత్రాలను ఏ ప్రభుత్వము విస్మరించజాలదు. ఆలా విస్మరిస్తే వారు ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. - బి.ఆర్‌. అంబేద్కర్‌
  • సాంఘిక విప్లవ భావాలు ఆదేశ సూత్రాలలో సృష్టంగా కనబడతాయి. - గ్రాన్‌విలే ఆస్టిన్‌
  • నిర్దేశిక నియమాలను సంపూర్ణంగా అమలు చేస్తే భారతదేశం భూతల స్వర్గమవుతుంది.-ఎం.సి. చాగ్లా
  • నిర్దేశిక నియమాలు నైతిక ప్రవచనాలు. అధికారులు, ప్రభత్వం, వీటిని గౌరవించాలి. - బి.ఎన్‌. రావ్‌
  • ఈ నియమాలను ప్రజలకు బాధ్యత వహించే ఏ మంత్రివర్గం విస్మరింపజాలదు. - అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌.
  • శాసన వ్యవస్థకు కరదీపంలాంటిది - ఎమ్‌.సి. సెతల్‌వాడ్‌
  • నిర్దేశిక నియమాలకు న్యాయ సంరక్షణ కల్పించనంత వరకు వాటిని అంతగా పట్టించుకోరు. - కె. సంతానం
  • నిర్దేశిక నియమాల్లో అనేక విద్యా విలువలు కలిగి ఉండి, ప్రభత్వ పనితీరుకు నైతికతను-చేకూరుస్తాయి - కె.ఎమ్‌. మున్షి


నిర్దేశిక నియమాలు - విమర్శనాత్మక పరిశీలన

నిర్దేశిక నియమాల అమలు తీరును రాజనీతి శాస్త్రజ్ఞులైన ఐవర్ జెన్నింగ్స్, కె.సివేర్‌, నసీరుద్దీన్‌ షాలు తీవ్రంగా విమర్శించారు.

అస్పష్టం

ఈ సూత్రాల్లో ఎక్కువ భాగం అస్పష్టంగా, అసమగ్రంగా ఉండటం వల్ల వాటి వెనుక ఉన్న యోగ్యతను అర్ధం చేసుకోవడం కష్టం. కొన్ని సూత్రాలు సంక్షేమ రాజ్య స్థాపనకు సంబంధించినవే అయినా, దానికి అవసరమయిన ఏర్పాట్లు రాజ్యాంగంలో లేవు.

న్యాయసంరక్షణ లేకపోవడం

ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు. న్యాయ వ్యవస్థ. ఈ సూత్రాలను అమలుపరచమని ఆదేశించలేదు. అందువల్ల ఈ సూత్రాలను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి.

యథాతథ స్వభావము

19వ శతాబ్దంలో ఐర్లాండ్ రాజకీయ అనుభవాన్ని బట్టి ఆదేశిక సూత్రాలను భారత రాజ్యాంగంలో చేర్చారు. అందువల్ల యథాతథ స్వభావాన్ని కలిగి ఉన్నాయి. ఏ మార్చు లేకుండా ఈ సూత్రాలను అమలు జరిపితే భారతదేశం పురోగతి సాధించలేకపోవచ్చు, కాలానుగుణంగా ఈ సూత్రాలను మార్చాలి.

వైరుధ్యానికి దారి తీస్తాయి

ఆదేశిక సూత్రాలను అమలు చేసే సమయంలో ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగితే అది వాటి మధ్య వైరుధ్యానికి దారి తీయవచ్చు. ఈ విషయంలో పార్లమెంటుకు సుప్రీం కోర్టుకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడిన సందర్భాలు చాలా ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)