కేంద్ర రాష్ట్ర చట్టాల వివాదాల పరిష్కారానికి సంబంధించిన సూత్రాలు (Doctrines)

TSStudies
0

కేంద్ర రాష్ట్ర చట్టాల వివాదాల పరిష్కారానికి సంబంధించిన సూత్రాలు (Doctrines)

కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజనకు సంబంధించి వివాదాలు తలెత్తితే, వాటిని పరిష్కరించడానికి సుప్రీంకోర్టు కొన్ని న్యాయ సూత్రాలను అవలంభిస్తుంది. ప్రతి సూత్రానికి అంతర్గతంగా ఒక పరమార్థం ఉంటుంది. వాటిని ఈ క్రింది విధంగా వివరించవచ్చు.

డాక్ట్రిన్‌ ఆఫ్‌ పిత్‌ అండ్‌ సబ్‌స్టాన్స్‌ (Doctrine of Pith and Substance)
సమాఖ్య వ్యవస్థలో కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన జరిగిన సందర్భాలలో ఒక నిర్ణీత అంశం లేదా చట్టాన్ని ఒక జాబితాలో పొందుపరుస్తారు. ఆ జాబితాలో పొందుపరిచిన అంశం, మరొక జాబితాలో పొందుపర్చిన అంశాన్ని సందర్భానుసారం కొంతవరకు అతిక్రమించినా, ఆ చట్టాలను రద్దు చేయరు. అలాంటి సందర్భాలలో ఆ అంశంలోని సారాంశాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. దీనినే పిత్‌ అండ్‌ సబ్‌స్టాన్స్‌ అంటారు.

ఉదాహరణకు, మనీ లెండింగ్‌ (రుణమిచ్చుట) అనే అంశం రాష్ట్ర జాబితాలో ఉంది. దీనికి సాక్ష్యంగా ఆధారంగా వ్రాసే ప్రామిసరినోటు అనే అంశం కేంద్ర జాబితాలో ఉంది. మనీ లెండింగును నియంత్రిస్తు రాష్ట్రం చేసిన చట్టం సందర్భానుసారం కేంద్ర జాబితాలోని ప్రామిసరి నోటు అనే అంశంలోకి చొరబడినా, రాష్ట్రం తన శాసనసపరిధిని అతిక్రమించిందనే నెపంతో న్యాయస్థానం ఆ చట్టాలను కొట్టివేయదు. ఎందుకంటే ఆ చట్టంలోని ప్రధాన సారాంశము రాష్ట్ర జాబితాలోనే ఉంది. అనుకోకుండా ఆ చట్ట పరిధి కేంద్రజాబితాలోకి విస్తరించినా, ప్రధాన ఉద్దేశ్యము రాష్ట్ర జాబితాలోని అంశాన్ని నియంత్రించడమే అవుతుంది. కేంద్ర, రాష్ట్రాలు తమ పరిధులను అతిక్రమించాయనే సమస్య ఉత్పన్నమయినప్పుడు న్యాయస్థానం “పిత్‌ అండ్‌ సబ్‌స్టాన్స్‌” అనే సూత్రము ప్రకారం తీర్పులు చెబుతుంది. ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సదరన్‌ ఫార్మాస్యూటికల్‌ vs కేరళ ప్రభుత్వం (1981) అలాగే స్టేట్‌ ఆఫ్‌ రాజస్థాన్‌ vs చావ్లా కేసుల్లో స్పష్టీకరించింది."

డాక్ట్రిన్‌ ఆఫ్‌ కలరబుల్‌ లెజిస్‌లేషన్‌ (Doctrine of Colourable Legislation)
కేంద్ర రాష్ట్రాల అధికారాల విభజన ఉద్ధేశం రెండిటి మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తకుండా చూడడం. ఐతే శాసనశాఖ తన పరిధిలోలేని అంశాలను ఉన్నట్లుగా ఊహించుకుని దురుద్ధేశపూర్వకంగా చట్టాలు చేస్తే, అలాంటి చట్టాలను కలరబుల్‌ లెజిస్‌లేషన్‌ అంటారు. ఈ సూత్రం ముఖ్య ఉద్ధేశం, ప్రత్యక్షంగా చేయలేని పనిని పరోక్షంగా కూడా చేయకూడదు.
(You can not do indirectly what you can not do directly i.e., no person who has no title can not transfer it do others) ఉదాహరణకు, రైల్వేలు కేంద్ర జాబితాలో ఉంది. ఆ అంశాలపైన రాష్ట్ర శాసనసభలు చట్టాలు చేస్తే ఆ చట్టాలు కలరబుల్‌ లెజిస్‌లేషన్‌ అవుతాయి.

డాక్ట్రిన్‌ ఆఫ్‌ రిపగ్నెన్సి (Doctrine of Repugnacy)
"రిపగ్నెన్స్‌ అనగా, ఇష్టం లేకపోవడం లేదా అసంబద్ధం అని అర్ధం. ఒక చట్టం ఒక పనికి అనుమతించి, మరో చట్టం ఆ పనికి అనుమతిని నిరాకరిస్తే, దానిని అసంబద్ధం లేదా డాక్ట్రిన్‌ ఆఫ్‌ రిపగ్నెన్స్‌ అని అంటారు. ఉమ్మడి జాబితాలోని అంశాలపై పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభ చట్టాలు చేయవచ్చు. రెండిటి మధ్య వివాదం ఏర్పడితే, అంతిమంగా "కేంద్ర చట్టమే చెల్లుబాటు అవుతుంది. ఐతే, పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభ చట్టాలు రెండు కూడా పరస్పర విరుద్ధమైతే, డాక్ట్రిన్‌ ఆఫ్‌ రిపగ్నెన్సి ప్రకారం ఆ చట్టాల చెల్లుబాటును నిర్ణయిస్తారు.
ఉదాహరణకు, హత్య నేరానికి ఐ.పి.సి.302 ప్రకారం శిక్ష పడుతుంది. బాల నేరస్తులకు సంబంధించి ఒకవేళ ఆ రాష్ట్రం ప్రత్యేక చట్టం చేసి ఉంటే, ఆ రాష్ట్ర చట్టం ప్రకారిం వారిని విచారించి శిక్షించాల్సి ఉంటుంది. అలాంటి చట్టాలకు సి.ఆర్‌.పి.సిలో మినహాయింపు ఉంటే, రాష్ట్ర చట్టాలే చెల్లుబాటు అవుతాయి.

డాక్ట్రిన్‌ ఆఫ్‌ రెసిడ్యూరి పవర్స్‌ (Doctrine of Residuary Powers)
రెసిడ్యూరి అనగా మిగిలిపోయిన భాగం అని అర్ధం. మూడు జాబితాల్లో ప్రస్తావించబడని అంశాలను అవశిష్ట అధికారాల పేరుతో కేంద్రానికి ఇచ్చారు. కనుక అవశిష్ట అధికారాలపైన చట్టం చేసే అధికారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికే ఉంటుంది. ఈ సూత్రం ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వాన్ని బలోపేతం చేయడమే.
ఉదాహరణకు పార్లమెంటు అవశిష్ట అంశాలకు సంబంధించి పార్లమెంటు సంపద పన్ను చట్టం, 1957; బహుమతి పన్ను చట్టం 1957; కమిషన్‌ ఆఫ్‌ ఎంక్షైరి యాక్ట్‌ 1952 మొదలగు చట్టాలను రూపొందించింది. ఇవి డాక్ట్రిన్‌ ఆఫ్‌ ఆఫ్‌ రెసిడ్యూరి పవర్స్‌లోకి వస్తాయి.

 
డాక్టిన్‌ ఆఫ్‌ ఇమ్యూనిటి ఆఫ్‌ ఇన్‌స్తుమెంటాలిటీస్‌ (Doctrine of Immunity of Instrumentalities)
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆస్తులపై పరస్పరం పన్నులు విధించుకోడానికి మినహాయింపు ఉంది. దీనిని డాక్ట్రిన్‌ ఆఫ్‌ ఇమ్యూనిటి ఆఫ్‌ ఇన్‌స్టుమెంటాలిటీస్‌ అంటారు. ప్రకరణలు 285, 287, 288, 289లో వీటిని ప్రస్తావించారు.
ప్రకరణ 247 ప్రకారం, కేంద్ర జాబితాలో పొందుపరచిన అంశాలకు సంబంధించి, పార్లమెంటు అదనపు న్యాయస్థానాలను ఏర్పాటు చేసే అధికారం పార్లమెంటు కలిగి ఉంటుంది.

అవశిష్ట జాబితా (Residual List) (ప్రకరణ 248(1))
అవశిష్ట జాబితాలోని అంశాలపైన పార్లమెంటు మాత్రమే చట్టం చేస్తుంది. అవశిష్ట జాబితా అనగా రాష్ట్ర జాబితాలో లేదా ఉమ్మడి జాబితాలో కూడా ప్రస్తావించబడని అంశాలు.
ప్రకరణ 248(2) ప్రకారం, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలో లేని అంశాలకు పన్ను విధించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది.
అమెరికా, ఆస్ట్రేలియాలో అవశిష్ట అధికారాలను రాష్ట్రాలకు ఇచ్చారు. కెనడాలో అవశిష్ట అధికారాలు కేంద్రానికి ఇచ్చారు. భారత ప్రభుత్వ చట్టం, 1935 ప్రకారం అవశిష్ట అధికారాలను ఆనాటి గవర్నర్‌ జనరల్‌కు ఇవ్వడం జరిగింది.
ప్రకరణ 249(1) ప్రకారం, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాజ్యసభ 2/3 వంతు సభ్యుల మెజారిటీతో ఒక తీర్మానం చేస్తే, ఆ తీర్మానాన్ని లోక్‌సభ కూడా ఆమోదిస్తే ఆ అంశంపై పార్లమెంటు చట్టాలను రూపొందిస్తుంది. ఆ విధంగా రాష్ట్ర జాబితాలో అంశాలపై పార్లమెంటు చేసిన చట్టాలు ఒక సంవత్సరం వరకే అమలులో ఉంటాయి (ప్రకరణ 249(2) అవసరమయితే మరొక సంవత్సరం తీర్మానం ద్వారా పొడిగించవచ్చు. గడువు ముగిసిన తరువాత, ఆరు నెలలకు మాత్రమే అలాంటి చట్టాలు అమలులోకి ఉంటాయి. తాత్కాలికంగా కేంద్ర జాబితాలోకి బదలాయించబడిన అంశం తిరిగి రాష్ట్ర జాబితాలోకి చేరుతుంది.
ప్రకరణ 250(1) ప్రకారం, దేశంలో జాతీయ అత్యవసర పరిస్టితి (ప్రకరణ 352) అమలులో ఉన్నప్పుడు, పార్లమెంటు రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలను రూపొందిస్తుంది. అటువంటి శాసనం అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నంతకాలం చెల్లుబాటు అవుతుంది.
ప్రకరణ 250(2) ప్రకారం, అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన ఆరు మాసాల తర్వాత ఆ చట్టాలు రద్దవుతాయి.
ప్రకరణ 251 ప్రకారం, ప్రకరణలు 249 మరియు 250 అనుసరించి పార్లమెంటు రాష్ట జాబితాలో చేసిన చట్టాలకు, అంతకు ముందే రాష్ట్రాలు తమ జాబితాలో చేసుకున్న చట్టాలకు వైరుధ్యం ఏర్పడితే, పార్లమెంటు చేసిన చట్టమే చెల్లుబాటు అవుతుంది.
ప్రకరణ 252(1) ప్రకారం, రెండు లేదా అంతకంటె ఎక్కువ రాష్ట్రాలు ఉమ్మడి ప్రయోజనార్థము రాష్ట్ర జాబితాలో అంశాలపై చట్టాలు చేయమని కోరితే, అలా కోరిన రాష్ట్రాలకు వర్తింపచేస్తూ రాష్ట్ర జాబితాలోని అంశాలపైన పార్లమెంటు చట్టాలు రూపొందిస్తుంది.
ఉదాహరణకు, 
  • ఎస్టేట్‌ సుంకం చట్టం-1955; 
  • ప్రైజ్‌ కాంపిటీషన్‌ చట్టం -1955; 
  • వన్యప్రాణి సంరక్షణచట్టం - 1972; 
  • జలకాలుప్య నివారణ చట్టం-1974; 
  • పట్టణ, ఆస్తుల పరిమితి చట్టం-1976, 
  • మానవ అవయవాల మార్పిడి చట్టం-1994; మొదలగు చట్టాలను పార్లమెంటు రూపొందించి రాష్ట్రాలకు వర్తింపచేసింది.
ప్రకరణ 252(2) ప్రకారం, పై విధంగా రూపొందించబడిన శాసనాన్ని సవరించే లేదా రద్దు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది.
ప్రకరణ 253 ప్రకారం అంతర్జాతీయ ఒప్పందాల అమలుకోసం అవసరమైన శాసనాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంది. ఈ ఒప్పందాల అమలుకు రాష్ట్రాల చట్టాలు అవరోధాలుగా ఉంటే వాటిని పార్లమెంటు సవరించవచ్చు.
ఉదాహరణకు, ఐక్యరాజ్యసమితి ప్రత్యేక అవసరాల రక్షణచట్టం, 1947; జనీవా ఒప్పందం-చట్టం, 1960; హైజాకింగ్‌ వ్యతిరేక చట్టం 1982; మొదలైన చట్టాలను పార్లమెంటు రూపొందించింది.
ప్రకరణ 254 ప్రకారం, ఉమ్మడి జాబితాలోని వైరుధ్యాలను తొలగించడం పార్లమెంటు రూపొందించిన శాసనానికి రాష్ట్ర విధానసభలు రూపొందించిన శాసనం విరుద్దంగా ఉంటె, పార్లమెంటు రూపొందించిన శాసనానికి  ఆ రాష్ట్ర విధానసభలు రూపొందించిన శాస ద్ధ టే, పార్ల షా సనానికే ఆధిక్యత ఉంటుంది.
ప్రకరణ 255 ప్రకారం కొన్ని చట్టాలను రూపొందించే సమయంలో రాష్ట్రపతి, గవర్నర్‌ల పూర్వానుమతి అవసరం. ఒకవేళ అలాంటి చట్టాలు రూపొందించే ప్రక్రియలో వీరి పూర్వానుమతి లేకుండా చట్టాలను రూపొందిస్తే అవి చెల్లవు అని చేప్పే అధికారం రాష్ట్రపతి, గవర్నర్‌లకు ఉండదు. రాష్ట్రపతి, గవర్నర్‌ల అనుమతి తీసుకోవడమనేది కేవలం ప్రక్రియకు సంబంధించినదే కానీ, వారి అధికారాలకు సంబంధించినది కాదు.

Post a Comment

0Comments

Post a Comment (0)